పోస్ట్‌లు

భాగ్యనగరం

భాగ్య నగరం  అది నిజంగా భాగ్యనగరమే పట్టా పుచ్చుకుని పట్నం చేరిన  తమ్ములను చెల్లెళ్లను కార్పొరేట్ ఏసీ గదుల్లో మెదడుకు మేత పెట్టి  జేబులు నింపి అన్నపూర్ణలా ఆదరిస్తోంది. అక్షయపాత్రలా ఆహ్వానిస్తోంది. వారాంతపు సెలవుల్లో ఊరికి దూరంగా ఉండి ఉర్రూతలూగిస్తున్న రామోజీ ఫిలిం సిటీ చూపిస్తుంది. నాలుగు స్తంభాల నగిషి చూపించి నవాబు గారి గొప్పతనాన్ని గుర్తుచేసి చౌడి బజార్ అంతా తిప్పి చంటి దానికి  గాజులు కొనిపిస్తుంది. ఆ భాగ్యమతి నగరానికి నిజంగా ఆ ప్రదేశం ఎంతో సుందరం భాగ్యనగరవాసులు కట్టుకున్న బంగారు సరస్సు హుస్సేన్ సాగరo అందాల సరస్సులో ఎగిసిపడే కెరటాలు యువ ప్రేమికులకి ఉత్సాహాన్ని, మధ్యలో ఉన్న గౌతమ్ బుద్ధుడు వయసు మళ్ళిన వాళ్లకి జ్ఞానోదయాన్ని, కలిగించే అందమైన ప్రదేశం. పేరుకే పాత నగరం నేటి తరం వారు కట్టలేని కట్టడాలు మచ్చుకి నిజాం నవాబు గారి  చౌమహల్లా ప్యాలెస్. చూడగానే ఆహా అనిపిస్తుంది  మదిని దోచేస్తుంది బొమ్మలంటే పిల్లలు ఇష్టపడతారు పెద్దలకు కూడా ఇష్టమే పైకి చెప్పరు బొమ్మలు తోటి విన్యాసాలు వండర్లన్నీ చూపించే wonderland రెక్కలున్న విమానమే గాల్లో ఎగురుతుంటే ఆశ్చర్యంగా పైకి చూస్త...

కాకినాడ

కాకినాడ మా ఊరండి ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి. అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు. చీరలు ఎగుమతి.  చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు . అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటవారు కోకనాడపేరుమర్చిపోలేదు.అదిఅలాగేకంటిన్యూ అవుతోంది.ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడ గా మారిపోయింది. కోకనాడ అతి పురాతన నగరం . తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకి సహాయం చేస్తూ మధ్యలోనీ హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది. అందాల నగరం లోపల అందమైన రోడ్లు మంచి మంచి పార్కులు మంచి మంచి కాలేజీలు మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో. అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది పి ఆర్ కాలేజ్ అండి . ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు డాక్టర్లు నాయకులు ఇంజనీర్లు యాక్టర్లు అయిపోయారు. కాకినాడ ప్రజలు ఎ...

ఇంకేమిటి కబుర్లు

ఇంకేంటి కబుర్లు  ఏ ఇద్దరు కలుసుకున్న వారి మధ్యలో ఉన్న మౌనాన్ని  పోగొట్టడానికి, దగ్గర చేయడానికి కబుర్లు ఒక ఆధారం. కబురు అంటే సమాచారం, సందేశం, వర్తమానం ,ఇలా చాలా రకాల అర్ధాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు అంతా కులాసా యేనా అంటూ ప్రారంభమైన పలకరింపు అలా కబుర్లుకు దారితీస్తుంది. పక్కింటివాళ్ళతో గోడకి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ,రోడ్డుమీద ఎదురుపడితే, బజార్లో కనబడితే ,పార్కులు ,రచ్చబండలు,పల్లెటూర్లోబావులు,చెరువులు, మున్సిపాలిటీ కుళాయిలు ఇప్పుడైతే ఫేస్బుక్లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికి స్థావరాలు. కొంతమంది చెవిలో చెప్తారు . కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెబ్బలు ఆడుకున్నట్టు ఉంటుంది. మైక్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఇద్దరు మనుషులు కలుసుకుంటే తెలుసున్న సమాచారం చేర వేయకుండా ఉండలేరు. బాధలు చెప్పుకోకుండా ఉండలేరు కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా ఉండలేరు. ఎదుటివారి పరిస్థితి గురించి అర్థం చేసుకోరు. అలా చెప్పుకుంటూ పోతుంటారు. ఒకే రకమైన అభిరుచి ఉన్న వాళ్ళని ఆ రంగానికి సంబంధించిన వార్త దగ్గర చేస్తుంది. స్నేహం పెంచుతుంది. సాధారణంగా యువత అంతా క్రికెట్ గురించి సినిమాలు గు...