ఏమిటో నీ రూపం
ఏమిటో నీ రూపం
ఏమిటో నీ రూపం,
తుది మొదలు తెలియని ఆకారం,
గజిబిజి గందరగోళం,
దారి తెలియని గమ్యం.
అద్దాల అంగడిలో తేనెముద్దల మెరుస్తావు
దారిన పోతున్న దానయ్య మనసు దోచేస్తావు
కొనేదాకా ఊరుకోకుండా అతిథి మర్యాద చేయించావు,
మధుమేహం అన్నా నోరు ఊరించావు.
అందంగా కొరికితే ఆధారానికి అమృతాన్ని పంచావు,
వంపులు తిరిగిన జలపాతం నుంచి పాకం పొంగించావు,
చుట్టల మధ్య తీపి సందేశం రాశావు,
గుండె కోణాల్లో మిఠాయి గీతలు గీసావు.
బంగారు వంకరల వంతెన దాటి,
చిటికెన వేళ్లపై స్వర్గం ఒలకబోసావు,
ఒక్క ముక్కలో బహుళ తీపిని పంచి,
బాల్యం గుమిగూడే జ్ఞాపకాల విందు ఏర్పరిచావు.
జీవితంలో కూడా నీ వంకరల మాదిరే,
వంకర్లు తిరిగినా తీపి దాగే,
గజిబిజి గమ్యాల మధుర గమనంలో,
ఒక చిన్న జిలేబిలా జీవితం
నవ్వుతూ సాగాలి!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి