పోస్ట్‌లు

నేను నటుడ్ని

 "నేను నటుడ్ని" చిన్నప్పుడు అందరూ నేర్చుకున్నవి అవే తెలుగు అక్షరాలు. కానీ కొంతమంది ఆ అక్షరాలు తోటే అనేక పదాలు  ఆ పదాలతోటి అందమైన భావం వచ్చే పాటలు రాయడం వాళ్లకి అందమైన కళ. కొన్ని పాటలు వింటుంటే సినిమాలోని ఆ పాత్రలు మన ముందున్నట్లు ఉంటుంది. ఆ రచయిత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు రాసినట్లు ఉంటుంది. అది అమ్మవారి అనుగ్రహం.   పాట రాయడం అంటే ఆషామాషీ విషయం కాదు. తెలుగు భాష మీద మంచి పట్టు ఉండాలి. పదం గుర్తుకు రావాలి. సందర్భానికి సన్నివేశానికి ఆ పాట సరిపోయేటట్టు రాయాలి. పాటలు రాయడానికి ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు ఏవి ఉండవు. దైవ అనుగ్రహం తప్పితే.  ఒక మంచి పాట రావాలంటే మంచి సన్నివేశాలు ఉన్న సినిమా ఉండాలి. అంటే సినిమాలో మంచి కథ ఉండాలి. కథను బట్టి సన్నివేశం. సన్నివేశానికి అనుగుణంగా మంచి పాట పుడుతుంది.  ఈ సినిమా కథ అంతా ఒక రంగస్థలం నటుడు జీవితం మీద నడుస్తుంది . ఆ రంగస్థల నటుడు తనలో తాను పాడుకునే పాట ఇది .  రంగస్థలం నటుడు జీవితమంతా ఇందులో ఉంది. వేదిక ఎక్కిన రంగస్థలం నటుడు ఎలా ఉంటాడో అంతా పాట రూపంలో చూపించాడు ఈ రచయిత. ఆ రచయిత పేరు లక్ష్మి భూపాల. చాలా అందమైన ...

జన్మ దినం

జన్మ దినం  అనకాపల్లి ఒకప్పటి విశాఖ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తీయటి బెల్లం. బంగారపు రంగులో మెరిసిపోయే బెల్లపు అచ్చులు కానీ . బెల్లపు వ్యాపారానికి ప్రసిద్ధ స్థలం. బెల్లపు పానకం లాంటి తెలుగు పదాలతో సినీ కళామతల్లిని ఆరాధించే పాటల బ్రహ్మ అక్కడ పుడతాడని ఎవరికి తెలుసు. అంతా విధాత తలపు. మెడలో శ తస్కోప్ వేసుకుని మన రోగాలను నయం చేస్తాడు అనుకుంటే పాటలతో ధైర్యాన్ని ఇచ్చి పదాలతో మెదడుకు పదును పెట్టి మన ఆరోగ్యాలను బాగుచేసే పాటలకు జన్మనిచ్చాడు మన సీతారామశాస్త్రి. ఏది మన చేతుల్లో ఉండదు కాలం చేసే మార్పులకి మనం తలవగ్గి నడవ వలసిందే. కాలానికి నాయకుడు ఈశ్వరుడు.  కళలకు అధిపతి కూడా ఆ నటరాజే. ఆయన అందుకునే మార్గం మళ్లించి తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా విశ్వనాథుడి దరి చేర్చాడు . ఈయన సీతారాముడు. ఆయన విశ్వనాధుడు. ఇంకేముంది సీతారాముడి కలo నుంచి పుట్టిన పాట తెలుగుజాతి కీర్తి కిరీటాలను ఎక్కడకో తీసుకుని పోయేలా చేసింది. ఒకపక్క పాట మరొక పక్క విశ్వనాథుడు దర్శకత్వం ఇంకేముంది సినిమాలన్నీ శతదినోత్సవ చిత్రాలే. ఇంటి పేరు అసలు ఎవరికీ తెలియదు సినిమా పేరు ఇంటి పేరుగా మా...

రిఫ్రిజిరేటర్

 రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) నేడు ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించే అవసరమైన యంత్రం. ఇది ఆహారాన్ని తాజా గా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. అయితే కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలు తగ్గిపోవచ్చు, వాసన మార్చవచ్చు, ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టకూడని ముఖ్యమైన వస్తువుల వివరాలు మరియు వాటి వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకుందాం: 1. బంగాళాదుంపలు (Potatoes): ఎందుకు పెట్టకూడదు? చలిలో బంగాళాదుంపలలోని స్టార్చ్ శరీరానికి హాని కలిగించే చక్కెరలుగా మారుతుంది. ప్రమాదం: ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు, ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు. 2. టమోటాలు (Tomatoes): ఎందుకు పెట్టకూడదు? చలి వాతావరణంలో టమోటా ఉక్కిరిబిక్కిరి అవుతుంది, రుచి, వాసన తగ్గిపోతుంది. ప్రమాదం: ఉపయోగించాలంటే ఇబ్బందిగా మారిపోతుంది. ఆహార నాణ్యత నష్టమవుతుంది. 3. ఉల్లిపాయలు (Onions): ఎందుకు పెట్టకూడదు? ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు తడిగా మారి త్వరగా పాడైపోతాయి. వాసన ఇతర పదార్థాలకు అంటుతుంది. ప్రమాదం: అతి వేగంగా ఫంగస్ వచ్చి ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు 4. వెల్లుల్లి (Garlic): ఎందుకు పెట్టకూడదు? చల్లదనంతో వెల్లుల్లి మొలకెత్తుతుంది, ర...