గోదావరి డెల్టా పితామహుడు
గోదావరి డెల్టా పితామహుడు.
మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం వద్ద పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన గోదావరి నదిని జీవనది అంటారు. జీవనది అంటే ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.
అవి భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించే రోజులు . ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ దొర వృత్తి రీత్యా ఇంజనీర్ ఇక్కడ పని చేస్తూ ఉండేవాడు. నిరంతరము ప్రవహిస్తూ ఒక పుణ్య నదిగా పేరు తెచ్చుకున్న గోదావరి నది జలాలు వృధాగా ఉండిపోవడం, అంతేకాకుండా ఆ ప్రాంతంలో తాగునీరు పంట నీరు సమస్యలు ఏర్పడడంతో ఇంజనీర్ దొరగారికి అద్భుతమైన ఆలోచన తట్టింది.
అలా గలగల పా రుతున్న గోదావరి తల్లికి అడ్డుకట్ట అంటే ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆనకట్టవలన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వడమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీరుతుందని ఆలోచించి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ధవలేశ్వరం వద్ద గోదావరి నది మీద ఆనకట్ట నిర్మాణం చేశాడు.
ఎక్కడో పుట్టాడు పరాయి దేశంలో అద్భుతమైన కార్యానికి పునాది వేశాడు భారతదేశంలో.పరాయి దేశస్తుడు అయితే నేమి పది కాలాల పాటు నిలిచే పని. చేశాడు.ఆనకట్ట కార్యరూపంలో ,అనారోగ్యం పాలు అయినా లెక్క చేయకుండా ప్రజలకు మే లు. చేశాడు గోదావరి జలాలకు అడ్డుకట్ట మహా అద్భుత కార్యం అదే చరిత్రలో నిలిచిపోయిన ధవళేశ్వరం ఆనకట్ట
.
ఆంగ్లేయుడు అయితే నేమి గోదావరి జిల్లాల ప్రజల మనసులో సజీవుడు.నాలుగు రోడ్ల కూడలిలో దేవుడి విగ్రహాలు ఉండడం సహజం.నాయకుల విగ్రహాలు పెట్టడం అభిమానానికి నిదర్శనం.సంఘ సంస్కర్తలు విగ్రహాలు పెట్టడం సంస్కారానికి నిలువెత్తు సాక్ష్యం.
అయితే గుర్రపు స్వారీ చేస్తున్న ఆంగ్ల అధికారి విగ్రహం గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. ఇదే గోదావరి జిల్లాల ప్రజలు అభిమానానికి నిదర్శనం. ఈ మహాద్భుత కార్యక్రమాన్ని చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది . ప్రజలు ఈనాటికీ కూడా కాటన్ దొర గారిని గోదావరి డెల్టా పితామహుడు గా పిలుచుకుంటారు. అంతేకాదు కాటన్ దొర గారి మ్యూజియం రాజమండ్రిలో ఏర్పాటు చేయడం మరొక విశేషం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి