అమ్మ పిచ్చిది

అమ్మ పిచ్చిది

అవును
అమ్మ పిచ్చిది 
మరణం అంచుల వరకు వెళ్లి

ఒడిలో పడిన బొమ్మను చూసి మురిసిపోయి. 
ఒంట్లోని రంగు చుక్కని పాలు చుక్కగా మార్చి 
బుడిబుడి నడకలు చూసి మురిసిపోయి 

కంటి నుండి జలజల రాలే ముత్యాలు చూసి 
తల్లడిల్లిపోయి. 
బిడ్డ కంటికి రెప్ప తానై
తను కొవ్వొత్తులా కరుగుతూ 

తాను వేసిన విత్తు వటవృక్షమై ఎదగాలని 
కలలు కంటూ ప్రణాళికలు వేస్తూ 

త్యాగాలు చేస్తూ కాలం గడిపే అమ్మ
పిచ్చిది పాపం
ఏ వయసుకి ఆ ముచ్చట చేసి 

ఆ బొమ్మకో ముద్దుల గుమ్మని జత చేసి 
బాధ్యత తీరిందని మురిసిపోయి న అమ్మ 
నిజంగా పిచ్చిది పాపం.
తన దగ్గర మాటలను నేర్చుకున్న బొమ్మ 
ఏరు దాటాక తెప్ప తగలేసి 
శరణాలయం దారి చూపిస్తాడని 
తెలుసుకోలేక పోయింది అమ్మ 
పాపo పిచ్చిది.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట