బాల్యం
బాల్యమే కదా బంగారు అనుభవం
అనుభవాలజ్ఞాపకాలు తలుచుకుంటే కలుగు ఆనందం.
అంతరార్ధం తెలియదు అమ్మ జోలపాట బిడ్డకు ఆనందo
ఆకలి అంటే తెలీదు బిడ్డ ఏడుపే అమ్మకు సంకేతం.
కొండంత లోకం చూపిస్తూ పెట్టే గోరుముద్ద చిన్ని బొజ్జ కు శ్రీరామరక్ష .
అనుబంధాల గురించి తెలియదు అమ్మమ్మ చేతుల్లోనే పెరుగుతుంది బాల్యమంతా.
అమ్మమ్మ అనుభవమే కదా బిడ్డకు ఆరోగ్య రక్ష.
బంధువులంతా చూపే గారాబం బతుకంతా తీయని జ్ఞాపకం.
నాన్న చూపే మార్గం బిడ్డ భవిష్యత్తుకు అదే స్వర్గ సోపానం.
బాల్యం అంటే రంగురంగుల అనుభూతి.
గాలి ఉన్న చక్రo సైకిల్ కి ప్రాణం.
తుసుమన్న చక్రం ఆట వస్తువు పండుగాడికి.
వీధులన్నీ చక్కర్లు కొట్టే ఆట
బాల్యపు బంగారు ఆట
పడుతూ లేస్తూ పెడల్ మీద సైకిల్ నేర్చుకోవడం.
బుడ్డి దానికి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం.
కిందపడిన లేవడం అక్కడి నుంచే ఆరంభం.
ఒంటి మీద ఉన్న గాయపు మచ్చలు
బాల్యపు సాహస కార్యాలు అన్నింటికీ చిహ్నం.
అమ్మకి పచారీ కొట్టు నుంచి సామాను తేవడానికి సాయం.
సాయం అడిగిన వారికి సహాయం చేయడం అక్కడినుంచే శ్రీకారం.
జిమ్ కి వెళ్ళక్కరలేదు ఝామ్మంటూ సైకిల్ తొక్కే చాలు.
చక్కటి వ్యాయామం.
బాల్యం అంటే ఒక తియ్యని జ్ఞాపకం.
జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కాలం గడిపేద్దాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి