పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవితం

సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు.  " అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు. "కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. "అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి. బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి. రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే. స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది. "బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడ...

ఆఖరి చోటు

 ఆఖరి చోటు ప్రయాణం అంటే అందరికీ సరదాయే . అక్కడికి చేరడం అంటే అందరికీ భయమే కానీ చివరకు చేరేది ఆ చోటుకే మనకు భయం తెలియకుండానే చేర్చే చోటు. మనం ఆ చోటుకు చేరుతున్నామని తెలియకుండానే చేరే చోటు.  ప్రతి ప్రయాణానికి ముహూర్తం ఉంటుంది. మన అంతిమ ప్రయాణం మన చేతుల్లో ఉండదు మన చేతల్లో కూడా ఉండదు. ఆ ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించేది ఆ దేవుడు ఒక్కడే. ఆ చోటు అక్షయపాత్ర లాంటిది ఎంతమంది చేరిన మరి ఎంతోమందికి చోటు ఉంటుంది. దయాదాక్షిణ్యలు లేవు . ఎవరి కన్నీళ్లు పట్టవు గుండె అంతా బండరాయి. గుండె మండుతున్న బాధ్యతను మరిచిపోని ప్రదేశం. కావ్యాలు రచించిన కవులకి అదే పూల పాన్పు . సుమధుర గానాలు వినిపించిన వసంత కోకిలకు అదే ఆఖరి మజిలీ. నాడీ పట్టుకుని నలత చెప్పే వారు చివరకు చేరే చోటు రాజు బంటు తేడాలు లేవు  ఉన్నవాడు లేనివాడు అన్నది వట్టిమాటే. ఇంద్రుడైన ఒకటే దేవేంద్రుడైన ఒకటే ఇహపర బేధాలు లేవు. ఆ చోటులో అందరూ సమానులే. నిర్జీవమై ఆ చోటుకు చేరిన మమకారం గుప్పెడు మట్టిగా మారిపోతుంది. తలదించిన అహంకారం ఊపిరితోపాటు ఎగిరిపోతుంది. సంపాదించిన సొమ్ము బతికుండగా పెట్టిన సంతకంతో రెక్కలు వచ్చే ఎగిరిపోతుంది. మనది కాని చోట...

గురువు

గురువు బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. బడి అంటే భయం తొలగించి బుజ్జగించి లాలించి అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పేది గురువు అక్షరమనే ఆయుధాన్ని ఇచ్చి బ్రతుకు పోరాటపు యోధుడుగా తీర్చిదిద్దేవాడు గురువు. అజ్ఞానం తొలగించేది గురువు విజ్ఞానాన్ని పెంచేది గురువు. గుడిలో ఉండేది కనిపించని దైవం బడిలో ఉండే ది నడిచే దైవం. అమ్మ ఒడి దాటి గుడిలో అడుగుపెట్టిన బొమ్మని  అమ్మ లా ఆదరించేది గురువు. కార్గిల్ యుద్ధ వీరుడు అయిన కరోనాకు వైద్యం చేసే డాక్టర్ అయినా కష్టపడే కార్మికుడైన  పొలం దున్నే రైతైన ఆకాశాన్నంటే భవనాలు నిర్మించే ఇంజనీర్ అయిన ఒక గురువుకి శిష్యుడే ఆ శిష్యుడు గుండెల్లో గురువు ఒక దైవమే గురువు పాత్రకే ఉంది ఆ గౌరవం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

మనసే మందారమైన వేళ

శీర్షిక: మనసే మందారమైన వేళ మనిషిని నడిపించే యంత్రం మనసు మనసే కదా మనిషికి మంచి మిత్రుడు మనసును మించిన శత్రువు కానరాడు. రహదారిలో నడిపించేది మనసు గోదావరిలో ముంచేసేది మనసే. మనసు కోరితే తూచా తప్పకుండా  అమలు చేసేది తనువు. మనిషి చేసే కర్మలకి మనసే కదా మూలం. స్పందించే హృదయం ఉంటే మనసున్న వాడని నామకరణం దయగల ప్రభువులని బిరుదులతో సత్కారం. కోరికలతో దహించుకపోయేది మనసు  కొండమీద కోతి కోసం  పడరాని పాట్లు పడుతుంది తనువు. అందని ద్రాక్ష కోసం అసువులు అర్పిస్తుంది మనసులోనే ఉంది మహత్యం. ఆందోళనకు లొంగని మనసుంటేనే ఆరోగ్యం. మనసే మందారమైన వేళ. తనువు ఆనంద నృత్యం చేస్తుంది. సత్కర్మల వైపు పరుగులు తీస్తుంది. గువ్వలా ఎగిరిపోవాలనిపిస్తుంది మనసే కదా మనిషిని నడిపించే యంత్రం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

గోరింటాకు

గోరింటాకు – ఒక సంస్కృతిక చిహ్నం భారతీయ సంస్కృతిలో అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో గోరింటాకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుతో చర్మాన్ని అలంకరించుకోవడమే కాదు – ఒక అభిమానం, ఒక భావోద్వేగం, ఒక శాశ్వత సాంప్రదాయం. గోరింటాకు అంటే ఏమిటి? గోరింటాకు (Henna) అనేది Lawsonia inermis అనే ఔషధ మొక్క. దీని ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ రూపంలో చేతులకు, కాళ్లకు పూస్తారు. కొన్ని గంటల తరువాత అది వదిలే రంగు గోధుమలో నుంచి ఎరుపు గరిష్టంగా మారుతుంది. ఆ రంగే ఆడపిల్లల ఆనందానికి సంకేతం. పెళ్లిళ్లలో గోరింటాకు ప్రాధాన్యం తెలుగు వివాహ సాంప్రదాయంలో పెళ్లికి ముందు రోజు గోరింటాకు వేయడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. పెళ్లికూతురికి, ఆమె స్నేహితులకు, కుటుంబ మహిళలందరికీ గోరింటాకు వేయడం ఆనందంగా జరుగుతుంది. ఇది భవిష్యత్తు కుటుంబ జీవితానికి శుభప్రదంగా ఉంటుంది అనే నమ్మకంతో చేయబడుతుంది. గోరింటాకు వేయడం వెనుక భావన గోరింటాకు వేయడం వెనుక శరీర ఆరోగ్యానికీ సంబంధం ఉంది. ఇది చర్మానికి చల్లదనం ఇస్తుంది. మానసికంగా ఓ శాంతిని కలిగిస్తుంది. అలాగే పెళ్లి సమయంలో జరిగే శ్రమ, ఉత్సాహపు ఉబ్బరాన్ని తలచినప్పుడు, గోరి...

అరవై ఏళ్లకు పెళ్లి

 అరవై ఏళ్లకి పెళ్లి మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడిగింది అరవైఏళ్ల పరమేశ్వరరావుని హాలు లోంచి కోడలు సుజాత.  "మీకు పంచికట్టుకోవడం అయితే నేను వచ్చి నుదుట నామం, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క పెడతాను అoది సుజాత. అలాగేనమ్మా అన్నాడు! పరమేశ్వరరావు. ఇంతలో పరమేశ్వరావుకి కూతురు రమ్య గొంతు గట్టిగా వినిపించింది మేడ మీద నుంచి. " అమ్మ తయారయ్యావా! పంతులుగారు పిలుస్తున్నారు అని అంది రమ్య. అయిపోయిందమ్మా! అని సమాధానం ఇచ్చింది పరమేశ్వర రావు భార్య రాధిక. ఎంత బాగున్నావ్ అమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో నా దిష్టి తగిలేలా ఉంది అని తల్లిని చూస్తూ రమ్య. పద పద అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని మేడ దిగి వస్తుంటే నిజంగానే సుజాత కొత్త పెళ్ళికూతురు అనిపించింది హాల్లో ఉన్న బంధువులకి స్నేహితులకి. అందమైన చిలకాకుపచ్చ ఎర్ర అంచు బోర్డర్ ఉన్న పట్టుచీర, రంగు వేసిన జుట్టు, కాళ్ళకి చేతులకి గోరింటాకు, నుదుటన పెళ్లి బొట్టు, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క జడలో మల్లెపూలు ఇది యాభై ఎనిమిది ఏళ్ల పెళ్లి కూతురు అలంకరణ.  పెళ్లికూతురు ఆ పక్క ఈ పక్క రాధిక కూతురు సుమ , సుమ భర్త సుధాకర్ కూర్చుని ఉన్నారు. పెళ్లికూతురు తల్లిదండ...

రాజమహేంద్రవరం

 రాజమహేంద్రవరం. నేను ఎందుకు ప్రత్యేకo ఎన్నిసార్లు పేర్లు మారినా  నేను రాజరాజ నరేంద్రుని  రాజధానినే చరిత్ర ఎవరు చెరిపేయగలరు  ఒకళ్ళ ఇద్దరా ఎన్ని రాజవంశాలు  నన్ను నడిపించాయో  ఎంతో మంది కవులు  ఎంతోమంది సంఘసంస్కర్తలు  తీర్చిదిద్దిన సాంస్కృతిక రాజధానిని  రాజమండ్రి ని  గాలిలో ఎగురుకుంటూ వచ్చేవాళ్లు  జాతీయ రహదారిపై రివ్వున  దూసుకు వచ్చేవాళ్ళు  చుకు చుకు బండి  దిగేవాళ్లు  షికారుగా బోటు లో   రోజు ఎంతోమంది అంతకంటే ముఖ్యం  ఏ నగరానికి లేని అదృష్టం  గలగల పారే గోదావరి  నా పక్కన ఉండడం  ఎప్పటి బిపిన్ చంద్రపాల్  ఇప్పటికీ గాలిలో ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది  నా నగరంలోని పాల్ చౌక్ లో అదేనండి కోటిపల్లి బస్టాండ్  బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినా  కలెక్టర్ గారి పేరు మీదుగా నా నగరంలో   ఇన్నిసుపేట మిగిలిపోయింది. అక్కడ అందమైన పూల తోటలు లేవు. మనసును మల్లెపూలలా మార్చే  దివ్యజ్ఞాన సమాజం నాయకుడు  ఆల్కాట్ పేరుతో ఏర్పడిన వీధి  ఆల్కాట్ గార్డెన్స్ ఆ రామదాసు రామ భక...

నా స్నేహితుడు

"నాన్న అలా కాదు ఈ సైడ్ బటన్ నొక్కాలి ఇక్కడ ఆన్ చేయాలి. చార్జర్ ఇలా పెట్టాలి మళ్లీ రీస్టార్ట్ చేయాలి. నెట్వర్క్ పనిచేయట్లేదు ఏమో మొబైల్ నెట్వర్క్ వాడుకో. ఫేస్బుక్ క్రియేట్ చేసాం వాట్సాప్ నెంబర్ ఇదే. యూట్యూబ్ ఉండనే ఉంది. సాంసంగ్ నోట్స్ డౌన్లోడ్ చేసాం. ఏమిటో కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు పిల్లలు నాన్న నీ మొబైల్ నెంబర్ మొదటి నెంబరు చివరి నెంబరు కూడానీలక్కీనంబరే.Youareluckyఅంటూఆనందపడిపోయారు ఇలా చకా చకా నాకు చెబుతూ నా పుట్టినరోజుకి ఆ బుల్లి ముండని నా చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను అక్షరాల నేర్పిన పిల్లల దగ్గర శిష్యుడిలా మారిపోయి మొత్తానికి బ్రహ్మవిద్య నేర్చేసుకున్న. చుట్టాలు పక్కాలు పార్కులో స్నేహితులు, మార్కెట్లో కూరగాయల షాపులు , కిరాణా షాపులు , పాలవాళ్లు ,మెడికల్ షాపులు, డాక్టర్లు, రక్త పరీక్ష కేంద్రాలు పనిమనిషి ,చాకలి, మంగలి నంబర్లన్నీ డైరీ తీసి కాల్ లిస్టులో పెట్టేసుకున్న. ఆ లిస్టు చూస్తే పెళ్లి సామాన్లు లిస్టులా ఉంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఆస్తమాను దాన్ని చూస్తూ చేతిలో అటు ఇటు తిప్పుకుంటూ జేబులో పెట్టుకుంటూ ఎ...

జగన్నాథ రధ చక్రాలు వస్తున్నాయి

పరిచయం: ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు (జూన్/జూలైలో) జరిగే జగన్నాథ రథయాత్ర అనేది భారతీయ సంస్కృతి మరియు భక్తి పరంపరలో అతి విశిష్టమైన పండుగలలో ఒకటి. ఇది ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం, పూరీ నగరంలో జరుపబడుతుంది. ఈయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రా దేవి తండ్రిగారి ఇంటికి వెళ్లే విధంగా విశేషంగా జరుపబడుతుంది. 📜 చరిత్ర: జగన్నాథుడి దేవాలయం పురాతనమైనది. స్కంద పురాణం, బ్రహ్మ పురాణం మొదలైన అనేక పురాణాలలో ఈ క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. జగన్నాథ స్వామిని విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఈ యాత్ర ప్రబలమైన భక్తి ఉద్యమానికి ప్రతీకగా స్థాపితమైంది, ముఖ్యంగా చైతన్య మహాప్రభు కాలంలో ఇది మరింత ప్రాచుర్యం పొందింది 🚩 యాత్ర విశేషాలు: రథాలు: నంది ఘోష (జగన్నాథుడు): 16 చక్రాలు తలధ్వజ (బలరాముడు): 14 చక్రాలు దర్పదళన (సుభద్ర): 12 చక్రాలు రథాలను కట్టడం నుంచీ లకడియ కార్మికులు శ్రద్ధతో తయారు చేస్తారు. గుండిచా మందిరం: ఇది జగన్నాథుని తల్లి దేవాలయం అని భావిస్తారు. స్వామి అక్కడ ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. భక్తుల భాగస్వామ్యం: లక్షలాది మంది భక్తులు రథాలను తాళ్ళతో లాగడం ద్వారా తమ భక్తిని ప్రదర్శ...

డాక్టర్

 🏥 డాక్టరు 💊  అర్ధరాత్రి 12 గంటలు అయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొర్లుతున్నాడు డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ కార్డియాలజిస్ట్. ఇంతలో వీధిలోంచి అంబులెన్స్ శబ్దం వినిపించింది. ఎవరికి ఎలా ఉందో పాపం! అనుకున్నాడు. రోజు ఎన్నో వేల మందికి గుండె వైద్యం చేసి అంబులెన్సులు సిరంజిలు శతస్కోపులు మందులు ఆపరేషన్ థియేటర్లు ఇంటెన్సు కేర్ యూనిట్లు స్పెషల్ వార్డు మధ్య బతుకుతున్నా , అంబులెన్స్ శబ్దం అంటే డాక్టర్ కైనా భయం అనిపిస్తుంది. అంటే ఎవరో ప్రమాదంలో ఉన్నారని సూచన ఇస్తోందన్నమాట ఆ శబ్దం.  రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్ క్వార్టర్స్ లో కాపురం ఉంటుంన్న డాక్టర్ శ్రీనివాసు కి ఆ అంబులెన్స్ తమ క్వార్టర్స్ లో లో నుంచే వెళ్లడం గమనించాడు కిటికీలోంచి. ఎవరబ్బా. అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. హలో అనగానే అవతల నుంచి క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ రమేష్ సార్ మన డాక్టర్ శశాంక్ గారికి పెయిన్ వచ్చిందిట. ఇప్పుడు కాజువాలిటీలో ఉన్నారు కండిషన్ సీరియస్ గా ఉంది. సార్ మీరు వెంటనే రావాలి అంటూ గబగబా నాలుగు ముక్కలు చెప్పేసాడు. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చేయవలసి...

భూత యజ్ఞం

భూత యజ్ఞం అనేది సనాతన ధర్మంలో ఉన్న అయిదు ప్రధాన పంచ మహా యజ్ఞాలలో (Pancha Maha Yajnas) ఒకటి. ఈ యజ్ఞాలు గృహస్తుడిగా జీవించే వ్యక్తి నిత్య కర్తవ్యంగా నిర్వహించవలసిన సత్కార్యాలను సూచిస్తాయి. వాటిలో: • దేవ యజ్ఞం – దేవతల పూజ • పితృ యజ్ఞం – పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు • ఋషి యజ్ఞం – వేదాధ్యయనము, గురు సేవ • మనుష్య యజ్ఞం – అతిథి సేవ, దానధర్మాలు • భూత యజ్ఞం – జంతువులు, పక్షులు, చిన్న జీవుల సేవ భూత యజ్ఞం అంటే ఏమిటి? "భూత" అంటే ఇక్కడ జీవరాశులు అన్న అర్థంలో వాడతారు – అంటే పశు, పక్షి, క్రిమికీటకాది జీవులు. భూత యజ్ఞం అనగా: "ఇతర జీవుల పట్ల కరుణతో, హింస లేకుండా, అవసరమైన ఆహారం, నీరు వంటి సహాయాన్ని అందించడం." భారతీయ సంప్రదాయంలో, మనుష్యులు ఈ భూమిపై ఒక్కరే కాదు. ఇతర జీవులంతా కూడా ఈ ప్రకృతి భాగస్వాములే. అందుకే, మన ఆహారం తయారీలోనైనా, మిగిలిన తినుబండారాలలోనైనా, ఏదో ఒక భాగాన్ని పక్షులకో, శునకాదులకు అర్పించే సంప్రదాయం ఉన్నది. భూత యజ్ఞం చేసేది ఎలా? భూత యజ్ఞం అనేది కొన్ని సాధారణ చర్యల ద్వారానే చేయవచ్చు: • ఇంటి వద్ద పక్షులకు తినుబండారాలు (ధాన్యాలు, నీరు) ఉంచడం • శునకాలు, పిల్లులు వంటి వీధి...

దేవుడి సొమ్ము

దేవుడి సొమ్ము  " రామా రెడ్డిగారు . మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట! . ఏ ఏడాది శిస్తు పూర్తిగా ఇవ్వరు. ఇలాగైతే ఎలాగండి!  అంటూ కోపంగా అరిచాడు వినాయకుడి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు.  ఆ మాటలకు రామా రెడ్డి  నవ్వుతూ  పంటలు పండక పోతే ఏం చేయమంటారండి ! మేము మటుకు దేవుడు సొమ్ము ఉంచుకుంటామా! మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి అన్నాడు.  సదరు  రెడ్డి గారికీ  ప్రతి ఏటా ఇదే మాట చెప్పడo అలవాటైపోయింది.  రెడ్డి గారి మాటలకి " ప్రతి ఏటా ఒక కారు మారుస్తున్నాడు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. కానీ దేవుడు సొమ్ములు కట్టడానికి మటుకు పంటలు పండలేదు అంటున్నాడు  అని మనసులో బాధపడ్డాడు హనుమంతరావు.  ఆ గ్రామంలో వినాయకుడు దేవాలయం అది పురాతన మైనది స్వయంభు ఆలయం. రోజు వందలాది భక్తులు వచ్చి కోరిన కోర్కెలు తీర్చుకోడానికి మొక్కులు మొక్కుతుంటారు. ప్రతిరోజు అక్కడ గణపతి హోమం , నిత్య పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటుంది.   ఎప్పుడో పూర్వకాలంలో ఎవరో భక్తులంతా కలిపి దానంగా 25 ఎకరాలు దేవుడికి ఇచ్చారు. ఆ భూమి అంతా ఆ ఊర్లో పలుకుబడి ఉన్న రెడ్డి  గారు కౌలు...

ఆ రోజుల్లో

ఉదయం ఎనిమిది గంటలు అయింది. నిండా పదేళ్లు కూడా లేని మనవరాలు "అమ్మ స్కూలుకు టైం అయిపోతోంది ! అని ఊరికే తొందర పెడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతున్న నా కూతురు వస్తున్నా ఉండవే! బయటికి గబగబా వచ్చి బాత్రూంలోకి పిల్లల్ని లాక్కుపోయింది. కాసేపు పిల్ల ఏడుపు తల్లి సముదాయింపు వెరసి తయారైన పిల్లనీ తీసుకుని తల్లి బయటికి వచ్చింది.  ఆ కాన్వెంట్ విద్యార్థిని చూస్తే ఆశ్చర్యమేసింది! స్కూలు యూనిఫామ్, మెడలో టై, స్కూల్ బ్యాడ్జి, కాళ్లకు బూట్లు సాక్సులు చేతికి స్కూల్ బ్యాగ్ , బ్యాగులో బరువైన పుస్తకాలు, పెన్సిల్లు రబ్బరు ఇరేజర్ పెట్టుకోవడానికి ఒక చిన్న పెట్టే, క్యారేజీ కి ఒక సంచి, నిండా నీళ్లతో ఒక వాటర్ బాటిల్, మధ్యలో స్నాక్స్ ఇది స్కూలుకు వెళ్లే విద్యార్థి అవతారం.  ఆ స్కూల్ బ్యాగ్ పైన రకరకాల బొమ్మలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. " స్కూల్ బ్యాగ్ చాలా బాగుంది అన్న నా ప్రశంసకి సమాధానంగా మా అమ్మాయి ఏముంది నాన్న ప్రతి ఏటా కొత్త బ్యాగు కొనడమే అంది. మొత్తానికి తల్లి, పిల్ల నోట్లో అన్నం కుక్కి ఏదో మాయ మాటలు చెప్పి సందు చివర స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. మా అమ్మాయి మొహం లో ఎంతో రిలీఫ్ కనబడింది. ఇంతకీ అది చదివ...

కుటుంబం

ఉదయం ఆరు గంటలు అయింది.  ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది.  ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి  ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు.  "పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య. ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చుంటాడు. ...

నాన్న నా కంటే ఎప్పుడు అదృష్టవంతుడే

ఉదయం 9.00 అయింది. ఆ ఊర్లో రమేష్ బస్సు దిగి సరాసరి ఇంటికి నడుచుకుంటూ వచ్చి గుమ్మoల్లోకి అడుగు పెట్టేసరికి అరుగు మీద రమేష్ తండ్రి చలపతిరావు వాలుకుర్చీలో పడుకుని పక్కనే కూర్చున్న ఊరి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు.  " నాన్న ఎలా ఉన్నారని పలకరించే సరికి మీ నాన్నగారికి ఏవండీ చాలా మంచి వ్యక్తి ఉన్న రోజు ఒకలాగే ఉన్నాడు లేని రోజు ఒకలాగే ఉన్నాడు అందరూ కావాలనుకునే వ్యక్తి. అందరి క్షేమం కోరే వ్యక్తి అంటూ అక్కడ కూర్చున్న జనం అంటుంటే ఒక్కసారి గర్వంగా అనిపించింది రమేష్ కి " నువ్వేమిటిరా అలా చిక్కిపోయావ్ ! ఆఫీసులో అంతా బాగానే ఉందా! పిల్లలు కోడలు అంతా క్షేమమేనా అంటూ ప్రశ్నలు కురిపించే నాన్నకు సమాధానం చెప్పి ఎదురుపడిన అమ్మ సీతమ్మని పలకరించి ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రమేష్. రమేషు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో పనిచేస్తుంటాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇల్లు కొనుక్కుని భార్య ఇద్దరు పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకు ఆఫీసుకు బయలుదేరి రాత్రి మళ్ళీ 10 గంటలకి ఇంటికి చేరుతాడు. రమేష్ కి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు పేరు చలపతి. చిన్న దాని పేరు సీత. ఇ...

స్పూర్తి

ఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వరకు అమ్మ తిన్నా తినకపోయినా ఒడిలో పడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ నా ఆకలి తీర్చేది. నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వయసు వచ్చిన తర్వాత కుండలో వండిన నాలుగు మెతుకులు నాకూ వాటా పెట్టి అమ్మ పస్తులు ఉండేది. ఎందుకంటే నాతో పాటు నాలుగు మెతుకులు పంచుకునేందుకు మరో ఇద్దరు మొత్తం ముగ్గురం. మాతో పాటు అమ్మానాన్న.   ఎన్నోసార్లు అమ్మానాన్న కుండలోని మంచినీళ్ళతో కాలం గడిపేవారో. ఆకలి గురించి ఆలోచించే సమయం కానీ తీరిక గాని ఆ దంపతులకు లేవు. తెల్లవారి లేస్తే తట్టబట్ట సర్దుకుని పొలం గట్టుకు చేరకపోతే మర్నాడు మా ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేచేది కాదు. కాలచక్రాన్ని ఎవరు ఆపలేం. తిరిగే కాలం నాకు 10 సంవత్సరాల వయసుని మా ఇంటి పరిస్థితిని అదే సమయంలో మా ఊరిలో ఉండే పెద్ద మేడలో ఉన్న నా వయసు వాళ్ల నిత్య కృత్యాన్ని గమనించుకునే జ్ఞానం కలిగించింది. కాలం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా కున్న పరిస్థితిని దాటడానికి నా బాధ్యతను గుర్తుచేసింది. అంటే ఒకటి మా పేదరికం రెండోది నా చదువు .  చదువు నాకు అందని ద్రాక్ష . అందనిద...

మనవరాలు

అసలు కన్న వడ్డీ ముద్దు  జనుల అనుభవం నుంచి వచ్చిన సామెత పాతికేళ్లు పెంచి పోషించిన అనుబంధం. నా రక్తం పంచుకు పుట్టిన కన్నపేగుతో బంధం. కన్న పేగుతో అనుబంధం సహజమే పట్టుమని పది నెలలు కూడా లేని చంటి దానితో  అంతకుమించిన అనుబంధం. తాత తన తరం కోరుకుంటాడు  తరం తోటే తాత తరిస్తాడు. తరం కోసమే తాత కలవరించి పోతాడు. కన్నపేగు బిడ్డకు జన్మనిస్తే కన్నుల పంట కదా. తాతకి. వయసు మీరిన తాతకు చంటిది కదా వరాల మూట వరాలిచ్చే వారిని దేవుడు అంటారు అందుకే పిల్లలు దేవుడు సమానం. ఆ వరాల మూట దేవుడిలా ప్రత్యక్షమౌతుంది. పట్టుమని పది రోజులు పండగలా జరిగిపోతుంది. ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది. ఆటపాటలతో అలరిస్తుంది. నడక రాలేదు నాలుగు మూలలకి పోతుంది.  కనిపించిన వన్నీ నోటి పరం. అదే నిత్యం తాతకు భయం. పాటలంటే ప్రాణం. టక్కున చూపంతా ఆ వైపే. రక్తంలోనే ఉంది రాగం. అందుకే పాట అంటే అభిమానం. అమృతం అక్కర్లేదు అమ్మపాలు వేళకు ఇస్తే చాలు. బొమ్మలతో ఆడుకుంటుంది అమ్మ పక్కన లేకపోతే ఆ బొమ్మ బోరు మంటుంది. మాటలు రాలేదు నోటి నుండి విచిత్ర శబ్దాలు ఆ శబ్దాలు లోనే కోటి అర్థాలు. అర్ధాలు అన్నీ అమ్మకే అవగతం. బిడ్డ భాష అమ్మకే అర్థ...

బాల్యం

చిత్రం
బాల్యమే కదా బంగారు అనుభవం అనుభవాలజ్ఞాపకాలు తలుచుకుంటే కలుగు ఆనందం. అంతరార్ధం తెలియదు అమ్మ జోలపాట బిడ్డకు ఆనందo ఆకలి అంటే తెలీదు బిడ్డ ఏడుపే అమ్మకు సంకేతం. కొండంత లోకం చూపిస్తూ పెట్టే గోరుముద్ద చిన్ని బొజ్జ కు శ్రీరామరక్ష . అనుబంధాల గురించి తెలియదు అమ్మమ్మ చేతుల్లోనే పెరుగుతుంది బాల్యమంతా. అమ్మమ్మ అనుభవమే కదా బిడ్డకు ఆరోగ్య రక్ష. బంధువులంతా చూపే గారాబం బతుకంతా తీయని జ్ఞాపకం. నాన్న చూపే మార్గం బిడ్డ భవిష్యత్తుకు అదే స్వర్గ సోపానం. బాల్యం అంటే రంగురంగుల అనుభూతి. గాలి ఉన్న చక్రo సైకిల్ కి ప్రాణం. తుసుమన్న చక్రం ఆట వస్తువు పండుగాడికి. వీధులన్నీ చక్కర్లు కొట్టే ఆట  బాల్యపు బంగారు ఆట పడుతూ లేస్తూ పెడల్ మీద సైకిల్ నేర్చుకోవడం. బుడ్డి దానికి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం. కిందపడిన లేవడం అక్కడి నుంచే ఆరంభం. ఒంటి మీద ఉన్న గాయపు మచ్చలు  బాల్యపు సాహస కార్యాలు అన్నింటికీ చిహ్నం. అమ్మకి పచారీ కొట్టు నుంచి సామాను తేవడానికి సాయం. సాయం అడిగిన వారికి సహాయం చేయడం అక్కడినుంచే శ్రీకారం. జిమ్ కి వెళ్ళక్కరలేదు ఝామ్మంటూ సైకిల్ తొక్కే చాలు. చక్కటి వ్యాయామం.   బాల్యం అంటే ఒక తియ్యని జ్ఞాపకం. జ్ఞ...

ఆఖరి కప్పు

ఆఖరి కప్పు.  ఇవాళ నిన్న కాదు సుమారు యాభై సంవత్సరాల నుంచి పరిచయం. ఉదయం లేస్తూనే దంత దావనం చేసుకున్న వెంటనే ముందుగా నన్ను పలకరించేది, నేను పలవరించేది , వంటిల్లువైపు ఆశగా చూసేది, పది నిమిషాలు ఆలస్యం అయితే బుర్ర పనిచేయన ట్లుగా తయారుచేసింది , దానికి మేము బానిస అయ్యింది ఆ కాఫీ మహాతల్లికి.  పదేళ్లు వయసు వచ్చేవరకు అమ్మ పాలు, గుమ్మ పాలు తాగి పెరిగిన ఈ శరీరం ఇంట్లో నాకంటే అందరూ పెద్దవాళ్ళు పెద్దపెద్ద గ్లాసులతో అదేదో కొత్త రంగులో ఉండి ఆప్యాయంగా ఉదయం రెండు మూడు సార్లు తాగే ఆ ద్రవాన్ని చూసి అంతవరకు పాల రుచి తప్ప మరొక రుచి ఎరగని నేను కొత్త రుచి కోసం పేచీ పెట్టి రుచి చూసిన రోజు నుంచి సుమారు నెలరోజుల క్రితం వరకు అది నాకు ఆప్తురాలు అయిపోయింది.  నిజానికి ఈ అలవాటును పెద్దవాళ్ళు ఎవరు చెయ్యి పట్టుకుని అలవాటు చేయలేదు. ఇంట్లో అందరూ తాగుతుంటే నేను కూడా తాగాలని కోరిక పుట్టి అలవాటుగా మార్చుకున్నది.  మాది ఉమ్మడి కుటుంబం. పిల్లలు పెద్దలు కలిసి ఇరవై మందిపైగా. అందులో ఒకరిద్దరు తప్పితే అందరూ కాఫీ తాగేవాళ్లే. ఇది కాకుండా పరిచారిక జనం.  తెల్లవారుజామున నాలుగు గంటలకు కట్టెల పొయ్యి వెలిగి...

యోగా ఒక యోగం

"మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవిత లక్ష్యాల వైపు కదలగలడు" అనే మాటను ఎప్పటికీ మర్చిపోలేం. శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును, ప్రాణశక్తిని, ఆత్మను కూడా పరిపక్వత దిశగా తీసుకెళ్లే మార్గమే యోగా. ఇది వ్యాయామం కాదు – జీవన శైలి. ఒక పరిశుద్ధ భారతీయ  సంప్రదాయం. యోగం – మూలాలు, మార్గాలు "యోగ" అనే పదం సంస్కృతంలో "యుజ్" అనే ధాతువు నుంచి పుట్టింది. దానికి అర్థం – "ఒక్కటిపరచడం", అంటే శరీర–మనస్సు–ఆత్మ సమన్వయం. పతంజలి మహర్షి చాటిన అష్టాంగయోగం – యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి – యోగ సాధనకు మూలస్థంభాలు. ఇవి వ్యాయామపు క్రమాలుగా కాకుండా, మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మెట్లు. యోగ విభాగాలు (Types of Yoga) భగవద్గీత, ఉపనిషత్తులు, పతంజలి యోగసూత్రాలు మొదలైన గ్రంథాలలో యోగాన్ని వివిధ మార్గాలుగా వివరించారు: 1. రాజయోగం – ధ్యానం (meditation) ద్వారా మనస్సును నియంత్రించడం. పతంజలి యోగసూత్రాల్లో ఇది విపులంగా వివరించబడింది. అష్టాంగ యోగం: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. 2. భక్తి యోగం – భగవంతునిపై ప్రేమ, భక్తి ద్వారా ఉద్ధరణ. త్యాగభావం...

చేతి వ్రాత

" ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులుపుతూ. " నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నాను గా! ఎందుకు పడేయడం? నీకు అంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటాను. నువ్వు అక్కడ వదిలేసేయ్ అన్నాడు కోపంగా సుధాకర్.  " ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. ఒకసారి కూడా దులిపిన పాపాన పోలేదు అoది రమ్య. " సరేలే అలా వదిలేసేయ్. తర్వాత చూద్దాం అన్నాడు చిరాకుగా సుధాకర్ .రమ్య ఏమీ చేయలేక విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది. " ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీ లని పడేస్తాను అంటుంది ఏమిటి ? దాని విలువ తనకేం తెలుసు! కొన్ని కోట్లు ఖర్చుపెట్టిన అలాంటి వాటిని మళ్లీ తీసుకురాలేము సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్లిపోయాడు.  రామయ్య రవణమ్మల ఏకైక పుత్రుడు సుధాకర్. రామయ్య ఒక చిన్న రైతు. రవణమ్మ అప్పటి రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యి టీచర్ గా పనిచేస్తూ ఉండేది . వాళ్ళిద్దరు కాపురం ఆ పల్లెటూర్లో ఒక మూడు గదులు ఉన్న పాడుబడిన బంగాళా పెంకుల కొంప.   లేక లేక పు...