పోస్ట్‌లు

హార్ట్ స్పెషలిస్ట్

 హార్ట్ స్పెషలిస్ట్  దడ పుట్టించే గుండెకు ధైర్యం చెప్పే వాడు, నిస్సహాయ శబ్దంలో ప్రాణం ఊదే వాడు। నిలువెత్తు జీవితం,  ఓ పందిరిలా కూలుతుందంటే, దాన్ని మళ్లీ నిలబెట్టే వైద్యం తెలిసిన వాడు। ఇకోలో వింటాడు గుండె బాధలు ఇసిజిలో చదివాడు మనసుల భావాలు। ఒక్క చిన్న మార్పు ఓటమి గోడు, అది గెలిపించేదే ఇతని వృత్తి మోక్షపథము। ఓ బీటు తప్పితే గాలి ఆగుతుంది, కానీ ఇతని చేతి తాకిడి జీవం జాగృతం చేస్తుంది। స్టెంట్ పెట్టినా సరే, ఆశను తొలగించడు, పేషెంట్‌ను కాదు, కుటుంబాన్నే మోస్తున్నాడు। తన చేతుల్లో గుండె గబగబ మ్రోగితే, తన హృదయంలో నిశ్శబ్దంగా ప్రార్థన మారుతుంది। సైన్స్‌తోనే కాదు, ప్రేమతోనూ నడిచే మార్గం, హార్ట్ స్పెషలిస్టే నిజంగా హార్ట్‌లో  ఉన్న దేవుడు అని ఋజువు!

జీవితం

సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు.  " అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు. "కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. "అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి. బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి. రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే. స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది. "బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడ...

ఆఖరి చోటు

 ఆఖరి చోటు ప్రయాణం అంటే అందరికీ సరదాయే . అక్కడికి చేరడం అంటే అందరికీ భయమే కానీ చివరకు చేరేది ఆ చోటుకే మనకు భయం తెలియకుండానే చేర్చే చోటు. మనం ఆ చోటుకు చేరుతున్నామని తెలియకుండానే చేరే చోటు.  ప్రతి ప్రయాణానికి ముహూర్తం ఉంటుంది. మన అంతిమ ప్రయాణం మన చేతుల్లో ఉండదు మన చేతల్లో కూడా ఉండదు. ఆ ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించేది ఆ దేవుడు ఒక్కడే. ఆ చోటు అక్షయపాత్ర లాంటిది ఎంతమంది చేరిన మరి ఎంతోమందికి చోటు ఉంటుంది. దయాదాక్షిణ్యలు లేవు . ఎవరి కన్నీళ్లు పట్టవు గుండె అంతా బండరాయి. గుండె మండుతున్న బాధ్యతను మరిచిపోని ప్రదేశం. కావ్యాలు రచించిన కవులకి అదే పూల పాన్పు . సుమధుర గానాలు వినిపించిన వసంత కోకిలకు అదే ఆఖరి మజిలీ. నాడీ పట్టుకుని నలత చెప్పే వారు చివరకు చేరే చోటు రాజు బంటు తేడాలు లేవు  ఉన్నవాడు లేనివాడు అన్నది వట్టిమాటే. ఇంద్రుడైన ఒకటే దేవేంద్రుడైన ఒకటే ఇహపర బేధాలు లేవు. ఆ చోటులో అందరూ సమానులే. నిర్జీవమై ఆ చోటుకు చేరిన మమకారం గుప్పెడు మట్టిగా మారిపోతుంది. తలదించిన అహంకారం ఊపిరితోపాటు ఎగిరిపోతుంది. సంపాదించిన సొమ్ము బతికుండగా పెట్టిన సంతకంతో రెక్కలు వచ్చే ఎగిరిపోతుంది. మనది కాని చోట...