కాలక్షేపం
కాలక్షేపం " రేపే రిటైర్మెంట్ కాగితాలు సబ్మిట్ చేయడానికి ఆఖరి రోజు. హెడ్మాస్టర్ దగ్గర సంతకాలు తీసుకోవాలి సాయంకాలం లేటుగా వస్తాను .కంగారు పడకంటూ కాగితాలు తీసుకుని క్యారేజీ తీసుకుని స్కూల్ కి వెళ్ళిపోయారు రామశాస్త్రి మాస్టారు. రామశాస్త్రి గారిది చాలా అదృష్టవంతమైన జీవితం. విద్యార్థిగా విద్య నేర్పిన పాఠశాల ఉపాధ్యాయుడిగా జీతమిచ్చి ఇన్నాళ్ళు ఆదరించింది. అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. రామ శాస్త్రి గారు లెక్కల మాస్టారే కాకుండా అన్నింటికీ లెక్కలు వేసుకుని, ప్రణాళికలు వేసుకుని, జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. సొంత ఊరుకి స్కూలు దగ్గరైన పిల్లలు చదువులు కోసం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలో కాపురం పెట్టి రోజు బస్సు మీద స్కూల్ కి వెళ్లి వస్తుండేవాడు. అలా ముప్పై అయిదు సంవత్సరాలు గడిచిపోయే యి. పిల్లలందరికీ సర్వీస్ లో ఉండగానే పెళ్లిళ్లు చేయాలని తాపత్రయపడి కింద మీద పడి కడుపున పుట్టిన ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసాడు. ఆయనకు మగ సంతానం లేదు. హమ్మయ్య ఇవాళ్ళతోటి రిటైర్మెంట్ కాగితాల పని అంతా అయిపోయింది అనుకుంటూ రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి కుర్చీలోకూల పడ్డాడు రామ...