పోస్ట్‌లు

కోపం

ఒక రోజు ఒక మనిషి బుద్ధుడి దగ్గరకు వచ్చి కోపంతో తిట్టడం ప్రారంభించాడు. అతను చాలా సేపు దూషణలు చేశాడు. బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా విన్నాడు. తర్వాత బుద్ధుడు అడిగాడు: “ఒకవేళ ఎవరో ఒకరికి బహుమతి ఇచ్చారు అనుకోండి. అది వారు తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిదిగా ఉంటుంది?” ఆ మనిషి చెప్పాడు: “ఇచ్చినవారిదే.” అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు: “అలాగే నేను నీ కోపాన్ని స్వీకరించలేదు. అది ఇంకా నీదే.” బోధ: కోపం తీసుకోకపోతే అది మనకు హాని చేయదు.

మైదానంలో మహోత్సాహం

ఆటగాళ్లు మైదానంలో స్వైర విహారమాడగా, బంతి గగనమందు పక్షిలా విహరించె. సిక్సుల సుడిగాలి మైదానమున వీచగా, ప్రేక్షక హృదయములో హర్షధ్వని పొంగె. ఫోర్ల మెరుపులు కళ్ల ముందర మెరవగా, పరుగుల ప్రవాహము స్కోరుబోర్డును నింపె. బౌలర్ల బాణములు వికెట్లు నేలకొరిగె, ప్రత్యర్థి ఆశలు మెల్లగా కరిగె. చివరికి ఆ రేయి జయధ్వని మార్మోగె, భారత జట్టు కీర్తి గగనమున ఎగిసె. — రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

ఆ ఊరు

 ఆ ఊరు మన జీవన యాత్రలో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం. పుట్టినఊరు , చదువు కోసం వెళ్ళిన ఊరు, పొట్ట చేత పట్టుకుని తిరిగే ఊరు, అత్తవారి ఊరు అందులో ముఖ్యమైనవి.  పుట్టిన ఊరు స్వర్గంతో సమానం అంటారు. మనం పుట్టిన ఊరు తలుచుకున్నప్పుడల్లా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు, గడిచిపోయిన బాల్య మధుర స్మృతులు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వస్తూనే ఉంటారు. అది సహజమే. పుట్టినప్పటినుంచి ఆ గాలి ఆ నీరు ఆ వాతావరణం ఆ మనుషులు తో మమేకమై కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి. అక్కడ ఉండేది కొద్ది రోజులే కానీ మన జీవితం ఆ కాలేజీ , స్నేహితుల మధ్య తిరుగుతుంది. జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా మన విద్యార్థి జీవితం గుర్తుకొస్తుంది. మరి ఉపాధి కోసం మనం వెళ్లిన ఊర్లు జీవితంలో చాలా మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి. కష్టాలు కూడా ఉంటాయి లెండి.ముఖ్యంగా కొన్ని వృత్తుల వాళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలతో సంబంధం ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రజలతో అనుబంధం పెరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు వీరికి నిత్యం అక్కడ ఉండే ప్రజల తోటే మమేకమై పని చేస్తుంటారు.  కానీ మన జీవన సమరంలో మనకి మధ...