పొట్టి పెసరట్టు
కాకినాడ పనిమీద వచ్చిన వాళ్ళు తెల్లవార గానే ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరూ ఉండరు. ఇంతకీ ఆ ప్రాంతం ఏమిటి? ఆ ప్రదేశం పేరు దేవాలయం వీధి. దేవాలయాలన్నీ ఒకే చోట ఉండడం వలన ఆ పేరు వచ్చింది.
అయితే ఈ ప్రదేశంలో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కాకినాడ పొట్టి పెసరట్టు. తెల్లవారింది అంటే చాలు అక్కడ జనం పొట్టి పెసరట్టు నిలబడి తింటూ ఉంటారు. ఇది ఇంచుమించుగా అరవై సంవత్సరములు పైగా ఇదే వ్యాపారం ఇక్కడ జరుగుతోంది. ఇదేమీ ఫైవ్ స్టార్ హోటల్ కాదు. ఒక చిన్న రోడ్డుపక్క షాపులో జరిగే వ్యాపారం. రుచి అమోఘం. కాకినాడకు వన్నెతెచ్చిన వంటకాలలో ఈ పొట్టి పెసరట్టు ఒకటి.
ఉదయం పూట పొట్టి పెసరట్టు, మధ్యాహ్నం సుబ్బయ్య గారి భోజనం , మధ్యలో కోటయ్య గారి కాజా రుచి చూడకుండా ఎవరు వెళ్లరు. మీరు రుచి చూడండి పొట్టి పెసరట్టు. ఆకారం చిన్నది. రుచి పెద్దది. తినడం మొదలుపెడితే మారు అడగకుండా ఉండేది. మళ్లీ మళ్లీ తినాలనిపించేది. కాకినాడ పొట్టి పెసరట్టు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి