పోస్ట్‌లు

నోటు

నోటు రంగురంగుల కాగితం. దాని మీద అంకె చూస్తేనే మనకి ధైర్యం. ఏ అంకె లేకపోతే అది తెల్ల కాగితం. ఆ అంకె తో టే దానికి వచ్చింది పెద్ద గొప్ప. దాని పేరే కరెన్సీ నోటు అది ఉంటే నే మన జేబు కళకళలాడు. జేబులో నోటుఉంటే గరీబ్ కూడా షరాబే. అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోట్ రాస్తారు అప్పు తీర్చడం కరెన్సీ నోటు తో చేస్తా రు. కరెన్సీ నోటు తోటే మనిషికి ఎక్కడలేని ధైర్యం. సంఘం ఇస్తుంది అపారమైన గౌరవం. మనిషి మమతలకు విలువ శూన్యం గాలికి ఎగిరిపోయే నోటు విలువ అపారం. మనిషి విలువకి కరెన్సీ కొలమానం. మనిషికి మనిషిగా విలువ శూ న్యo నోటు చుట్టూ చక్కర్లు కొడుతోంది మానవ ప్రపంచం. నోటు చూపించి కొండ మీద కోతిని దింపచ్చు. నోటుతో టే ఉంది రాజకీయ భవితవ్యం. పని జరగాలంటే నోటు ఫైలు కదలాలంటే నోటు. సూది పొడవాలి అంటే నోటు. ఓటు పడాలంటే నోటు. పదవి కావాలంటే నోటు పదవి నిలపాలంటే నోటు పండగ జరపాలంటే నోటు బడిలో సీటు కావాలంటే నోటు. ఒడిలో చోటు కావాలంటే నోటు. పంచ ప్రాణాలులో ఒక ప్రాణం నోటు. నోటు నువ్వు లేకపోతే మాకు ఈ ప్రపంచంలోనే లేదు చోటు. నిత్యం దానికోసమే మానవుడు పడుతున్నాడు అంతర్మథనం. అంతర్మధనం తోటి పెరుగుతోంది మనిషి రక్త పోటు. రచన మధునాపంతుల చిట...

బీరువా

బీరువా గదిలో మూలనున్న గది కే అందం. విలువైన వస్తువులన్నీ నా వడిలో భద్రం. నాన్న నెల జీతం  అమ్మ ఆభరణం పెళ్లినాటి పట్టు చీరలు. వెండి సామాన్లు పిల్లల ప్రశంసాపత్రాలు నా ఒడిలో భద్రపరిస్తే యజమానికి ఆనందం. కమ్మగా నిద్రిస్తారు కలతలు లేకుండా. కొత్త కాపురానికి పంపించేటప్పుడు అమ్మాయితో పాటు అత్తారింటికి. అందంగా ఆ గదిలో చేరుతాను. మౌనంగా ముద్దు ముచ్చట కళ్లుమూసుకుని వింటాను ఎందుకంటే రాత్రికి నా కళ్ళ కి గంతలు  అమ్మాయికి కడుపు పండి చంటి బిడ్డ ఒడిలో చేరినా ఏడుస్తున్న చంటి దాన్ని సముదాయించి లేను. చంటి దాని చేతిలో పెట్టిన విలువైన వస్తువులు భద్రంగా దాచుతాను. సంసారంలోని కలతలతో అమ్మాయి తలగడ లో తలదాచుకుని ఏడుస్తున్నా చేరదీసి సముదాయించలేను నేను ప్రాణం లేని శిలను. వయసు మీరినా వరదలా ప్రవహిస్తున్న  వారి ప్రేమను చూసి సిగ్గుతో తలదించుకుంటాను. ఎందుకంటే ఆ గది తప్ప వేరే గదిలో నాకు స్థానం లేదు. పరువాలు పంచడానికి ఆ గదే సంపదలు ఉంచేది ఆ గదే నామీద కుటుంబానికి ఒక నమ్మకం తెచ్చిన సంపాదన మూడింతలు అవుతుంది అని ఆ పేరే తెచ్చింది మా వంశీకులకు గౌరవం. అందుకే ప్రతి ఇంటిలో మాకు స్థానం. పాలబుగ్గల పసిపిల్లల దొంగ పోల...

జీవ నది

నేను ఒక జీవనదిని. నేను మీకు తెలియని దాన్ని కాదు. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టాను. జలజల పరిగెడుతూ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలోని ప్రజలను పంటపొలాలను పలకరించి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద నా తల్లి ఒడిలో చేరుతున్నా ను. నేను ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి సప్త ఋషుల పేర్లు పెట్టుకున్నాను. నాకు చాలా పౌరాణిక చరిత్ర ఉంది.                                                                                          పూర్వకాలంలో గౌతమ మహర్షి గోహత్య పాతక నివృత్తి కోసం శివుని మెప్పించి గంగను భూమి మీదకు తీసుకు వస్తారు. ఆ గంగయే గోదావరి నది. గౌతమీ నది అని కూడా పిలుస్తారు. మీ ఇంటిలో జరిగే ప్రతి శుభ అశుభ కార్యక్రమాలు నేను లేకుండా ఏదీ జరగదు. పచ్చగా ఉండే మీ పంట పొలాలను నిత్యం నేను పలకరిస్తూనే ఉంటాను.. జలజలా పారుతూ అంతర్వేదిలో కలిసిపోతున్న...