పోస్ట్‌లు

స్నేహం ముసుగులో

ఇదే రామకృష్ణ ఇల్లు అనుకుంటా! ఏమి మార్పు లేదు. అప్పట్లోనే పడిపోతున్నట్టుగా ఉండేది. కొద్దిగా రిపేర్లు చేయించినట్టున్నారు. ఊరంతా మారిపోయింది. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారు. తారు రోడ్లు వేశారు. పూరిపాకలు తక్కువగా కనబడుతున్నాయి. అవును, ఇది రామకృష్ణ ఇల్లే. ఇంటి ముందు దుమ్ము కొట్టుకుపోయిన మగ్గం అలాగే ఉంది. అవతల అరుగు మీద ఎన్నిసార్లు ఆడుకున్నామో! ఎన్నాళ్ళయిందో వాడిని చూసి… అసలు నన్ను గుర్తుపడతాడా లేదా? ఎప్పుడో చిన్నప్పుడు ప్రతి ఏటా అమ్మమ్మని చూడడానికి వచ్చినప్పుడు ఎక్కువగా వీడితోటే ఆడుకునేవాడిని. నా కంటే రెండేళ్లు పెద్ద. అప్పట్లోనే వాళ్ల నాన్నకి సాయం చేసేవాడు. నేను వచ్చానంటే వాళ్ల నాన్న – "ఆడుకో!" అంటూ పంపించేవాడు. పాపం, వాళ్ల నాన్న మగ్గం నడిపితే గాని బ్రతుకు గడిచేది కాదు. ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చి, "రామకృష్ణ!" అని గట్టిగా పిలిచాను. "లేరండి, బయటకి వెళ్లారు!" – ఎవరిదో పిల్లల గొంతు వినిపించింది. "నా పేరు ప్రవీణ్. నీవు, నేను రామకృష్ణ ఫ్రెండ్స్. అమెరికా నుంచి వచ్చాను" అని చెప్పండి అని పిల్లాడితో చెబుతూనే వెనక్కి తిరిగి వెళ్తుండగా, తలుపు తెరచిన చప...

పేరంటం

ఏమిటి ఇవాళ కూడా శనగ ల వేపుడేనా! అని అడిగాడు రాజారావు భోజనం వడ్డిస్తున్న భార్య సుమతిని.  అవునండి! శ్రావణమాసం నోములు కదా! పేరంటానికి వెళ్లొచ్చాను అంది సుమతి.  ఈ వారంలో అప్పుడే రెండోసారి! శనగల వేపుడు ఏమిటో అని విసుక్కున్నాడు రాజారావు వచ్చిన శనగ లు పారేసుకుంటామా ఏమిటి! ఇది దేవుడి ప్రసాదంలాటి దేరా అంది అమ్మ వాకిట్లోంచి.  నీకు గుర్తు లేదేమిటి రా! చిన్నప్పుడు మీ పిన్ని తో పాటు నువ్వు కూడా పేరంటానికి వెళ్లే వాడివి. కోతి పేరంటాలని ఏడిపించేవారు. దాని అర్థం తెలియక అదే మాట పదేపదే సార్లు ఇంటికి వచ్చి అనుకుంటూ ఉండేవాడివి. మేమంతా నవ్వే వాళ్ళము అంది అమ్మ. అప్పుడు మీరు అంతా పచ్చి శనగలు బొక్కేసేవారు అoది అమ్మ. ఇప్పుడు శనగల వేపుడు అంటే అలా మొహం అలా చిట్లించుకుంటావు ఏంటి అంది అమ్మ వాకిట్లోంచి. అవును శ్రావణ మాసం అంతా పేరంటం హడావుడి. నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు వాయినాలు ఇంటి నిండా శనగలే. చిన్నప్పుడు తెలియక వాయినాలలో ఇచ్చిన పచ్చి శనగలు తింటే పెద్దవాళ్లు తిట్టేవారు. నిజానికి వాళ్లు తిట్టినట్టుగానే మర్నాడుకడుపు నొప్పి వచ్చేది. శనగలు ఒకటే కాదు దాంతోపాటు ఇచ్చిన పచ్చి చలిమిడి తీయగా ఉం...

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.  ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే తారని మెరి...