పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పుల్లయ్య బజ్జి

ఉదయం ఐదు గంటలు అయింది. ఎప్పటిలాగే ఆ పల్లెకి తెల్లారింది. అగ్రహారంలోని సందు చివరన ఉన్న కాఫీ హోటల్‌ వైపు అరుపులు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అదేమీ పెద్ద హోటల్ కాదు. చిన్న పాక హోటల్. మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. హోటల్ లోపల కర్రబల్లల మీద పొలాలకు వెళ్లే రైతులు కూర్చుని ప్రతిరోజూ ఒక్క కప్పు టీ తాగి, అప్పుడు పొలాలకు వెళ్లడం వారికి నిత్యకృత్యం. ఉదయాన్నే రైతులతో, కాస్త ఆలస్యంగా వ్యాపారులతో, టిఫిన్ సమయానికి అగ్రహారంలోని ప్రతి ఇంటి వాళ్లతో – ఆ హోటల్‌లో ఖాళీ అనే మాటకే చోటుండదు. ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే చద్దన్నం తినేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ పుల్లయ్య హోటల్‌లో టిఫిన్ కోసం ఎగబడుతున్నారు. అతడే ఆ పాక హోటల్ యజమాని – పుల్లయ్య. హోటల్ ఎప్పుడు పెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి అదే పాకలో, అదే ధోరణిలో కొనసాగుతోంది. పాకా మారలేదు – పుల్లయ్య మారలేదు. వయసు పెరుగుతున్నా టిఫిన్ల రుచి మాత్రం తగ్గడంలేదు. ప్రతి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, కట్టెల పొయ్యి వెలిగించి పని మొదలుపెడతాడు. సహాయులు ఎవరూ ఉండరు – అంతా తన సొంతంగా. "ఏమయ్యా పుల్లయ్య, ఎవ్వరినైనా పనికి పెట్ట...

వీధి కుక్కలు

"ఎందుకు మావయ్య గారు, ఆ వీధి కుక్కలకి రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజూ ఇదే పని!" అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని. "ఎన్నోసార్లు వద్దని చెప్పాం! అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూముల వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొనిపెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఈ అలవాటు!" అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి. "పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చవుతుందో, మీరైనా లెక్క చూసుకున్నారా!" అని అడిగేసరికి, ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి. అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయాడు రాజారావు.  అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజూ వెళ్లే లాల్‌బహుదూర్‌నగర్ రోడ్ నెంబర్ రెండు లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు. రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ పది కుక్కలు రాజారావు చుట్టూ చేరేయి. వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి,...

నలుపు నాణ్యమే

నలుపు – నాణ్యమే మనిషి నయనాలు పసిగట్టి చూసేది రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో నలుపు అంటే చాలామందికి భయం, తిరస్కార భావన కలిగించే ఒక నీడలా అనిపిస్తుంది. కానీ ఆ నలుపు అంత తేలికైనది కాదు. అది ఒక జీవిత దర్శనం, ఒక గంభీరమైన సందేశం. సప్తవర్ణాలు దేవుని సృష్టి. అందులో నలుపు కూడా ఒకటి. కానీ మిగిలిన రంగులకంటే నల్ల రంగుపై వ్యతిరేక భావన ఎక్కువ. ఎందుకంటే అది చీకటిని గుర్తు చేస్తుంది. కానీ అదే నలుపు చల్లని మేఘంగా మారి చినుకులుగా జలధారలు కురిపించగలదు. భూమిని పచ్చగా మార్చే మొదటి అంకురం నలుపే. విద్యా బోర్డు - నలుపే; జ్ఞానం - వెలుగు పాఠశాల బోర్డు నలుపే. కానీ దానిపై రాసే తెలుపు అక్షరాలే విద్యార్థుల జీవితానికి దారిదీపాలు. నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడమే కాదు, వాటి ప్రాముఖ్యతను కూడా నలుపే అందిస్తుంది. అది శిక్షణకు మార్గదర్శి. ఆరోగ్యానికి, అందానికి కూడా నలుపు అవసరం నల్ల నేరేడు, నల్ల ముళ్లి వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను నివారించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. కళ్లకు మెరుపు ఇచ్చే నల్లటి కాటుక ఆత్మవిశ్వాసానికి చిహ్నం. బొట్టు, చుక్కలుగా పెళ్లికూతురి ముస్తాబులోనూ నలుపు కీలకం. భ...

పండుగ

అబ్బా ! మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాముఅంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్ లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ "చూడండి నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది.   జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి చూశారు. ఏం సమాధానం చెప్పాలని.  ఆడపిల్లలు మనవలని ఎత్తిన భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి చిన్నది ఫోన్లు పెట్టేసారు. జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి ఇద్దరేసి పిల్లలు పుట్టారు.  ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. "అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు వస్తారుట...

బొమ్మ కావాలి

సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది. ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే. బ్రతుకు బండి నడవాలంటే మూడు వందల అరవై ఐదురోజులు ఆ తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య.  ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు  తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపోతుంది నరసమ్మ కి. అందుకే ఉదయం నుంచి ఏదో సాకు చెబుత...

పాత బట్టలు

నిజానికి ఇది ఒక కుటుంబ సమస్య .... సాంఘిక సమస్య కూడా పర్యావరణ సమస్య కూడా... ఇంతకీ ఏమిటిది? పాత బట్టలు. ఏ ఇంట్లో చూసినా కబోర్డ్ లు నిండిపోయి ఉంటాయి పాత బట్టలు. క్రితం సంవత్సరం పండగకి కొనుక్కున్న బట్టలు మళ్లీ వచ్చే పండక్కి పాత బట్టలు అయిపోయి అవి కబోర్డ్ లో అలాగే అడుగున ఉండిపోతాయి. దాన్ని తీసుకుని మళ్లీ కట్టుకునే నాథుడు ఉండడు.  ఆధునిక కాలంలో ప్రతి బెడ్ రూమ్లో పెద్ద పెద్ద కబోర్డ్ లు అది కాకుండా బీరువాలు ఎన్ని ఉన్నా బట్టలు నిండిపోయి ఉంటున్నాయి ప్రతి ఇంట్లో. ప్రతిసారి ఆ ఇల్లాలికి అవన్నీ మడతలు పెట్టి సక్రమంగా కబోర్డ్ లో అమర్చడం ఒక పెద్ద పని.  మా చిన్నతనాల్లో పండగలకి పుట్టినరోజులకి మటుకే బట్టలు కొనుక్కుని వాళ్ళం. ఇప్పుడు అలా కాదు ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కోవడం మోజు తీరేవరకు కట్టుకోవడం అవి చివరికి పాత బట్టలు అయిపోతున్నాయి. నిజానికి ఇది కుటుంబంలో ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టి దగ్గర నుంచి రకరకాల డ్రస్సులు కొంటూ ఉంటారు ఎదిగే పిల్లలు కదా అవి వాళ్లకి రానురాను సరిపోవు. అలాగే ఆడ మగ తారతమ్యం లేకుండా వెలిసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు మన కబోర్డ్ లో ఎన్ని ఉంటాయో ల...

క్యాలండర్

 క్యాలెండర్ ఏ ఇంటిలో చూసిన గోడ మీద అందమైన చిత్రపటాలు లేకపోయినా క్యాలెండర్ మటుకు వేలాడుతూ ఉంటుంది ప్రతి నెలకి ఒక పేజీ కేటాయించి పన్నెండు పేజీలతో ప్రతిరోజు పంచాంగం చూడనవసరం లేకుండా తిధి వార నక్షత్రం వర్జ్యం కరణం యోగం అన్ని ఒకే చోట మనకు చూపిస్తూ మంచి చెడ్డలు చెప్పే క్యాలెండర్ మన దినచర్యలో ఒక ముఖ్యమైన వస్తువు. తిధి వార నక్షత్రాలతో సంబంధం లేదు. మన జీవితాలకు సంబంధించి ఏ ముఖ్యమైన రోజు అయినా అన్నీ తేదీలు తోటే ముడిపడి ఉన్నాయి . పలానా రోజు ఫలానా తేదీ పలానా సంవత్సరం . గవర్నమెంట్ వారు కొలువులో చేరడానికి కొలువు నుండి దిగిపోవడానికి అన్నీ తేదీలే ముఖ్యం .  పెళ్లిరోజు కూడా ఫలానా తేదీ అని చెప్తాం అంతేకానీ పలానా తిధినాడు అని చెప్పం. కేవలం పితృ కార్యాలు, పండగలు మాత్రమే తిధుల ప్రకారం జరుపుకుంటాం.  ఏ శుభకార్యానికి అయినా ముహూర్తాలు అయితే తిథి వార నక్షత్రం తారాబలం చూసి పెట్టుకుంటాం గానీ అంకెలతో కనిపించే ఆ తేదీలు మన జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  దేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగితే తదుపరి అది మన చరిత్ర పేజీలో ఒక ముఖ్యమైన రోజు అవుతుంది.ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 1947 వ సంవత...

ఇదే నా పండుగ

గ్రామీణ జీవితంలో సంత అంటే ఒక జాతర లాంటిది. వారానికి ఒకసారి జరిగే సంతలో కూరగాయలు, వెచ్చాలు కొనుక్కోడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంత జరిగే ప్రదేశానికి వచ్చి, నెత్తి మీద బుట్ట, చేతిలో పదేళ్ల కూతురు కావమ్మని పట్టుకుని నడుచుకుంటూ, సంతలో ప్రతి దుకాణం తిరుగుతోంది యాదమ్మ. ప్రతీ వారం గ్రామంలో ఒక రోజు “సంత రోజు”గా జరుపబడుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒకే చోటకి చేరి కొనుగోళ్ళు చేస్తారు. ఈ సంతలు మానవ మేళాలను పోలి ఉంటాయి — సరికొత్త వస్తువులు, మిత్రుల కలయిక, ప్రజల సందడి, చిన్న చిన్న సంతోషాలు అన్నీ అక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా సంతలో ఉన్న దుకాణాలు ఇవి సమాజ జీవన శైలికి ప్రతిబింబంగా నిలుస్తాయి. సంతలో ఎన్నో రకాల దుకాణాలు కనిపిస్తాయి. కొన్ని స్ధిరంగా ఉంటే, కొన్ని తాత్కాలికమైనవి. ముఖ్యంగా కనిపించే దుకాణాలు: కొత్తగా తీయబడిన దుంపలు, ఆకుకూరలు, మిరపకాయలు, టమోటాలు మొదలైనవి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడుతూ ఉంటాయి. చక్కెర, ఉప్పు, పెప్పర్, నూనె, సబ్బులు, అల్లాలు మొదలైన అవసరమైన దినసరి సరుకులు చిన్న చిన్న పొట్టిదుకాణాల్లో విక్రయిస్తారు. గ్రామీణ శైలిలో వేషధారణకి అనుగుణంగా చీరలు, షర్ట్లు, పంచెలు మ...

అంతిమ ఘడియల్లో నైతిక విజయం

 * అంతిమ ఘడియల్లో నైతిక విజయం" "చనిపోయిన వాళ్లకి ఏం తెలుస్తుంది? కట్టెలతో కాలిస్తే ఏమిటి, కరెంట్ మీద దహనం చేస్తే ఏమిటి? మీ చాదస్తం ఏమిటీ?" — ఇలా అన్నాడు బ్రహ్మయ్య గారి దూరపు బంధువు రాజయ్య. "వద్దు బాబూ... నాన్నకు కరెంట్ అంటే భయం. లైట్ స్విచ్ వేయడానికి కూడా ఎప్పుడూ తడబడేవాడు. అలాంటి మనిషిని కరెంట్ మృతదహనానికి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు..." అన్నాడు పెద్దకొడుకు రమణ, తలవంచుకొని. "మామూలు స్మశానం మన ఇంటికి చాల దూరం. అక్కడికి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ. పెద్దవాళ్ళు రావడం కష్టం. అక్కడ అంతసేపు ఉండలేరు, ఆతిథ్యం ఎలా చూస్తాం?" అంటూ కోపంగా రాజయ్య వాదించాడు. "పర్వాలేదు. రాలేని వారు రాకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులంతా వెళ్తాం," అన్నది సరోజ, బ్రహ్మయ్య గారి పెద్ద కూతురు. "రోజూ యూట్యూబ్‌లో చూస్తున్నాం… ఎవరో తెలియని వ్యక్తిని కూడా అలా బూడిద అయ్యే దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. నాన్న గురించి ఊహించలేకపోతున్నాం అక్కా..." ఆమె మాటల్లోకి బాధ తళతళలాడింది. "నిజమే. చివరకు మిగిలేది బూడిదే. కానీ శాస్త్రం చెప్పిన విధంగా, తలకొరివి కొడుకు చేతి మీద చేయకపోతే...

మరుగున పడ్డ కథ

 మరుగున పడ్డ కథ " ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారైనా కనీసం నాలుగు ప్రోగ్రాములు కుదిరితే బాగుండు ను. కనీసం పండగ రోజుల్లో కూడా ఎవరు మీ ప్రోగ్రాం పెట్టించుకోవడానికి రావడం లేదు. ఇదివరకైతే ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. వినాయక చవితి ,దసరా ఉత్సవాలు, దీపావళికి, కార్తీక మాసం సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ఉత్సవాలంటూ ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. ఏదో శాపం తగిలింది. కనీసం బతిమాలుతున్న ఎవరు ఈ ప్రోగ్రాం పెట్టించుకోవడం లేదు.  ఏమిటో ఈ రోజులు? కాలం మారిపోయింది ప్రాచీనమైన కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ కళనీ నమ్ముకుని బతుకుతున్న మనలాంటి కుటుంబాలకి గడిచేది ఎలాగా? గతంలో ప్రతి ఏడాది మీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఉండేది కదా పల్లిపాలెం వినాయక చవితి ఉత్సవాల్లో ,వాళ్లు పిలవకపోతేనే మీరే ఒక్కసారి వెళ్లి అడిగి వస్తే మంచిది కదా !అవసరం మనది అనీ చెప్పింది పతంజలి శాస్త్రి భార్య సుమతి.  "చూడండి పండగ పూట కనీసం పచ్చడి మెతుకులతోనైనా పిల్లల కడుపు నింపాలి కదా!. ఇంక అంతకంటే మీకు నేను ఏం చెప్పను?. మనం ఏదో సర్ది చెప్పుకుని పడుకుంటాం, పిల్లలు ఎలాగండి ?అని చెప్తున్న భార్య మాటలకి దుఃఖం వచ్...

పాట కాదు_ తల్లి గుండె దీవెన

 *పాట కాదు_ తల్లి గుండె దీవెన* అమ్మ పాడిన లాలి పాటలు, మాటలు, అమ్మ ఆత్మీయత అమ్మతో అనుబంధం ఎన్నిసార్లు గుర్తు చేసుకున్న అది కొత్తగానే ఉంటుంది. అమ్మ మీద వచ్చిన సినిమా పాటలు మనసుని ద్రవింప చేస్తాయి  అయితే ఇటీవల కాలంలో వచ్చిన ఒక సినిమా కుబేరలో అమ్మ తన కొడుకు గురించి పాడిన పాట సాహిత్యం మనసుని హత్తుకుంది. మళ్లీ మళ్లీ ఆ పాట వినాలి అనిపించింది. సాధారణ పదాలతో హృదయాన్ని హత్తుకునేలా రాసిన ఈ పాట మనల్ని మన అమ్మను గుర్తుకు తెచ్చింది.  నేను సినిమా చూడలేదు. కేవలం పాట మాత్రమే విన్నాను. మొదటిసారి పాట విన్నప్పుడే సాహిత్యం నన్ను ఆకట్టుకుంది. ఇందులో అర్థం కాని పెద్దపెద్ద పదాలు ఏమీ లేవు. ఈ సినిమాలో ఈ పాట ఏ సందర్భంలో పాడారో నాకు తెలియదు కానీ నేను కేవలం సాహిత్యం గురించి చెబుతున్నాను  పాటకి పల్లవి చరణం రెండు గుండెకాయలు లాంటివి. "నా కొడుకా "అనే పల్లవి తోటి బిచ్చగాడి పాత్రలో ధనుష్ అనే నటుడు మీద పాడిన పాట.  ఒక కొడుకుకి ధైర్యాన్ని ఇచ్చే పాట. ప్రేమ పంచే పాట. జీవితంలో ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి తెలిపే పాట. అమ్మ ప్రేమ అంతా ఇందులో కనిపించింది. అమ్మ ప్రేమంటే ఏముంది కొడుకు జాగ్రత్తగా ఉండాలని. పద...

నవరసాల కోట

 # నవరసాల కోట. # నవరసాలను పలికించగల సహజ నటుడు చరిత్రలో కలిసిపోయాడు. అతని నటన బదులుగా "నటన ప్రకాశం"గా వెలిగింది. ఎందుకంటే – నటన అనేది నేర్చుకునేదేగా కాదు, అది ఆసక్తి, అదృష్టం, దైవ కృప కలిసి దక్కే వరం. అతని తరంలో నటులు ఒక్కసారిగా వెండి తెరపై ప్రత్యక్షమవలేదు. వారు ముందుగా రంగస్థలంలో సాహసంగా అడుగుపెట్టి, విజృంభించి, ప్రేక్షక హృదయాలను గెలుచుకుని, తరువాతే వెండి తెరపై అడుగుపెట్టారు. రంగస్థలమే వాళ్లకు ప్రాణం – అక్కడి ఒక్క డైలాగ్, ఒక్క అభినయం వాళ్ల నటనా ప్రాణప్రవాహానికి పరిపూర్ణ సంకేతాలు. అందుకే, వీరి నటనలో నాటకశాస్త్రం లేదు, కానీ నయనభిరామమైన అభినయం ఉంది, ప్రకృతిసిద్ధమైన రసాభినయం ఉంది. వెండి తెరమీద అడుగుపెట్టిన తర్వాత ఒక్కొక్క దర్శకుడు పాత్రలో ప్రవేశ పెట్టినప్పుడు ఆ పాత్రకి జీవం పోసిన వాడు మన కోట. ఒకటా రెండా? ఎన్నెన్నో పాత్రలు! వైవిధ్య భరితమైనవి, భావప్రధానమైనవి, ముద్దుగా నవ్వించే హాస్య రసభరితమైనవి, కంపించే రౌద్ర రస ప్రధానమైనవి, కొన్ని మానవత్వాన్ని కదిలించే కారుణ్య పాత్రలు. ఏ పాత్రను చూసినా – అదే పాత్ర ఆయన శరీరంలోకి ప్రవేశించి, మనముందు ప్రత్యక్షమైందనిపించే స్థాయిలో ఉండేది. అతని హావభావా...

గౌతమి గమనం

 గౌతమి గమనం కాకినాడ పోర్ట్ స్టేషన్ వచ్చే పోయే ప్రయాణికులతో హడావుడిగా ఉంది. కాకినాడ పోర్ట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్  బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. గౌతమి అంటే ఒక నది పేరు. ఆ పేరు వింటేనే ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో మన సొంత వస్తువులా కాకినాడ ప్రయాణికులందరి అభిమానం సంపాదించుకుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్‌లో ఎక్కితే హాయిగా కాకినాడలో దింపే ఏకైక ట్రైన్ ఒకప్పుడు ఇదే. మానవుడు జీవితం సక్రమంగా నడవాలంటే కొన్ని నియమాలను చతుర్వేదాలు చెబుతున్నాయి. నా జీవితం సక్రమంగానే నడవాలంటే పట్టాలు దాటి ప్రయాణం చేయకూడదు. నిజంగా నేను మంచిదాన్ని. దూర ప్రాంతాల నుండి బంధువులందరిని తీసుకొచ్చి ఎన్నో వేల కుటుంబాల ఆనందానికి కారణం అవుతున్నాను. నేను రోజు ఎంతోమందిని గమ్యం చేర్చి వాళ్ల కలలు సాకారం చేస్తున్నాను. ఉద్యోగంలో చేరవలసిన తమ్ముణ్ణి, ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన చిన్న తమ్ముడిని, అత్తవారింటికి వెళ్తున్న కూతురిని, ముఖ్యమైన పనులు చేయడానికి పక్క ఊరు వెళ్తున్న బాబాయిలను, ఉద్యోగస్తులను, కూలీలను, వ్యాపారులను ఇలా ఎంతోమందిని ఎక్కించుకొని ఊర్లన్నీ తిప్పుతూ వారి గమ్యం చేరుస్తున్నాను. చిరు వ్యాప...

పలకని మొబైల్

 పలకని మొబైల్ ఉదయం 10:00  గంటలు అయింది  అప్పుడే మార్కెట్లోని షాపులన్నీ తీస్తున్నారు. రోడ్డుమీద ఎక్కువగా జనం లేరు.   ఎప్పటిలాగే శంకరం తన మొబైల్ షాప్ తలుపు తీస్తున్నాడు. మొబైల్ అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా చేస్తుంటాడు శంకరం షాప్ అంతా శుభ్రం చేసి సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు.  ఎక్కడ చూసిన మొబైల్ కనపడుతున్నాయి. మొబైల్ కూడా నిత్యవసర వస్తువుల తయారైంది.  రోజు రిపేర్ కోసం అని,  మొబైల్ లు కొత్తవి తీసుకోవడానికి జనం వచ్చి పోతుంటారు.  మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొంతమంది  పాతవి అమ్మేస్తుంటారు.  నిత్యజీవితంలో మొబైల్ అవసరం ఎంత బాగా పెరిగిపోయింది అంటే  అది లేకుండా జీవితం గడపడం కష్టం అయిపోయింది.  మనిషిలా తోడుగా ఉంటుంది. కబుర్లు మోసుకొస్తుంది. మనసుకు ఆనందపరుస్తుంది. అలాంటిది మొబైల్ ఒక రోజు పని చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. అలాగే ఉంది పరమేశ్వర రావు పరిస్థితి. అప్పుడే నెల రోజుల నుంచి మొబైల్ ఉలుకు పలుకు లేదు . అసలు రింగ్  రావట్లేదు.  ఏం పాడయిందో ఏమిటో! పోనీ రిపేర్ కి తీసుకెళ్దాం అంటే ఈ ఆశ్రమం నుంచి రిపేర్ షాప్ నాలుగు క...

రహస్యం

సాయంకాలం నాలుగు గంటలు అయ్యింది. కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు, కేకలు, గోలలు, ఈలలతో సందడిగా ఉంది. ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా, బొద్దుగా ఉన్న మూడేళ్ల వయస్సు ఉన్న కుర్రాడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్‌కు అర్థమైంది. ఆ చూపు రాకేష్‌కి ఏమీ కొత్త కాదు. పార్కుకి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం, ఆ పిల్లవాడి వైపు భార్య రమ ఆశగా చూడడం, లేదంటే ఎత్తుకొని ముద్దాడడం, చివరకి రమ రాకేష్‌ వైపు ఆశగా చూడడం ప్రతిసారి జరుగుతున్నదే. రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది. ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. "అవును! మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు" అనుకుని రమ నిట్టూర్చి, "ఇంటికి వెళదామా?" అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది. అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయ...

గురువు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి – గురు పౌర్ణమి. వ్యాస మహర్షి జన్మదినం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. నాలుగు వేదాలను లోకానికి అందజేసిన వారు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను ఆయనే రచించారు. మానవ జీవితం నడవడికకు ఇవే ప్రమాణాలు. అయితే నిత్య జీవితంలో, అంటే బాల్యం నుంచి అనేకమంది వ్యక్తులు మనకు మంచి మాటలు చెప్పి, మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేవారు ఉంటారు. వారందరూ కూడా మనకు గురువులే. మొట్టమొదటి గురువు తల్లి. మంచి చెడ్డలు నేర్పేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి వ్యక్తి మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. పిల్లలకు తల్లి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే భయం. చిరు ప్రాయంలోనే తల్లి నీతి కథలు, రామాయణ మహాభారత కథలు చెబుతుంది. ఆ వయసులో తప్పుడు పనులు చేయకూడదని అర్థమవుతుంది. మనకు జ్ఞానం వచ్చే వరకు మన నడవడికను తీర్చిదిద్దేది తల్లే. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కూడా తల్లి దగ్గర నుంచే తెలుసుకుంటాము. కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాల చేరినప్పుడు ఓనమాలు దగ్గరుండి దిద్దించి, భవిష్యత్తుకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అక్షరాన్ని కనుక మనం నేర్చుకోకపోతే, ఎవరు బ్రతుకు బ...

వ్యాసుడు

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌   🕉️ పరిచయం: వ్యాసుడు అనే పదానికి అర్థం "విభజించేవాడు" అని. ఆయన పేరు వేదవ్యాసుడు – ఎందుకంటే ఆయనే వేదాలను నాలుగు భాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం) విభజించిన మహర్షి. ఇతడు భారతదేశ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన ఋషులలో ఒకడు. ఇతడే మహాభారత రచయిత, 18 పురాణాల కర్త, భాగవత పురాణం వ్యాసకర్త కూడా 🌸 జన్మకథ వ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు. ఒకసారి పరాశరుడు యాత్రలో గంగానదిలో పడవపై ప్రయాణిస్తున్నాడు. అక్కడ సత్యవతి అనే పడవతీసే యువతి ఉండేది. ఆమె వాసన దుర్గంధంగా ఉండేది, కానీ పరాశరుడు ఆమెను ఆశీర్వదించి పరిమళముతో కూడిన శుభరూపిణిగా మార్చాడు. తర్వాత ఆమెతో కలిసి, ద్వీపంలో ఆమెకో పుత్రుడు జన్మించాడు – అతడే వ్యాసుడు. ఎందుకంటే ఆయన ద్వీపంలో జన్మించాడు కనుక ఆయనను "కృష్ణ ద్వైపాయన" అని కూడా అంటారు – కృష్ణవర్ణుడు అయిన ద్వీపజ. వ్యాసుడు జన్మించిన వెంటనే పెద్దవాడయ్యాడు – తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది మహర్షుల విశేష స్వభావం 📚 వ్యాసుడు చేసిన మహోన్నత కార్యాలు 1. వేదాల విభజన ప్రజలు వేదాలు నేర్చుకోవడం కష్టంగా మారినప...