ఆఖరి మాట
ఆఖరి మాట  ప్రపంచంలో ఏ ప్రాణికోటికి లేని అత్యంత అమూల్యమైన వరం మానవ జన్మకి దేవుడిచ్చాడు. తన మనసులోని భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి అవకాశం కల్పించాడు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి మాట అనే ఆయుధాన్ని ఇచ్చాడు.  మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోరు అనే అవయవం ద్వారా వచ్చే మాటకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మాట ఇద్దరు మనుషుల మనసులను కలుపుతుంది. అలాగే బంధాలను విడదీస్తుంది. రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అన్నిటికీ వెనుక బలమైన ఆధారం ఉంటే అది నిజం అంటారు. కాకపోతే అబద్ధమే కదా మరి. మనిషి శాశ్వతం కాదు కానీ మాట మటుకు ఎప్పటికీ గుర్తుంటుంది. రోజు అనేక మందితో అనేక మాటలు మాట్లాడుతుంటాము. అది ఆ వ్యక్తితో అదే ఆఖరి మాటని మనకు తెలీదు. ఆఖరి మాట అనేది ఎప్పుడవుతుంది. ఆ వ్యక్తి ఈ లోకo నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు వారితో ఆఖరిసారిగా మాట్లాడినదే  ఆఖరి మాటవుతుంది. కానీ మనకు అది తెలియదు. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వ్యక్తి తోటే తన మనసులోని భావాన్ని పంచుకోవడం  ఆ సమయంలో ఆ వ్యక్తి మీద ప్రత్యేక అభిమానమే అని చెప్పొచ్చు. అప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ వ్యక్తి ఆఖరి ...