పోస్ట్‌లు

బరువు

కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత. ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

మాజీ కార్మికులు

మాజీ కార్మికులం. మనం కార్మికులం  జనం మర్చిపోయిన మాజీ కార్మికులo ఒకప్పుడు దేశ ప్రగతిలో  మనము భాగస్వామ్యులం  ప్రజా సేవలో మనం  అతి ముఖ్యమైన ఆర్థిక రంగం కార్మికులo. మారే ప్రభుత్వాల ఆశయాలకి  ఓట్ల కోసం తెచ్చే పథకాల అమలుకి  మనం బలి పశువులo. సబ్సిడీ రుణాలు సంతోషంగా ఇచ్చాం  వసూలు కి కాళ్లు అరిగేలా తిరిగాo  పెద్ద నోట్లను మడిచి లోపల పెట్టాం.   కరోనాకాలంలో కష్టమనిపించిన   బ్యాంకు తలుపులు తెరిచే ఉంచాo. దొంగల తో పాటు కరోనా కూడా  మన అతిధిలా వస్తే సేవ చేసి ప్రాణాలు కోల్పోయాం. వేల కోట్లు మాఫీ చేశాం  అవమానాలు ఎదుర్కొన్నాం  ఎదురు దెబ్బలు తిన్నాం  చేయని తప్పుకు చెప్పు దెబ్బలు తిన్నాం.  శిక్షలు అనుభవించాం.  అందరూ వైట్ కలర్ జాబ్ అంటారు  అది నైట్ వరకు సాగే బ్యాంకు జాబు లెక్కల లోనే పని వేళలు  లెక్కకు రాని వేళలు ఎన్నో   వారాంతపు సెలవులలో కూడా బ్యాంక్ వాకిట్లోనే.  భార్య పిల్లల ఎంజాయ్ మెంట్ నట్టింట్లోనే.    కరోనా వచ్చినా లాక్ డౌన్ పెట్టినా   మన కార్యాలయం ఎప్పుడు కళ కళే.   అంతా ...

ఆర్థిక శాస్త్రవేత్త

ఆర్థిక శాస్త్రవేత్త ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు తలుపు తీసిన చప్పుడైతే ఎవరు అంటూ గట్టిగా అరిచేది. ఆ హాల్ అంతా చిన్న పోయింది. ఇప్పుడేమో ఇలా! వీధిలో చాప మీద పడుకుంటే ఏదోలా ఉంది.అప్పుడే ఆఖరి శ్వాస విడిచి మూడు గంటలు అయింది .  నిన్నటి వరకు మన మధ్య ఉన్న ఈమె ఇవాళ శవమై వాకిట్లో పడుకుంది అనుకుని బాధపడుతూ కూర్చున్నాడు చనిపోయిన సీతమ్మ గారి మనవడు రఘురాం. సీతమ్మ గారికి నలుగురు ఆడపిల్లలే. మగ పిల్లలు లేరు. అందుకే పెద్ద కూతురు కొడుకుని దత్తత చేసుకుని బంధువుల అమ్మాయిని సరళని ఇచ్చి పెళ్లి చేసింది. రఘురాం ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తుంటాడు. తాతగారు ఇంట్లోనే కాపురం ఉంటాడు. మళ్లీ రఘురాం కూడా అందరూ నలుగురు ఆడపిల్లలే.  సీతమ్మ గారు ఆడపిల్లలు భర్తలు పిల్లలతో కలిసి వచ్చారు. బంధువులు స్నేహితులు ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభించారు . ఒకపక్క అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతలో సీతమ్మ గారి బంధువు ఒకరు రఘును పిలిచి ఇంకా ఎంతసేపు ! దూరం తీసుకెళ్లాలి కదా! ఆలస్యం అయిపోతుంది రఘుని తొందర పెట్టాడు. రఘు స్...