పోస్ట్‌లు

నా రథం

చిత్రం
పుట్టడం అందరి బిడ్డలులాగే అమ్మ కడుపున. ఎవరి దిష్టో పోలియో శాపo పసిప్రాయంలో. మానవుడి జీవిత గమనం రెండు కాళ్ళతో. నా జీవిత గమనానికి మూడు కాళ్లు .           అందుకే నేను ప్రత్యేకం.           దాని తోటే నా జీవితం.       అదే మూడు చక్రాల రథం.   దేవుళ్ళు ప్రతి పండక్కి రథంలో ఊరేగింపు   నేను నారథoతో పాటు ప్రతి చోట విహరింపు.      ప్రతి ఆశయానికి గమనం ముఖ్యం       నా ప్రతి ఆశయ సిద్ధికి నా రథం నా అదృష్టం.      నా బిడ్డలు నా రథానికి వెనకుండే చక్రాలు.      ముందుండి నడిపించే ముద్దుల చక్రం భార్య .      కుటుంబ సభ్యులు నా మార్గదర్శకులు.    బతుకు జట్కా బండి కాదు.  రాజధాని express రైలే.        మూడు చక్రాల రధం ఎంతో పరోపకారి.   నా అభివృద్ధికి ఎంతో ఉపయోగకారి.   నా లాగే బండి కూడా సహనం ఎక్కువ. పనిభారం పెరిగనా పల్లెత్తు మాట్లాడను వయసుతో పాటు నా భారం పెరిగిన కిమ్మనకుండా గమ్యం చేరుస్తుంది నా బంగారు రథం. న...

ఆయుర్వేదం

నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

కబ్జా

కబ్జా " చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు.  రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్...