పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

జానకమ్మ

ఇల్లంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. పందిట్లో సన్నాయి మోగుతోంది. పెరడంతా పందిళ్లతో, పందిళ్లు తోరణాలతో మెరిసిపోతున్నాయి. బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని ఒక నలభై ఐదు ఏళ్ల స్త్రీ, “రండి… రండి…” అని ఆప్యాయంగా పలకరిస్తూ టిఫిన్ టేబుళ్ల ముందు కూర్చోబెట్టింది. వడ్డన ప్రారంభమైంది. “ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకోండి… మరో వడ వేసుకోండి… మా ఇందుపల్లి వాళ్ల వంటలు చాలా బాగుంటాయి…” అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో ఎవరో, “బీరువా తాళాలు ఎక్కడ పెట్టావ్, జానకమ్మ?” అని గట్టిగా అరిస్తుంటే,“ఇదిగో… మీరు పారేస్తారని నేను పట్టుకుని తిరుగుతున్నాను,” అంటూ తాళాలు అందించి మళ్లీ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ టిఫిన్లు పూర్తి చేయడంతో,“టిఫిన్లు పూర్తయ్యాయి… కాఫీలు ఇవ్వండి,” అంటూ వంట బ్రాహ్మణులకు ఆజ్ఞలు జారీ చేసింది.కాఫీలు తాగిన తర్వాత, “ఎదురింటి కరణం గారింట్లో మీ అందరికీ బస ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్దాం, పదండి. మీ సామానంతా మా వాళ్లు తీసుకువస్తారు,” అంటూ ముందుకు దారి తీసింది. అప్పటికే అక్కడ హాలంతా పరుపులు పరిచి ఉన్నాయి. హాలులో ఒక మూల పెద్ద...