పోస్ట్‌లు

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...

పుట్టిన ఊరు _ మధురస్మృతులు

పుట్టిన ఊరు అంటే అందరికీ ఇష్టమే. ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, బాల్యంలో మధురమైన అనుభూతులు మిగిల్చిన ఆ గ్రామం మాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. గ్రామం గురించి చెప్పుకోవాలంటే చుట్టూ అందమైన పొలాలు, మామిడి తోటలు, పిల్ల కాలువలు, పెద్ద కాలువలు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి, అగ్రహారంలో వ్యాసేశ్వర స్వామి గుడి, గోపాల స్వామి గుడి. ఊరి లోపలికి వెళ్తే రామాలయాలు—ఇవన్నీ చల్లగా దర్శించగలిగే దేవాలయాలు. మా పల్లిపాలెం గ్రామంలో ఒక పంచాయతీ కార్యాలయం, అప్పర్ ప్రైమరీ స్కూలు, కచేరి సావిడి ఇవి ముఖ్యమైన ప్రదేశాలు. కొన్నిచోట్ల కంకర రోడ్లు, మరికొన్ని చోట్ల అవి కూడా లేవు. వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పక్కర్లేదు. చిన్ననాటి వినోదం అప్పట్లో రేడియో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. అది కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే ఉండేది. మరి మిగిలిన వాళ్లు రెండు కిలోమీటర్లు నడిచి టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమా చూసి ముచ్చట తీర్చుకునేవారు. అలాంటి ఊర్లో ఏడాదికోసారి జరిగే తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరికీ పెద్ద వినోదం. రెండు రోజులు ముందుగా పెద్ద పందిరి కట్టి, గ్రామఫోన్ రికార్డులు, మైక్ సెట్ పెట్టేవారు తొలిరోజు సాయంకాలం ఘంటసాల గారి “నమో ...

భాధ్యత

ఉదయం 5 గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్ టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో. ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ. "కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్ సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు" అని అనుకుంది కాంతమ్మ. అయినా, ఎప్పుడూ ఈ కేర్ టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా, అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ, రాజేష్ కి విషయం చేద్దాం అంటే వాడు ఫోన్ తీయట్లేదు.  ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే, "అమ్మ" అనే సంగతి మర్చిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాద...