రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర
గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి. ఆంధ్ర మహాభారతo పుట్టిన  ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి  నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది. ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.   ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి  వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే  స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది  . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట.   బ్రిటిష్ వారు  మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయ...