పోస్ట్‌లు

ఇది ఏమి ఉప్మా చెప్మా!

ఇది ఏమి ఉప్మా చెప్మా!  ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికే...

గుండెల్లో నిలిచిన వైద్యుడు

గుండెల్లో నిలిచిన వైద్యుడు  ప్రతిరోజు ఎంతోమంది రోగుల గుండెలకి స్వాంతన చేకూర్చే డాక్టర్ రామారావు కి ఆరోజు గుండెల్లో చాలా గుబులుగా ఉంది. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా జూనియర్ డాక్టర్లతో కలిసిమెలిసి పని చేస్తూ గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ రామారావు మనసు అదోలా ఉంది. నాలుగు దశాబ్దాల పాటు గవర్నమెంట్ డాక్టర్ గా సేవలందించిన రామారావు కి ఆ రోజుతో ఆసుపత్రితో అనుబంధం తెగిపోతోంది డాక్టర్ రామారావు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ గా ఆ మండలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వృత్తిపరంగా ఎన్నో సమస్యలున్న తన తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటూ కాలక్షేపం చేశాడు ఇన్ని రోజులు. ఎప్పటిలాగే సాయంకాలం ఆరోజు కూడా ఐదు గంటలు అయింది . పదవి విరమణ సభ మొదలైంది. ఒక్కొక్కరే లేచి డాక్టర్ గారితో తన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు.  ఇంతలో చివర వరుసలో కూర్చున్న ఒక జూనియర్ డాక్టర్ లేచి మైక్ తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. నా పేరు రవి ప్రకాష్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి నెలరోజులు అయింది. అయితే డాక్టర్ గారితో పని చేసిన అనుభవం కంటే ఒక పేషెంట్ కొడుకుగా నా అనుభవం ఎక్కువ...

కాఫీ తాగారా

కాఫీ తాగారా!  " దిక్కుమాలిన అలవాటయింది! ఇలా మొహం కడుక్కుంటున్నారో లేదో అలా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చిందులు తొక్కుతారు అంటూ ప్రతిరోజులాగే దండకం చదివి కాఫీ కప్పు అక్కడ పెట్టింది మా శ్రీమతి రాజ్యలక్ష్మి. కాఫీ రుచి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ కాఫీ తాగదు. 'కప్పు కాదండి పెద్ద స్టీల్ గ్లాస్. ఆ గ్లాస్ తో కాఫీ తాగకపోతే కాఫీ తాగినట్టు ఉండదు. ఇంకా నయం మా తాతగారు ఒకాయన పెద్ద చెంబుతో కాఫీ తాగేవాడుట. అయితే మేము మటుకు తక్కువేముంది . ఒక్కసారి తాగే బదులు నాలుగు సార్లు తాగుతున్నాం.  ఇంట్లో ఉంటే ఏ బెంగ ఉండదు. ఎన్ని తిట్లు తిట్టినా వేళకు  కాఫీ వచ్చి పడిపోతుంది. మరి ఎక్కడికైనా వెళ్తే మనకా ఉదయం లేచి కాఫీ తాగడం అలవాటు. అవతల వాళ్ళు లేస్తారా! లేచిన వెంటనే కాఫీ ఇస్తారా! అనేది ఒక పెద్ద బెంగ. సరే పెళ్లిళ్లకి ఫంక్షన్లకి వెళితే ఆ కాఫీ తాగితే ఏడుపొస్తుంది . డోసు తక్కువ  రుచి నేను వర్ణిస్తే బాగుండదు. మా చిన్నతనంలో పొయ్యి మీద కాచిన కాఫీ ఎంత రుచికరంగా ఉండేది. ఇప్పుడు కాఫీ మేకర్లు వచ్చేసి పని సులువు అయింది గానీ సరుకు రుచి మరి ఏమో!  ఉదయం లేచిన దగ్గర్నుంచి మామూలుగ...