పండుగ
అబ్బా ! మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాముఅంటూ జానకమ్మ గారి  పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని  వీడియో కాల్ లో  జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ "చూడండి  నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి  ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది.   జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి  చూశారు. ఏం సమాధానం చెప్పాలని.  ఆడపిల్లలు  మనవలని ఎత్తిన  భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి  చిన్నది ఫోన్లు పెట్టేసారు. జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ  ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి  ఇద్దరేసి పిల్లలు పుట్టారు.  ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. "అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి  పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది  ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు  వస్తారుట...