పోస్ట్‌లు

భగినీ హస్త భోజనం

“తమ్ముడు, ఎల్లుండి తప్పకుండా భోజనానికి రా” అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగానే దీపావళి నాడు పక్క ఊర్లో ఉన్న మా అక్క. ఆరోజు భగినీ హస్త భోజనం. అందుకే మా అక్క ఆహ్వానం. ఉదయం లేచి ఫస్ట్ బస్సులో ఆ ఊరు బయలుదేరాను. మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ, ఆడుతూ, పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాము. నేను ఇంటర్మీడియట్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్క పదవ తరగతి తోటే చదువు ఆపేసింది. మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ ఊర్లోనే కాపురం. బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది. అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది. దాని పరిస్థితి చూసి ఏదైనా సహాయం చేద్దాం అంటే ఎంతో మొహమాటం. ఒక చిన్న మాట కూడా తన సంసారం గురించి చెప్పదు. తన లేనితనం గురించి అసలు చెప్పదు. బావగారు బాగా చూసుకుంటున్నారని అంటుంది. ఎప్పుడూ ఆ మూడు గదుల కొంపలోనే కాపురం. ఇంట్లో కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి. ఇద్దరు పిల్లలు చదువులు. ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో! పెద్దయ్యాక ఎవరి జీవితాలు వాళ్ళవే. చిన్నప్పుడు ఎంత ...

తస్మాత్! ఆరోగ్యం జాగ్రత్త

ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి ఆ శక్తి తినే ఆహారం నుంచి పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు — ఇవన్నీ శరీరానికి కావలసిన రక్షణను, శక్తిని ఇస్తాయి. శాఖాహారులు బియ్యం, ఆకులు, పండ్లు, కాయలు, గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థం తినడం, వేళకు తినడం వంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పినా ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది. పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు. అది మడి కాదు, ఆచారం కాదు — ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచి తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో వారికే వదిలేయాలి....

జీవితం

 నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ ...