పోస్ట్‌లు

స్నేహం

 స్నేహం చూడగానే ఒక చిరునవ్వు ఆ పైన ఒక ఆత్మీయమైన పలకరింపు ఇదే కదా స్నేహానికి మొదటి మెట్టు. స్నేహం సాధారణంగా జ్ఞానం తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడికి వెళ్లిన తర్వాత బెంచ్ మీద మీద పక్కన కూర్చున్న వాడితో మొదలవుతుంది   సాయంకాలం పూట పార్కుల్లో ఎదురింటి కుర్రాళ్ళు   పక్కింటి కుర్రాళ్ళు తో ను బలపడుతుంది స్నేహం.  ఈ జీవనయానంలో ఎంతోమంది స్నేహితులు చేతులు   కలుపుతుంటారు విడిపోతుంటా రు. కొంతమంది   బ్రతుకుదారులు వేరైనా కడదాకా కలిసి ఉంటారు. పెరిగి   పెద్దయిన తర్వాత ఒక ఇంటివాడు అయిన తర్వాత పక్కింటి  వాళ్లతోటి ఎదురింటి వాళ్ళ తోటి స్నేహం మొదలవుతుంది.  అయితే నేను చెప్పబోయే వీళ్ళిద్దరు ఒక స్కూల్లో  చదువుకోలేదు. వయసులో చాలా తేడా వృత్తుల్లో తేడా అయినా ఒకే ఊరిలో కాపురం ఉంటూతెల్లవారి లేస్తే ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటూ రక్తసంబంధం లేకపోయినా బావగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ కాలక్షేపం చేసే  రామారావు విశ్వనాథ శాస్త్రి ల కథ. రామారావు ఆ ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యుడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఆనందంగా కా...

దేవుడు

 దేవుడు కాసులు ఉన్నవాడికి  లేనివాడికి ఆ దేవుడే దిక్కు  ముక్తి కోసం వచ్చే భక్తులకి  గుడి లోపల దేవుడు వరాలు ఇస్తాడు.  భుక్తి కోసం పడిగాపులు కాచే అన్నార్తులకి  భక్తుల చేత వరహాలిప్పిస్తాడు దేవుడు గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు  గుడిలోకి అడుగుపెట్టడు  ఎందుకని  గుడిలో నుంచి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ  దేవుడికి ప్రతిరూపాలని నమ్ముతాడు కాబట్టి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

8+8+8 రూల్

 ప్రతి మనిషి జీవితంలో కాలం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ప్రతి ఒక్కరూ కాలం విలువ గమనించి సద్వినియోగం చేసుకునే దిశలో మనం ముందుకు సాగాలి. ఒక రోజంటే 24 గంటల సమయం. ఇది అందరికీ సమానమే. అయితే దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మనిషికి మనిషికి తేడా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. ప్రతి వ్యక్తి బ్రతకడానికి ఏదో ఒక  వృత్తి చేయవలసి ఉంటుంది. దానికి ఎనిమిది గంటల సమయం కేటాయించుకోవాలి. ఇకపోతే ఒక రోజులో మిగిలినది 8 గంటల సమయం. ఈ ఎనిమిది గంటల సమయాన్ని తన కుటుంబం తోటి, స్నేహితుల తోటి, మత విశ్వాసాలతోటి, హాబీల తోటి, శారీరక ఆరోగ్యం కోసం నడక, పరిగెత్తడం, ఎక్సర్సైజులు చేయడం వంటి వాటి కి కేటాయించాలి. అప్పుడు కాలం సద్వినియోగం అవుతుంది.