వీలునామా
వీలునామా  "  నాన్న  ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్ద అంటూ కంచంలోని  పెరుగన్నం ముద్ద ని రాఘవయ్య గారి  నోటికి అందించాడు  రాజేష్. అన్నం ఇంక తిననని తల  అటు ఇటు తిప్పేస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు రాఘవయ్య గారు. ఇదిగో ఇది మీ నాన్న  ముద్ద ఇది తినకపోతే మీ నాన్నకు కోపం వస్తుంది ఇది కూడా తినంటూ బలవంతంగా రాఘవయ్య గారినోట్లో పెట్టాడు. రాఘవయ్య గారు కోపంగా కొడుకు రాజేష్వై  పు చూశాడు . నువ్వు రాత్రి ఏమి తినడం లేదు నీకు ఆకలేస్తుందో లేదో నాకు తెలియదు నీరసం వస్తుందని నాకు భయం.   మరి అమ్మంటే నీకు ఇష్టం కదా ఇది అమ్మ ముద్ద  చూడు మిఠాయి నంచి పెడతాను తిను అంటూ పక్కనే  డబ్బాలో ఉన్న మిఠాయి అన్నoముద్దతో  కలిపి పెట్టాడు. రాఘవయ్య గారు గబగబా నోరు తెరిచి ఆ ముద్ద తినేసారు.  రాఘవయ్య గారికి స్వీట్ అంటే ఇష్టం. భార్య అంటే  అమితమైన ప్రేమ. మావయ్య గారికి స్వీట్ పెట్టకండి షుగర్ పెరిగిపోతుంది అంటూ వంటింట్లోంచి భార్య శాంత గట్టిగా కేకేసింది.  షుగర్ తగ్గించడమే కదా రోజు నా పని దాని సంగతి  నేను చూసుకుంటాలే అంటూ డాక్టర్ రాజేషు భార్యకు సమాధానం చెప్పి రాఘవయ్య గారి మూతి తుడ...