పోస్ట్‌లు

జ్ఞాపకం

సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజువ్వలు టప...

అమ్మ చీర కొంగు

 అమ్మ చీర కొంగు  అది ఆపదలో గోవర్ధనగిరి — సిగ్గు వచ్చినప్పుడు నన్ను కాపాడే ఆపద్బాంధవి. దొంగ–పోలీస్ ఆటలో దాక్కోడానికి అది అత్యున్నతమైన సురక్షిత ప్రదేశం నాన్న తిట్టినప్పుడు అమ్మ కొంగులో దూరితే భయం పటాపంచలు. ఏడుస్తున్నప్పుడు అమ్మ కొంగుతో కళ్ళు తుడిస్తే —  ఆ కొంగు స్పర్శకి కొండంత బాధ కూడా  చలిలో వణుకుతూ వచ్చినప్పుడు అమ్మ కొంగులో దాక్కుంటే — ఆ వెచ్చదనం దైవస్పర్శలా అనిపించేది. చినుకుల్లో తడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తే తల మీద అమ్మ చీర కొంగు కప్పి తుడుస్తుంటే — ఆ మమకారమే జీవనార్థం అనిపించేది. పొద్దున్నే స్కూల్‌కి బయలుదేరే వేళ చీర కొంగుతో జుట్టు తుడుస్తూ, చుక్కబొట్టు పెట్టే తల్లి — ఆ సన్నివేశమే జీవితపు తొలి పాఠం: ప్రేమ. జ్వరం వచ్చినప్పుడు చెమట తుడుస్తూ చీర కొంగుతో నుదుటిపై చెయ్యేసి చూసే ఆ చల్లదనం — అదే నిజమైన ప్రసాదం. కాలం గడిచిపోయింది… అమ్మ కొంగు ఇప్పుడు జ్ఞాపకాల మడతల్లో దాగి ఉంది. అయినా కళ్లను మూస్తే, ఆ చీర సువాసన, ఆ సాంత్వన, ఆ సన్నిహితత్వం — ఇప్పటికీ గుండెల్లో తేలుతూనే ఉంది.  అమ్మ చీర కొంగు — బట్ట ముక్క కాదు, మన చిన్ననాటి భద్రత, మనసుకు అడ్డుకట్ట, ప్రేమకు రూపం.

అతిథి

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ   అతిధికి కూడా తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి దేవుడితో సమానం అని చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు? ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం.  మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన్ని కానీ స్నేహితులను కానీ ...