పోస్ట్‌లు

భగీరథ ప్రయత్నం

భగీరథ ప్రయత్నం. "ఏమమ్మా సీతమ్మ మీ వాడికి ఇంకా సంబంధం చూడడం లేదా!  అని అడిగింది పక్కింటి కాంతమ్మ.  లేదమ్మా! మా వాడు అప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడు! అంది సీతమ్మ. కాంతమ్మకు తెలుసు సీతమ్మ కొడుకుకి సంబంధాలు ఎక్కడా కుదరట్లేదు అని. సీతమ్మకు ఒక్కడే కొడుకు. పేరు ప్రవీణ్. ఆరడుగుల అందగాడు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లయింది. క్యాంపస్ సెలక్షన్ అని ఎగిరి గంతేసుకుని జాయిన్ అయిపోయాడు పాపం. ప్రవీణ్ ని పెళ్లి చేసుకోమంటే జీతం నా ఒక్కడికే చాలటం లేదు అని వాయిదాలు వేసినా సీతమ్మ తన ప్రయత్నాలన్నీ గట్టిగా చేస్తూనే ఉంది.  ప్రవీణ్ ఉద్యోగంలో చేరగానే ముందుగా ఒకరోజు స్టూడియోకి తీసుకెళ్లి అందమైన ఫోటో తీయించి వివాహ వేదికలో ఫీజులు కట్టేసి ప్రవీణ్ వివరాలను నమోదు చేసేసింది. ఇంకేముంది రోజుకో ఫోన్. పిల్ల తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తూ ఆఖరికి ప్యాకేజీ దగ్గరకు వచ్చేటప్పటికి నీరు కారిపోయి ఫోన్ పెట్టేసి మళ్లీ ఏ కబురు ఉండేది కాదు వాళ్ల దగ్గర నుంచి. చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత సీతమ్మ మళ్లీ ఫోన్ చేస్తే అబ్బాయి జాతకం నచ్చలేదండి! అని మొహ...

కొత్త జీవితానికి కొత్త దారి

" కొత్త జీవితానికి కొత్త దారి" " హమ్మయ్య నాకు ఇవాళ తోటి అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఇంక నేను రేపటి నుంచి స్వేచ్ఛ జీవిని. ఒకరు గురించి భయపడక్కర్లేదు. ఒకరి గురించి ఆలోచించక్కర్లేదు అని అంటూ నాలిక కరుచుకున్నాడు రాఘవరావు. తప్పు మాట నేను బ్రతికున్నంత కాలం నీ బాధ్యత నాదే. అలాగే నా మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీది అంటూ అలా వసంతతో చెప్తూ విశ్రాంతిగా పడక కుర్చీలో పడుకున్నాడు రాఘవరావు.  రాఘవరావు ఒక ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రెక్కలొచ్చిన పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి ఇద్దరు మనవళ్ళకి తాతయ్యేడు రాఘవరావు. అమెరికా చూపిస్తానని కొడుకు ఆనంద్, ఆస్ట్రేలియా చూపిస్తానని కూతురు డాక్టర్ సునంద బ్రతిమాలిన ఇల్లు కదల్లేదు రాఘవరావు. రిటైర్ అయిన దగ్గర్నుంచి భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ గుడి గోపురం అంటూ తిరుగుతూ భార్యకి వంటింట్లో సహాయకారిగా ఉంటూ ఆదర్శవంతమైన రిటైర్డ్ ఉద్యోగి లాగ ఉండేవాడు రాఘవరావు.   పిల్లల మీద ప్రేమ లేక కాదు గాని వారు ఫోన్ చేసినప్పుడే వాళ్లతో మాట్లాడటం మామూలుగా ఖాళీగా ఉన్నాం కదా అని ఆస్తమాను ఫోన...

మట్టిలో మాణిక్యం

మట్టిలో మాణిక్యం మధ్యాహ్నం మూడు గంటలు అయింది   ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ సభా ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ముఖ్య అతిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు . "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి అని చెప్పి ఒక్కసారి బ్యానర్ కేసి చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అదేమిటి ? ముఖ్యఅతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి? అని అడిగింది. " లేదు మేడం కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళ గానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ.  ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి ఆరోజు ముఖ్య అతిథి. ఇంతకీ జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.  సరే అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం వేదిక మీదకి ఆహ్వానించడం అలాగే ఆరోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్క న కూర్చోబెట్టడం జరిగింది.  అతి సామాన్యమైన దుస్తులతో ఏవి అలంకరణలు లేకుండా కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీ ని కలెక్టర్ గారి పక్కన కూర్చోవడం జరిగింది. ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమె కేసి...