మధుర జ్ఞాపకం
ఆరోజు ఎప్పటిలాగే మా కార్యాలయం దినచర్య ప్రారంభమైంది
అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. రుణాలు ఇవ్వడం వసూలు చేసుకోవడం మా కార్యాలయం కార్యకలాపాలు. రోజూ ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. ఆరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మా కార్యాలయం చరిత్రలో మిగులుతుందని మేము ఏనాడు ఊహించలేదు. విధి నిర్వహణలో మునిగిన ఉద్యోగస్తులు తల ఎత్తి ఒక్కసారిగా అటువైపు చూశారు. అందరూ అటువైపు చూశారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉందని అర్థం. నిజంగానే ప్రత్యేక వ్యక్తి. ఆ వ్యక్తి అనూహ్య ఆగమనానికి
మేము చాలా ఆశ్చర్య పడ్డాం. తొందరగా ఆయన పని పూర్తి చేసి
ఒక గ్రూప్ ఫోటో అంటూ హాల్లో చుట్టూ చేరాం. గౌరవ సూచికంగా ఆయనకు ఒక ఆసనం ,ఆయన ప్రక్కన నడిచే ఆసనంతో నేను.
పరిచయ వాక్యాలైన తర్వాత నన్ను ఉద్దేశించి *మీరు ప్రధానమంత్రి వచ్చినా కుర్చీ లోంచి లేవనక్కర్లేదు . ఆ అవకాశం మీ ఒక్కరికే ఉంది అంటూ చమత్కరించారు ఆ సరస్వతి పుత్రులు శ్రీ గరికిపాటి వారు. అందరి నవ్వులతో గది అంతా ప్రతిధ్వనించింది. ఇది జరిగి రెండు నెలలైనా , నేను కూడా పదవి విరమణ చేసిన ఆ మధురానుభూతిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి