పోస్ట్‌లు

వృద్ధాప్యం

బరువు బాధ్యతలు లేనిది బాల్యం. మోహంతో నడిచేది యవ్వనం. బరువు బాధ్యతలతో నడుస్తుంది కౌమారం. గడవనిది గడుపుకొలేనిది వృద్ధాప్యం. గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం గూడులో గువ్వల్ని పట్టించుకోని వైనం సహకరించని వయసుమళ్ళిన శరీరం. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ప్రతి ముదుసలి వెనుక ఇదే దాగున్న నిజం. అనుభవంతో చెప్పిన మాట ఆదరించే నాథుడు ఏడి. ముళ్లుంటాయి అని చెప్పినా మూర్ఖంగా ముందుకు నడిచేవాడే. వయసు మళ్ళిన వారు ఉంటే వరుసలు కలుపుకోని పరిస్థితి. బంధాలు తెంచుకుని బాధ్యతలకు భయపడే జనం. ఏమై పోతారు వయసు మళ్ళిన తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు. ఆహ్వానించే శరణాలయానికి పంపడం సుదీర్ఘంగా ఆలోచించవలసిన విషయం. వయసు మళ్ళిన వారు ఉంటే ఇంటికి అందం. ముదుసలి పసిపాప తో సమానం బుడ్డి దాని ఆటపాటలే మనకు ఆనందం. వయసు మళ్ళిన అమ్మానాన్నలతో మనము ఆడుకుందాం. వయసు నిత్యం ప్రవహించే జలపాతం జలపాతాన్ని ఆపడం ఎవరి తరం మన వయసు మారుతుంది మన పరిస్థితి ఏమిటో ఆలోచించాలి ఈతరం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.          కాకినాడ 9491792279

చిత్తూరు జిల్లా విహారయాత్ర

చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక సాంస్కృతిక, ప్రకృతి సౌందర్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడి విహారయాత్రకు అనేక ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 🛕 ఆధ్యాత్మిక ప్రదేశాలు కాణిపాకం వినాయక ఆలయం : శ్రీకాళహస్తి దేవాలయం : గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం : తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం 🌿 ప్రకృతి అందాలు కైగల్ జలపాతం : కైలాసకోన జలపాతం : తలకోన : 🏞️ అడవులు మరియు అభయారణ్యాలు శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం : కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం : 🏰 చారిత్రాత్మక ప్రదేశాలు గుర్రంకొండ కోట : చంద్రగిరి కోట : 🏕️ విహారయాత్రలు తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు: తిరుపతి గురించి ముఖ్య విషయాలు: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి గల హిందూ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీ వేంకటేశ్వరుడికి (లార్డ్ వెంకటేశ్వర, అంటే వేంకటేశ్వర స్వామి) అంకితం. వేదక...

స్త్రీ

 స్త్రీ  పోరాటమే ఆమె ప్రాణవాయువు ప్రేమే ఆమె ఆభరణం ముళ్ల దారిలో నడిచినప్పటికీ స్వర్గపు సీమలో కలల పయనం ఆమెదే ఆమెను చూసి త్యాగం తలవంచుకుంది సహనం చేతులు జోడించి నమస్కరించింది స్వార్థం నిశ్శబ్దంగా నిలబడిపోయింది ఆ ఇంటి వెలుగు చూసి దీపం మురిసిపోయింది ఆమెను చూసి భూమాత "నా బిడ్డ" అని ముద్దు పెట్టుకుంది :  ప్రాణికోటి అంతటికి నేను, ఆ గూడుకి ఆమే ఊపిరి  అంటూ ఉప్పొంగిపోయాడు వాయువు నేను నిత్యం ప్రతి ఇంట్లో ఒక అతిధిని  అతిధి మర్యాదలో ఆమెకు  ఆమె సాటి అంటాడు అగ్ని  వేసవిలో పన్నీటి జల్లులా అనునిత్యం ప్రేమ జల్లు కురిపిస్తుంది  అంటాడు వర్షాలదేవుడు.  ఆకాశమంత విశాలమైన మనసు  ఆదరణలో ఆకాశమే హద్దు.  అంటుంది ఆకాశం. అందం లో నాతో పోటీ పడుతోంది  అంటాడు చందమామ. అవసరమైతే నాలాగే చమటలు పట్టిస్తుంది. అంటాడు వేసవి సూర్యుడు. ఆమెకు ఎవరూ లేరు సాటి  నా సృష్టి అంత గొప్పది అంటాడు  బ్రహ్మ. ఎవరు ఎన్ని చెప్పినా  కట్టుకున్న వాడు గుండె లోతుల్లోంచి  వచ్చిన మాటకు ఆమె ఉప్పొంగిపోతుంది. పరవశించిపోతుంది  అది ఆడజన్మంటే రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు...