వృద్ధాప్యం

బరువు బాధ్యతలు లేనిది బాల్యం.
మోహంతో నడిచేది యవ్వనం.
బరువు బాధ్యతలతో నడుస్తుంది కౌమారం.
గడవనిది గడుపుకొలేనిది వృద్ధాప్యం.

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం
గూడులో గువ్వల్ని పట్టించుకోని వైనం
సహకరించని వయసుమళ్ళిన శరీరం.
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
ప్రతి ముదుసలి వెనుక ఇదే దాగున్న నిజం.

అనుభవంతో చెప్పిన మాట ఆదరించే నాథుడు ఏడి.
ముళ్లుంటాయి అని చెప్పినా మూర్ఖంగా ముందుకు నడిచేవాడే.
వయసు మళ్ళిన వారు ఉంటే వరుసలు కలుపుకోని పరిస్థితి.
బంధాలు తెంచుకుని బాధ్యతలకు భయపడే జనం.
ఏమై పోతారు వయసు మళ్ళిన తాతలు అమ్మమ్మలు
నాన్నమ్మలు.
ఆహ్వానించే శరణాలయానికి పంపడం సుదీర్ఘంగా ఆలోచించవలసిన విషయం.

వయసు మళ్ళిన వారు ఉంటే ఇంటికి అందం.
ముదుసలి పసిపాప తో సమానం
బుడ్డి దాని ఆటపాటలే మనకు ఆనందం.
వయసు మళ్ళిన అమ్మానాన్నలతో మనము ఆడుకుందాం.

వయసు నిత్యం ప్రవహించే జలపాతం
జలపాతాన్ని ఆపడం ఎవరి తరం
మన వయసు మారుతుంది
మన పరిస్థితి ఏమిటో ఆలోచించాలి ఈతరం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట