మందు పొట్లం

 మందు పొట్లం

మా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఈనాటికి మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. మాది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామం . మా చింతాతయ్య గారు మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. మా ఊర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఉండేవి. ప్రధానమైన కులం రెడ్డి కులం . 


అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరంలో వయసు ఉండే ఒక  వ్యక్తి ఏదో అనారోగ్యం కోసం ఆయుర్వేదం మందు కోసం మా తాతయ్య గారి దగ్గరికి వచ్చాడు. రోగి లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత   ఆయుర్వేద మందుని కాగితంతో పొట్లాలు కింద కట్టి రోజుకు ఒక పొట్లం  తేనెతో వేసుకో వారం రోజుల తర్వాత మళ్లీ కనబడని చెప్పాడు తాతయ్య.

నాలుగు రోజుల తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున తాత గారి దగ్గరకు వచ్చి ఆ ఆ పొట్లం వేసుకున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి మొదలైంది అండి అంటూ చెప్పుకొచ్చాడు. తాతయ్య  "ఆ మందుకి కడుపునొప్పి రాద య్య!  మరి నువ్వు ఆ మందు ఎలా వేసుకున్నావు? అని అడిగాడు.   ఆ పొట్లం తేనె తోటి వేసుకున్నానండి అన్నాడు. అప్పుడు అసలు పరిస్థితి తాతయ్యకు అర్థమైంది. అయితే ఈ వ్యక్తి పొట్లం లోని మందు కాదు ఏకంగా పొట్లాన్ని తేనెతో మింగేసి ఉంటాడు అందుకే కాగితాలు అరగక కడుపు నొప్పి వచ్చింది అని అర్థమైంది తాతయ్యకి.

తాతయ్యకి నవ్వు ఆగలేదు. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది .  ఇంతకీ పొట్లo అంటే  తెలియని వాళ్ళు ఉండరని  నేను అనుకుంటాను. 



 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట