చిట్టి కవితలు
చిట్టి కవితలు చేతిలోని కత్తి తలలు నరుకుతుంది చేతబట్టిన సుత్తి బల్లగుద్ది మరీ తలరాతలు మారుస్తుంది చిట్టి కవితలు 2 కలం మనం చెప్పినట్లుగా నడుస్తుంది. కాలానికి అనుగుణంగా కథలురాస్తుంది. కాలం మనల్ని నడిపిస్తుంది. కలానికి పదును పెడుతుంది. చిట్టి కవితలు 3 ఆయువు ఉన్నంతకాలం అమ్మ ఈ లోకంలో ఉంటుంది అమ్మ బొమ్మ మాత్రం ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటుంది. మిన్ను మన్ను రైతు చూపులన్నీ ఆ రెండింటి మీదే. చెద వ్యధ ఒకటి గూడుకి మరొకటి గుండెకి చేటు లవ్వుకి సంకేతం పువ్వు నవ్వు అంగీకారం భోగి యోగి అలా ఉంది వాళ్ళ యోగం. అందం ఆనందం రెండు మనసుకి మకరందమే.