పోస్ట్‌లు

డాలర్ చదువులు

 డాలర్ చదువులు – ఓ మాయాజాలం ఒకప్పుడు విద్య అనేది జ్ఞాన సముపార్జనకు , ఉపాధికి మార్గం. కాలక్రమేణా చదువుకునే విద్య గమ్యం మారింది.గురువుగారి ఆశీర్వాదం కాదు.డాలర్ దేవుడి దీవెన కోసం చదువుతున్నారు. ఇష్టం లేని చదువు.ఆసక్తి లేని ఉద్యోగం.మనసు లేక బతుకు బండి ఈడుస్తున్నారు. పిల్లల కలల్ని మరిచి తల్లిదండ్రుల కలల కోసం పరుగులు పెడుతున్నారు.పిల్లల అభిరుచుల్ని మంటల్లో ఊరబెట్టి ధన సంపాదన కోసం పరుగులు తీయిస్తున్నారు. ఎక్కడ చూసినా — ఓటీస్, గ్రీవ్స్, ఎంబసీ సూట్ కేసులు అమెరికా వైపు కన్నులు.డాలర్ వైపు కలలు. "నీకు ఏమవ్వాలని ఉంది?" అని అడగరు. "ఎక్కడ సెటిల్ అవుతావు?" అని మాత్రమే అడుగుతారు. ఇంజనీర్ కావాలంటే, ఇంటరెస్ట్ కాదు — ఇంటి ఇన్‌స్టాల్‌మెంట్ల కోసం. డాక్టర్ కావాలంటే, సేవ కాదు — సంపద కోసం. కళా విద్యలు సాహిత్య రసాలు? సంగీతం, నాట్యం? ఈ మాటలన్నీ డబ్బు ఖర్చు చేసే పిచ్చి కలలు! నిన్నా, నేడూ, రేపూ — చదువు వ్యాపారం.విద్యా మందిరాలు కాదు — డాలర్ తయారీ సంస్థలు. పిల్లల మనసు ప్రశ్నిస్తోంది:"నేను బతికినందుకు బహుమతి డాలరా?""నా కలల విలువ డాలర్ మారకం రేటుతో కొలవాలా?" ఇంకా ఆలస్యం లేదు....

ఏమిటో నీ రూపం

 ఏమిటో నీ రూపం ఏమిటో నీ రూపం, తుది మొదలు తెలియని ఆకారం, గజిబిజి గందరగోళం, దారి తెలియని గమ్యం. అద్దాల అంగడిలో తేనెముద్దల మెరుస్తావు దారిన పోతున్న దానయ్య మనసు దోచేస్తావు కొనేదాకా ఊరుకోకుండా అతిథి మర్యాద చేయించావు, మధుమేహం అన్నా నోరు ఊరించావు. అందంగా కొరికితే ఆధారానికి అమృతాన్ని పంచావు, వంపులు తిరిగిన జలపాతం నుంచి పాకం పొంగించావు, చుట్టల మధ్య తీపి సందేశం రాశావు, గుండె కోణాల్లో మిఠాయి గీతలు గీసావు. బంగారు వంకరల వంతెన దాటి, చిటికెన వేళ్లపై స్వర్గం ఒలకబోసావు, ఒక్క ముక్కలో బహుళ తీపిని పంచి, బాల్యం గుమిగూడే జ్ఞాపకాల విందు ఏర్పరిచావు. జీవితంలో కూడా నీ వంకరల మాదిరే, వంకర్లు తిరిగినా తీపి దాగే, గజిబిజి గమ్యాల మధుర గమనంలో, ఒక చిన్న జిలేబిలా జీవితం  నవ్వుతూ సాగాలి!

కవల పిల్లల తల్లి

 బిడ్డకు జన్మనివ్వడం ఒక వరం. కవలలు పుట్టడం ఆ వంశం చేసుకున్న పుణ్యం. పురాణాల కాలం నుంచి ఉంది కవలల జననం లవకుశల జన్మ అందుకు సాక్ష్యం. జన్మరీత్యా కవలలు కాకపోయినా అనుబంధంతో అన్న వెంటే ఉన్నాడు లక్ష్మణుడు తరతరాలుగా వీరి నామమే కవల పిల్లలు అందరికీ. రామాయణంలో సీతాదేవి ఊర్మిళ పాత్ర త్యాగ మయం. సీతాదేవి అరణ్యం పాలైతే ఊర్మిళాదేవినీ నిద్రా దేవత పరం కవల పిల్లలు కాకపోయినా భువిలో సీతా ఊర్మిళ నామము కవల పిల్లలు అందరికీ ఆది వైద్యులు అశ్వనీ దేవతలు కూడా కవలపిల్లలు. వీరి అంశతో జన్మించిన వారే నకుల సహదేవులు. ఒకే కాన్పు లిప్తపాటు తేడా  ఒకరి తర్వాత ఒకరు ఒకే పోలిక ఎవరు పెద్ద  ఎవరు చిన్న ఎవరు ముందు  ఎవరు వెనుక పుట్టించిన  బ్రహ్మకే అయోమయం. మత్తులో ఉన్న అమ్మ మాత్రం ఏమి చెప్పగలదు. బ్రహ్మకి అమ్మకి తెలియని సత్యం. అందుకే కవల పిల్లలు అంటే అందరికీ అభిమానం. ఏ ప్రాణి జన్మకైనా అమ్మే కదా ఆధారం. బిడ్డను లాలించి పోషించేది అమ్మ. కవల బిడ్డ అయినా ఒకే బిడ్డ అయినా యధావిధిగా తన ధర్మం నిర్వహించేది అమ్మ. బాధ్యత లోనే కదా తేడా. బాధ్యత అమ్మ సహనాన్ని రెట్టింపు చేస్తుంది. పెదవి విప్పి చెప్పదు ఏ కష్టం. కవల పిల్ల...