పోస్ట్‌లు

భూత యజ్ఞం

భూత యజ్ఞం అనేది సనాతన ధర్మంలో ఉన్న అయిదు ప్రధాన పంచ మహా యజ్ఞాలలో (Pancha Maha Yajnas) ఒకటి. ఈ యజ్ఞాలు గృహస్తుడిగా జీవించే వ్యక్తి నిత్య కర్తవ్యంగా నిర్వహించవలసిన సత్కార్యాలను సూచిస్తాయి. వాటిలో: • దేవ యజ్ఞం – దేవతల పూజ • పితృ యజ్ఞం – పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు • ఋషి యజ్ఞం – వేదాధ్యయనము, గురు సేవ • మనుష్య యజ్ఞం – అతిథి సేవ, దానధర్మాలు • భూత యజ్ఞం – జంతువులు, పక్షులు, చిన్న జీవుల సేవ భూత యజ్ఞం అంటే ఏమిటి? "భూత" అంటే ఇక్కడ జీవరాశులు అన్న అర్థంలో వాడతారు – అంటే పశు, పక్షి, క్రిమికీటకాది జీవులు. భూత యజ్ఞం అనగా: "ఇతర జీవుల పట్ల కరుణతో, హింస లేకుండా, అవసరమైన ఆహారం, నీరు వంటి సహాయాన్ని అందించడం." భారతీయ సంప్రదాయంలో, మనుష్యులు ఈ భూమిపై ఒక్కరే కాదు. ఇతర జీవులంతా కూడా ఈ ప్రకృతి భాగస్వాములే. అందుకే, మన ఆహారం తయారీలోనైనా, మిగిలిన తినుబండారాలలోనైనా, ఏదో ఒక భాగాన్ని పక్షులకో, శునకాదులకు అర్పించే సంప్రదాయం ఉన్నది. భూత యజ్ఞం చేసేది ఎలా? భూత యజ్ఞం అనేది కొన్ని సాధారణ చర్యల ద్వారానే చేయవచ్చు: • ఇంటి వద్ద పక్షులకు తినుబండారాలు (ధాన్యాలు, నీరు) ఉంచడం • శునకాలు, పిల్లులు వంటి వీధి...

దేవుడి సొమ్ము

దేవుడి సొమ్ము  " రామా రెడ్డిగారు . మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట! . ఏ ఏడాది శిస్తు పూర్తిగా ఇవ్వరు. ఇలాగైతే ఎలాగండి!  అంటూ కోపంగా అరిచాడు వినాయకుడి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు.  ఆ మాటలకు రామా రెడ్డి  నవ్వుతూ  పంటలు పండక పోతే ఏం చేయమంటారండి ! మేము మటుకు దేవుడు సొమ్ము ఉంచుకుంటామా! మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి అన్నాడు.  సదరు  రెడ్డి గారికీ  ప్రతి ఏటా ఇదే మాట చెప్పడo అలవాటైపోయింది.  రెడ్డి గారి మాటలకి " ప్రతి ఏటా ఒక కారు మారుస్తున్నాడు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. కానీ దేవుడు సొమ్ములు కట్టడానికి మటుకు పంటలు పండలేదు అంటున్నాడు  అని మనసులో బాధపడ్డాడు హనుమంతరావు.  ఆ గ్రామంలో వినాయకుడు దేవాలయం అది పురాతన మైనది స్వయంభు ఆలయం. రోజు వందలాది భక్తులు వచ్చి కోరిన కోర్కెలు తీర్చుకోడానికి మొక్కులు మొక్కుతుంటారు. ప్రతిరోజు అక్కడ గణపతి హోమం , నిత్య పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటుంది.   ఎప్పుడో పూర్వకాలంలో ఎవరో భక్తులంతా కలిపి దానంగా 25 ఎకరాలు దేవుడికి ఇచ్చారు. ఆ భూమి అంతా ఆ ఊర్లో పలుకుబడి ఉన్న రెడ్డి  గారు కౌలు...

ఆ రోజుల్లో

ఉదయం ఎనిమిది గంటలు అయింది. నిండా పదేళ్లు కూడా లేని మనవరాలు "అమ్మ స్కూలుకు టైం అయిపోతోంది ! అని ఊరికే తొందర పెడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతున్న నా కూతురు వస్తున్నా ఉండవే! బయటికి గబగబా వచ్చి బాత్రూంలోకి పిల్లల్ని లాక్కుపోయింది. కాసేపు పిల్ల ఏడుపు తల్లి సముదాయింపు వెరసి తయారైన పిల్లనీ తీసుకుని తల్లి బయటికి వచ్చింది.  ఆ కాన్వెంట్ విద్యార్థిని చూస్తే ఆశ్చర్యమేసింది! స్కూలు యూనిఫామ్, మెడలో టై, స్కూల్ బ్యాడ్జి, కాళ్లకు బూట్లు సాక్సులు చేతికి స్కూల్ బ్యాగ్ , బ్యాగులో బరువైన పుస్తకాలు, పెన్సిల్లు రబ్బరు ఇరేజర్ పెట్టుకోవడానికి ఒక చిన్న పెట్టే, క్యారేజీ కి ఒక సంచి, నిండా నీళ్లతో ఒక వాటర్ బాటిల్, మధ్యలో స్నాక్స్ ఇది స్కూలుకు వెళ్లే విద్యార్థి అవతారం.  ఆ స్కూల్ బ్యాగ్ పైన రకరకాల బొమ్మలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. " స్కూల్ బ్యాగ్ చాలా బాగుంది అన్న నా ప్రశంసకి సమాధానంగా మా అమ్మాయి ఏముంది నాన్న ప్రతి ఏటా కొత్త బ్యాగు కొనడమే అంది. మొత్తానికి తల్లి, పిల్ల నోట్లో అన్నం కుక్కి ఏదో మాయ మాటలు చెప్పి సందు చివర స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. మా అమ్మాయి మొహం లో ఎంతో రిలీఫ్ కనబడింది. ఇంతకీ అది చదివ...