పోస్ట్‌లు

Unique disability Id

 UDID అంటే Unique Disability ID. ఇది భారత ప్రభుత్వం ద్వారా వికలాంగులకు అందించే ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఈ కార్డు ద్వారా వికలాంగులైన వారు ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, రాయితీలు పొందగలుగుతారు. ఇప్పుడు మీ కోరిక మేరకు UDID గురించి కొన్ని ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు ఇక్కడ ఇస్తున్నాను: UDID పై ప్రశ్నలు మరియు సమాధానాలు 1. UDID అంటే ఏమిటి? సమాధానం: UDID అంటే Unique Disability ID. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక డిజిటల్ ID కార్డు, ఇది వికలాంగులందరికీ ప్రత్యేకమైన గుర్తింపుగా ఉంటుంది. 2. UDID కార్డు అవసరం ఏమిటి? సమాధానం: • కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందే వివిధ రకాల రాయితీలు పొందటానికి • ప్రయాణ సౌకర్యాలు (రైలు, బస్) లో concessional tickets పొందటానికి • విద్య, ఉపాధి మరియు వైద్య రంగాలలో ప్రత్యేక సేవలు పొందేందుకు • వికలాంగులకు సంబంధించిన పథకాల్లో నమోదు కావడానికి 3. UDID కార్డు ఎలా అప్లై చేయాలి? సమాధానం: UDID కార్డు కోసం మీరు www.swavlambancard.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అక్క‌డ మీరు ఆన్లైన్‌లోనే అప్లికేషన్ ఫారం నింపాలి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చే...

కవల పిల్లల తల్లి

 బిడ్డకు జన్మనివ్వడం ఒక వరం. కవలలు పుట్టడం ఆ వంశం చేసుకున్న పుణ్యం. పురాణాల కాలం నుంచి ఉంది కవలల జననం లవకుశల జన్మ అందుకు సాక్ష్యం. జన్మరీత్యా కవలలు కాకపోయినా అనుబంధంతో అన్న వెంటే ఉన్నాడు లక్ష్మణుడు తరతరాలుగా వీరి నామమే కవల పిల్లలు అందరికీ. రామాయణంలో సీతాదేవి ఊర్మిళ పాత్ర త్యాగ మయం. సీతాదేవి అరణ్యం పాలైతే ఊర్మిళాదేవినీ నిద్రా దేవత పరం కవల పిల్లలు కాకపోయినా భువిలో సీతా ఊర్మిళ నామము కవల పిల్లలు అందరికీ ఆది వైద్యులు అశ్వనీ దేవతలు కూడా కవలపిల్లలు. వీరి అంశతో జన్మించిన వారే నకుల సహదేవులు. ఒకే కాన్పు లిప్తపాటు తేడా  ఒకరి తర్వాత ఒకరు ఒకే పోలిక ఎవరు పెద్ద  ఎవరు చిన్న ఎవరు ముందు  ఎవరు వెనుక పుట్టించిన  బ్రహ్మకే అయోమయం. మత్తులో ఉన్న అమ్మ మాత్రం ఏమి చెప్పగలదు. బ్రహ్మకి అమ్మకి తెలియని సత్యం. అందుకే కవల పిల్లలు అంటే అందరికీ అభిమానం. ఏ ప్రాణి జన్మకైనా అమ్మే కదా ఆధారం. బిడ్డను లాలించి పోషించేది అమ్మ. కవల బిడ్డ అయినా ఒకే బిడ్డ అయినా యధావిధిగా తన ధర్మం నిర్వహించేది అమ్మ. బాధ్యత లోనే కదా తేడా. బాధ్యత అమ్మ సహనాన్ని రెట్టింపు చేస్తుంది. పెదవి విప్పి చెప్పదు ఏ కష్టం. కవల పిల్ల...

శివుడు

 అంతులేని దృష్టి కలవాడు పరమేశ్వరుడు. అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు. అజ్ఞానం తొలగించి జ్ఞాన మిచ్చే దక్షిణామూర్తి . ఈ నాట్యకళ అంతా నటరాజ ప్రసాదమే  ఏమని వర్ణించను ఆతని వైభవం.  దుష్ట శిక్షణకే అవతరించాడు మహాకాలుడిగా. మన భయాలను తొలగించి భైరవుడు అయ్యాడు     జరామరణములు లేని జగదీశుడు శివుడు.     ఏమని వర్ణించను ఆతని వైభవం.      వెండి కొండపై ఉంటాడు ప్రార్థనతో మంచులా కరిగి పోతాడు  మన బాధలు అన్నీ మంచులా కరిగిస్తాడు కోరిన వెంటనే అన్ని కోరికలు తీర్చే ఆశుతోషుడు. అంతులేని గుణములు ఉన్నవాడు ఆదినాథుడు వంక పెట్టలేని గుణములు ఉన్నవాడు పరమాత్ముడు. పంచభూతాలన్నీ అతడి ఆధీనమే . ఏమని వర్ణించను ఆతని వైభవం. బాధలను తొలగించి శాంతిని ప్రసాదించే కైలాస నాధుడు. లోకాలను రక్షించువాడు జగత్తును సృష్టించే వాడు శివుడు. శాశ్వతమైన స్వామి సర్వ శివుడు.  సర్వమునకు అధిపతి సర్వేశ్వరుడు. ఏమని వర్ణించను ఆతని వైభవం       నాగులన్ని ఆతడి ఆభరణం. ఆతని భక్తులైన మాకు నాగన్న అంటే ఎందుకు భయం. మన వంశాభివృద్ధికి నాగులే చేయు దోహదం. ఏమని వర్ణించను ఆతని వైభవం...