పోస్ట్‌లు

బాలు

బాలు ప్రతి పాటకు అర్థం  ఆ పాట సందర్భం మీద వ్యాఖ్యానం.  ఆ రాగంలో చేసిన పాటలు.  ఆ స్వర బ్రహ్మలకు జేజేలు పాటల బ్రహ్మకు ప్రణామాలు. గళమెత్తి పాడే చిన్నారులకు అపురూపమైన సూచనలు అనంతమైన ఆశీర్వచనాలు పదుగురు మెచ్చిన ప్రోత్సాహకాలు వెరసి పాడుతా తీయగా కార్యక్రమం. రథసారథి బాలసుబ్రమణ్యం. ఇంటి పేరు లోనే ఉంది పండిత శబ్దo. ముద్దు పేరు బాలు.  ముద్దుముద్దుగా మాటలు పలుకు. భాష అంటే అభిమానం సాహిత్యం అంటే మక్కువ పాట అర్థం చేసుకుని ఆలపించడం అదే ఆయన ప్రగతికి సోపానం. కోదండపాణి గారి ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం. ఒకటారెండా 40 వేల పాటలు. ఏ భాషలో అయినా ఆయన గొంతు వీరంగం. అవార్డులన్నీ ఆయన మెడలో హారం. నందులన్ని బాలు గారి ఇంట్లో నివాసం శత స్కోప్ లేని డాక్టర్ బాలు బయోస్కోప్ తెచ్చింది డాక్టరేట్. పద్మశ్రీ, పద్మభూషణ్ తో సత్కారం మరణానంతరం పద్మ విభూషణతో అలంకారం. పాటలతోనే కాదు మాటలతో కూడా  మురిపించింది ఆయన గొంతు. చక్రవర్తి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో  డబ్బింగ్ కళాకారుడు గా అవతారం. ఆయన ప్రతిభకు దశావతారం సినిమా  ఒక మచ్చుతునక. మిధునం సినిమాలో అప్పదాసు పాత్ర నటనా కౌశల్యానికి మచ్చుతునక. ఒకసారి కాదు...

నడిచే దేవుడు

నడిచే దేవుడు ఉదయం 11 గంటలు అయింది  బ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ఇంత మారుమూల గ్రామంలో కూడా బ్యాంకు పెట్టారా! అని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. ఖాతాదారులు ఎవరు బయట నుంచి రారు. అంతా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేవాళ్లే. అయితే ఆ గ్రామం ఆర్థికంగా చాలా బలమైన గ్రామం ఆ జిల్లాలో.  ప్రభుత్వం వారి పథకాలకి అనుగుణంగా బ్యాంకులు కూడా అతి సామాన్యులకు కూడా ఖాతాలు ఇవ్వడంతో దేశంలో ఏ బ్యాంకుకైనా విపరీతమైన రద్దీ పెరిగింది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు మహిళలతో బ్యాంకులో ఏవి ఖాళీ ఉండటం లేదు. అలాగే ఆ ఊరు బ్యాంకు కూడా.  ఇంతలో ఒక తెల్ల లుంగీ పంచి పట్టుకుని పైన షర్టు వేసుకొని నుదురుతున్న బొట్టు పెట్టుకుని చేతిలో బ్యాంకు పాసుబుక్ పట్టుకుని హడావుడిగా వచ్చిన వ్యక్తిని తన గదిలోంచి సీట్లో కూర్చున్న మేనేజర్ రాఘవరావు సబ్ స్టాఫ్ ను పిలిచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకురమ్మన్నాడు. ఇంతలో ఎదురు గుండా కూర్చున్న అంతే వయసు గల వ్యక్తి అదే బ్రాంచ్ కి కొత్తగా మేనేజర్ గా ఛార్జ్ తీసుకుంటున్న రామారావు   " ఎవరండీ ఆయన అని అడిగాడు రాఘవరావుని. మ...

రామ చిలుక

రామ చిలుక  పేరులో రామ శబ్దం  రంగు చూస్తే హరిత వర్ణం ముక్కు చూస్తే మిరప పండు  కుత్తుక చుట్టూ రాముడి రంగు.  నువ్వంటే మాకు ప్రాణం.  మా ప్రాణం నీలాగే ఎగిరిపోతుందని తెలియని అమాయకులం.  రామదాసు చరిత్ర తెలిసిన నిన్ను బోనులోనే బంధిస్తున్నాం. పక్షివని తెలిసినా మా భవిష్యత్తు చెప్పమని పైసలిస్తున్నాం. అందరికీ జాతకం చెప్పే  నువ్వు బోను లో ఎందుకు బందీ అవుతావు  తుర్రుమని ఎగిరిపోయి ఉండే దానివి కదా  నీ తలరాత అలా ఉంది  మా రాతని నువ్వు ఎలా చెప్పగలవు.  ఎప్పుడూ నువ్వు చెట్ల మీద ఉంటేనే అందం.  చిలకకొట్టిన జామపండు మాకు  ఎప్పుడు అది అమృతతుల్యమే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279