పోస్ట్‌లు

ఆయుర్వేదం

నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

మా ఊరి జ్ఞాపకం

మా ఊరి జ్ఞాపకం. చూడ్డానికి క్రికెట్ వీరుడులా పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఈయన నోట్లో పొగాకు చుట్ట ,చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కలు పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ పంచ కట్టుకుని దానిమీద చొక్కా తొడుక్కుని నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం భారతం రామాయణం వినడానికి కాదు ఈయన పారాయణ వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణo. అందరూ సంక్రాంతి పండుగకి పెళ్లిళ్లకి వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు . ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా లేదండి పేకాటలో ఉన్నారండి అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు.చివరికి ఏ వీధిలో ఉన్నాడు ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు.ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేక...

కబ్జా

కబ్జా " చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు.  రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్...