పోస్ట్‌లు

కుండ

కుండ మట్టిలో పుట్టిన మాణిక్యం  నరుడికి వేసవి తాపం తీర్చే అమృతభాండం రంగు నల్ల బంగారం  గుండె శీతలయంత్రం  తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితం  చెయ్యి జారితే ముక్కలయ్యే కుంభం  సప్తస్వరములు పలికిస్తే అది ఘటం  నోరూరించే ఊరగాయకి అదే ఆధారం సాదరంగా ఆహ్వానించేది పూర్ణకుంభం  కడవరకు సాగనంపే ఆత్మీయ భాండం  జోరుగా కురిసే వర్షం కుండ పోత  మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే  వట్టి మట్టి పూత. కాకి బావకు దాహం తీర్చే సన్న మూతి కూజా వేసవి వచ్చిందంటే గొంతును చల్లబరిచే తర్బూజ.  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

ఇటుక

ఇటుక కాళ్ల కింద నలిగిన మట్టి  అచ్చులోదూరి  అమ్మలా మారి  కొలిమి చేరి  ఒళ్ళు కాల్చుకుని  చల్లబడి మాలు అద్దుకుని  గోడకు ఆధారమై  మేడను నిలబెట్టి కలకాలం కష్టసుఖాలన్నీ   చూస్తూ  గోడు వినే నాథుడు లేక  వంద ఏళ్ళు అయిన  నడ్డి విరగకుండా  ఇటుక మంచిది  అని ప్రైజులు కొట్టేస్తుంది. మట్టి పిసికి  అచ్చు పోసిన మహారాజుని  పూరి గుడిసె వెక్కిరిస్తుంది  అరచేతిలో స్వర్గం చూపించే  షావుకారిని రెండంతస్తుల మేడ   గర్వంగా తల  పైకెత్తుకుని తిరిగేలా చేస్తుంది.  నాది డూప్లెక్స్  మెయిన్ రోడ్ లో ఇంకొక కాంప్లెక్స్  అన్నింటికీ ఆ ఊరి ఇటుకే  పైసా ఖర్చు లేని పబ్లిసిటీ ఇటుక ముక్కకి మట్టి పిసికిన మహారాజు  ఎప్పటికీ తెర వెనుక బొమ్మే ఎవరో చెప్పినట్టు ఆడుతున్న  తోలుబొమ్మ. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ  9491792279

ప్రణాళిక

ప్రణాళిక ఈ సమస్త జీవకోటిలో ఆలోచించే శక్తి, ఆలోచన ఆచరణలో పెట్టే శక్తి ఒక్క మనుషులకే ఉంది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో అనేక రకాలైన లక్ష్యాలు ఉంటాయి. చేయవలసిన పనులు ఉంటాయి. ఈ పనులను లేదా లక్ష్యాలను సాధించడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి అవసరం. ఆ పద్ధతిని ప్రణాళిక అంటారు. ఆంగ్ల భాషలో planning అంటారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏ పని మొదలుపెట్టిన అది సఫలీకృతం అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రణాళికంటే ఒక వ్యూహం. ఒక ఆలోచన. ఒక నిర్దిష్టమైన ఊహలతో కూడిన కొత్త మార్గం. ఉదాహరణకి ఏదో విమాన ప్రయాణం చేయవలసి వస్తుంది మహానగరాల్లో ఉండేవాళ్లు ఆ విమానాశ్రయం చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది అని అనుకుందాం సాధారణంగా అయితే అక్కడున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ వలన ఇంకొక గంట ముందుగా బయలుదేరాలి. అంటే ప్రయాణ సమయం రెండు గంటలుగా ఊహించుకోవాలి . ఆ ఊహ ప్రణాళిక. ఒకవేళ ట్రాఫిక్ జాం వలన కొంచెం ఆలస్యం అయినప్పటికీ నిర్ణీత సమయానికి మనం అక్కడికి చేరుకోగలం.  లేదంటే అనవసరమైన ఒత్తిడి కంగారు అనారోగ్యం కోపాలు తాపాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇదంతా అనవసర రాద్ధాంతం.  దూర ప్రాంతాల్లో ఉండే ...