పోస్ట్‌లు

ఒక సూర్యోదయం_ గోదావరి తీరం

ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ. ఒక కొత్త ఊపిరి. కొత్త ఆశయాలు కొత్త కోరికలు, ప్రారంభమవుతాయి.అది ఏ కాలం అయినా సూర్యుడు తూర్పు కొండల పైనుంచి తళతళలాడుతూ ఉదయిస్తాడు. ఆరు నూరైనా తన డ్యూటీని మరిచిపోకుండా చేస్తాడు. అది మనం జీవితం మీద నమ్మకాన్ని నింపుకునే క్షణం. ఉదయిస్తున్న సూర్యుని అరుగు మీద కూర్చుని చూసిన చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ క్షణం గోదావరి తీరంలో ఎలా ఉంటుందో చెప్పడానికి పదాలు చాలవు. కనులు చూసే దృశ్యం, మనసు తేలికపడే అనుభూతి, శ్వాసలో పరిమళించే తడి నేల వాసన – ఇవన్నీ కలిసే గోదావరి ఒడ్డున ఒక సూర్యోదయం. " ఉదయిస్తున్న సూర్యుడు ఉల్లి పువ్వు ఛాయ అన్నట్టు ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కిరణాలు గోదావరి నది నీటి మీద పడిన దృశ్యం చూడడానికి కన్నుల ముచ్చటగా ఉంటుంది. ప్రవహిస్తున్న గోదావరి నదితో పాటు కిరణాలు కూడా ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆనందం ,ఈ అనుభూతి కూడా మనం స్వయంగా చూస్తేనే తెలుస్తుంది.  సూర్యుడుతోపాటుగా నిద్ర లేచి పశువులను తోలుకుంటూ పొలం వెళ్లే రైతులు, సైకిల్ మీద లుంగీ పంచ కట్టుకుని నోట్లో చుట్ట పెట్టుకుని సైకిల్ కి పాల తప్పేలా తగిలించుకుని పొలం వెళ్లే పెద్ద రైతు గోదావరి గట్టుమీద ప్రత...

ఉన్న ఊరు

రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు వెంకన్న మాస్టారికి పుట్టి పెరిగిన ఊరు .టీచర్ గా పనిచేసిన ఆ ఊరు కదలకుండా ఎంత దూరమైనా ఉద్యోగం చేసి సాయంకాలానికి ఇంటికి చేరే వారు. ఆ ఊరు అంటే ఆయనకు అంత ప్రేమ. తండ్రిగారి కట్టిన ఇల్లు అంటే ఎనలేని అభిమానం. ఇద్దరు మగ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించేడే తప్ప ఆ ఊరు వదిలి పోలేదు. ముప్పై సంవత్సరములు టీచర్ గా పనిచేసి రేపు పదవి విరమణ చేయబోతున్నాడు. ముందుగానే పిల్లలు ఇద్దరు చెప్పారు. రిటైర్మెంట్ అయిన వెంటనే నువ్వు అమ్మ మా దగ్గరకు వచ్చేయండి. మీకు వయసు మీరి పోతోంది. ఇక ఇక్కడ ఉండలేరు. ఇల్లు వాకిలి పొలం పుట్రా అన్ని అమ్మేసి వెళ్ళిపోదాం అంటూ పిల్లలు ఒకటే గోల.  ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. రేపు మాపో పిల్లలు వచ్చి మళ్ళీ పట్టుబడతారు. ఇంతవరకు ఎటు నిర్ణయం చెప్పలేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడం ఎలాగా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుని తెల్లవారి ఆలస్యంగా లేచాడు. తెల్లవారి లేచింది మొదలు యాంత్రికంగా పనులు చేస్తున్నాడు తప్ప ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టా యి. పొలం పొట్రా ఇల్లు అన్ని అమ్మేస్తాం అది పెద్ద పనేం కాదు. తట్టా బట్టా సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ...

బరువు భాధ్యత

చిత్రం
కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత. ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279