పోస్ట్‌లు

జీవితం

సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు.  " అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు. "కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. "అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి. బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి. రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే. స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది. "బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడ...

ఆఖరి చోటు

 ఆఖరి చోటు ప్రయాణం అంటే అందరికీ సరదాయే . అక్కడికి చేరడం అంటే అందరికీ భయమే కానీ చివరకు చేరేది ఆ చోటుకే మనకు భయం తెలియకుండానే చేర్చే చోటు. మనం ఆ చోటుకు చేరుతున్నామని తెలియకుండానే చేరే చోటు.  ప్రతి ప్రయాణానికి ముహూర్తం ఉంటుంది. మన అంతిమ ప్రయాణం మన చేతుల్లో ఉండదు మన చేతల్లో కూడా ఉండదు. ఆ ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించేది ఆ దేవుడు ఒక్కడే. ఆ చోటు అక్షయపాత్ర లాంటిది ఎంతమంది చేరిన మరి ఎంతోమందికి చోటు ఉంటుంది. దయాదాక్షిణ్యలు లేవు . ఎవరి కన్నీళ్లు పట్టవు గుండె అంతా బండరాయి. గుండె మండుతున్న బాధ్యతను మరిచిపోని ప్రదేశం. కావ్యాలు రచించిన కవులకి అదే పూల పాన్పు . సుమధుర గానాలు వినిపించిన వసంత కోకిలకు అదే ఆఖరి మజిలీ. నాడీ పట్టుకుని నలత చెప్పే వారు చివరకు చేరే చోటు రాజు బంటు తేడాలు లేవు  ఉన్నవాడు లేనివాడు అన్నది వట్టిమాటే. ఇంద్రుడైన ఒకటే దేవేంద్రుడైన ఒకటే ఇహపర బేధాలు లేవు. ఆ చోటులో అందరూ సమానులే. నిర్జీవమై ఆ చోటుకు చేరిన మమకారం గుప్పెడు మట్టిగా మారిపోతుంది. తలదించిన అహంకారం ఊపిరితోపాటు ఎగిరిపోతుంది. సంపాదించిన సొమ్ము బతికుండగా పెట్టిన సంతకంతో రెక్కలు వచ్చే ఎగిరిపోతుంది. మనది కాని చోట...

గురువు

గురువు బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. బడి అంటే భయం తొలగించి బుజ్జగించి లాలించి అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పేది గురువు అక్షరమనే ఆయుధాన్ని ఇచ్చి బ్రతుకు పోరాటపు యోధుడుగా తీర్చిదిద్దేవాడు గురువు. అజ్ఞానం తొలగించేది గురువు విజ్ఞానాన్ని పెంచేది గురువు. గుడిలో ఉండేది కనిపించని దైవం బడిలో ఉండే ది నడిచే దైవం. అమ్మ ఒడి దాటి గుడిలో అడుగుపెట్టిన బొమ్మని  అమ్మ లా ఆదరించేది గురువు. కార్గిల్ యుద్ధ వీరుడు అయిన కరోనాకు వైద్యం చేసే డాక్టర్ అయినా కష్టపడే కార్మికుడైన  పొలం దున్నే రైతైన ఆకాశాన్నంటే భవనాలు నిర్మించే ఇంజనీర్ అయిన ఒక గురువుకి శిష్యుడే ఆ శిష్యుడు గుండెల్లో గురువు ఒక దైవమే గురువు పాత్రకే ఉంది ఆ గౌరవం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279