చీకటి
చీకటి
చీకటి అంటే ఎవరికైనా భయమే.
బ్రతుకులో వెలుగును కోరుకుంటారు అందరూ
మరి కొందరు చీకటినే కోరుకుంటారు.
చీకటి చిమ్మే రాత్రి వారికే ఎందుకు ప్రత్యేకo.
వారి బ్రతుకుకు వెలుగు దొరికేది రాత్రిపూటే.
జీవన గమనం సాగాలంటే చీకటి పడాల్సిందే.
అందరూ దేవుడు సృష్టించిన బొమ్మలే.
కొందరి తలరాత బ్రహ్మకే అర్థం కాదు.
నిశి రాత్రి లో నల్లటి రహదారి పక్కన
గాజుల సవ్వడి ,మల్లెల వాసన
ఆ సంకేతం కావాల్సిన వారికి అర్థమైంది.
బ్రతుకులో ఎన్ని చీకట్లు ఉన్నాయో
మదిని దోచే ఎన్ని బాధలు ఉన్నాయో
గుండెలో ఎన్ని మంటలు ఉన్నాయో.
చీకటే బ్రతుకుకి చూపించింది ఆధారం
బాధ్యత బలవంతంగా ముందుకు తోసింది.
ఒళ్ళు అమ్ముకునేలా చేసింది ఒకరిని.
ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం పరిగెత్తించి
కన్ను పడిన దాన్ని కనపడకుండా చేసి
చీకట్లో బ్రతుకు యానం సాగించేది మరొకరు.
పగటిపూట దొరబాబుల వెలిగిపోతుంటాడు.
కారు చీకట్లో కావాల్సిన దాన్ని చేజిక్కించుకుంటాడు.
చీకటే వారి బ్రతుకుకి ఊపిరి.
వీధి వీధి తిరిగి నిశి రాత్రంతా జాగరణ చేసి
చిమ్మ చీకటిలో మన సొమ్ముకి కాపు కాసి
మనo సొమ్మసిల్లి నిద్రపోయేలా చేసి
నెలాఖరులో సలాము చేసే పరదేశి .
పేరు తెలియదు ఊరు పేరు తెలియదు
ముద్దుగా జాతి పేరు తో చెలామణి.
చీకటే అతని బ్రతుకులో వెలుగు.
పాపం చీకటి మంచిదే.
నల్లగా ఉండి నలుగురికి బ్రతికే దారి చూపించింది
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి