తాడి చెట్టు
తాడి చెట్టు
గట్టుమీద పుట్టి గగన తలం వరకు ఎదిగి
చుక్కనీరు అడగక పొడగరికి పోలికగా నిలిచి
బడుగు జీవుల గూడునకు తనువును బలి ఇచ్చి
పరోపకారికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచే తాడిచెట్టు.
అమృత ఫలమును అందించి పోషకములో మేటి అనిపించుకొని
ముక్కంటి నీటితో తాపమును చల్లబరిచి
కల్లు ముంత అందించి స్వర్గమునకు దారి చూపించి
అనాధలా పెరిగి అన్నదాత వలె ఆశ్రయమిచ్చే తాడిచెట్టు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి