పోస్ట్‌లు

కలలో కళ్యాణం

కలలో కళ్యాణం  అబ్బా ! ఎంత బాగుంది ఈ శుభలేఖ. అయినా ఈ శుభలేఖ ఎవ్వరూ పంపించారు అనుకుని  చూసేసరికి మిథిలా నగరం నుంచి వచ్చినట్లు కనబడుతోంది. అలకాపురి లో చుట్టాలున్నారు గాని మిథిలాపురిలో ఎవరున్నారు అబ్బా ! అనుకుని వరుడు పేరు చూసేసరికి రాములోరి పెళ్లికి ఊరంతా పెద్దలే కదా అనుకుని బయలుదేరా బాల రాముడిని చూడొచ్చని ముచ్చట పడ్డాను.వధువు ఇంకెవరు మా సీతమ్మ తల్లి కదా!  పర స్త్రీని కూడా కన్నెత్తి చూడని మహా పురుషుడు రాముడు. ఏకపత్నివ్రతుడు. అయినా పుట్టినరోజు నాడే కళ్యాణం జరిగే అదృష్టం ఈ లోకంలో ఎంత మందికి ఉంటుంది. రామచంద్ర మూర్తి లాంటి మహనీయులకు తప్పితే. ప్రతి ఏట కళ్యాణం దేవుళ్ళకే మనలాంటి వాళ్ళు చేసుకుంటే కారాగారానికే. అబ్బా దేవుడి పెళ్లి శుభలేఖ అందుకున్నాను. తప్పకుండా వెళ్లాలి . మియాపూర్ అడ్రస్ తెలుసు కానీ మిథిలాపురి నాకు తెలియదు.  కళ్యాణం చూసే అదృష్టం ఉంటే దేవుడే అక్కడకి తీసుకెళ్లి పోతాడు. అందుకనే సంకల్పం మనది నెరవేర్చేవాడు ఆ మహానుభావుడు.  భూదేవి అంత కల్యాణ వేదిక మీద వధూవరులు, కన్యాదాతలు  ఆకాశమంత పందిరిలో ఆహ్వానితులందరూ సింహాసనములను అధిష్టించి అతిధి మర్యాదలు పొందుతూ ఉండగా ...

సీతారాముల కళ్యాణం ఒక జీవన గుణపాఠం

సీతారాముల కళ్యాణం _ ఒక జీవన గుణపాఠం. పెళ్లి… జీవితంలో మధురమైన ఘట్టం. ఇది రెండు మనసుల అనుబంధానికి ప్రతీక. కానీ కాలానుగుణంగా ఈ బంధానికి అర్థం మారిపోతూ వస్తోంది. పెళ్లిని ఒక వేడుకగా, ప్రదర్శనగా చూస్తున్నామే గానీ, దాని అంతరార్థాన్ని గుర్తించడం తగ్గిపోతోంది.  ఈ సందర్భంలో సీతారాముల వివాహం మనకు ఎంతో విలువైన పాఠాలు నేర్పుతుంది. "జానక్యా: కమలామలాంజలి పుటే యా: పద్మరాగాయితా:" ఈ శ్లోకం లేకుండా వివాహ ఆహ్వాన పత్రిక పూర్తి కాదనిపించేంతటి మహత్యం దీని సొంతం. ఇది సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల ఘట్టాన్ని వర్ణించే అద్భుత కవిత్వం. సీతమ్మ వడిలో మెరిసిపోయే ముత్యాల తలంబ్రాలు ఎర్రని పద్మరాగ మణుల్లా, రాముడి తలపై మల్లెపూల్లా, ఆయన నీలమేఘ శ్యామ శరీరంపై ఇంద్రనీలాలా జాలువారినట్లు ఈ శ్లోకంలో వర్ణించబడింది. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఒక మనోహర దృశ్యం! పెళ్లిలో తలంబ్రాల ఘట్టం ఎంతో మధురం. పెళ్లికూతురు లజ్జతో తలవంచుకొని వరుడిపై తలంబ్రాలు పోయే దృశ్యం హృదయాన్ని హత్తుకునే అనుభూతి. కానీ ఈ ఘట్టం వెనుక ఉన్న అర్థాన్ని కొందరు మాత్రమే గుర్తించగలరు. అంతరార్థంగా చూస్తే, తెల్లని ముత్యాలు చంద్రునికి ప్రీతికరమైనవి. ఆనాటి ఋషులు, ...

కుండ

కుండ మట్టిలో పుట్టిన మాణిక్యం  నరుడికి వేసవి తాపం తీర్చే అమృతభాండం రంగు నల్ల బంగారం  గుండె శీతలయంత్రం  తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితం  చెయ్యి జారితే ముక్కలయ్యే కుంభం  సప్తస్వరములు పలికిస్తే అది ఘటం  నోరూరించే ఊరగాయకి అదే ఆధారం సాదరంగా ఆహ్వానించేది పూర్ణకుంభం  కడవరకు సాగనంపే ఆత్మీయ భాండం  జోరుగా కురిసే వర్షం కుండ పోత  మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే  వట్టి మట్టి పూత. కాకి బావకు దాహం తీర్చే సన్న మూతి కూజా వేసవి వచ్చిందంటే గొంతును చల్లబరిచే తర్బూజ.  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279