పోస్ట్‌లు

ఆమె స్వరo _ ఊరికి వరం

"ఏమ్మా మల్లి, ఇంత ఆలస్యమైంది?" అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను." "నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా?" అని అడిగాడు రామారెడ్డి. ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని, పాకలో ఉన్న పశువుని, పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు వేస్తూ వస్తోంది మల్లి. "ఏమ్మా, ఎప్పుడు ఆ పాటలేనా? తొందరగా రా! ఆకలేస్తుంది," అంటూ కేకలేశాడు రామారెడ్డి. చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు మల్లి. ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్లింటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. "ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో!" చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి, నవరాత్రి ఉత్సవాల పందిళ్లలోనూ, శ్రీరామనవమి, శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది. "ఇవి ఎక్కడ న...

మదిని దోచిన బొమ్మ

నల్లటి శరీరం, కమలాల వంటి కళ్ళు. ఆ కళ్ళల్లో కృపారసం. చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛం. ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా, రాధాకృష్ణుడిగా, అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసు పదేపదే ఆ ముగ్ధమోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది. నిజమే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. అంత అందమైన పరమాత్మను చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట. మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ, బొమ్మ కానీ రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైనదైనా కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనాస్త్రం. ఒక్కడే కాదు, పదహారు వేల...

సీతమ్మ అన్నదానం

ఉదయం పదకొండు గంటలు అయింది. ఆ నగరంలో ప్రముఖ కూడలి ఉన్న గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చుని ఉన్నారు. ఇంతలో గుడి తలుపులు మూసేసి పూజారి గారు బయటకు వచ్చి, "ఏరా ఇంకా వెళ్ళలేదా?" అని అడిగారు. ఎందుకంటే ఉదయం–సాయంకాలం గుడిమెట్ల మీద ఆ ఇద్దరు బిచ్చగాళ్లు సుమారు ఇరవై సంవత్సరాల నుండి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఉదయం–సాయంకాలం గుడి దగ్గర బిక్షాటన చేసుకుని, గుడి కట్టేసిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర, రాత్రి పూట పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మీద పడుకుంటారు. ఆ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ వాళ్లు వేరే గుడి దగ్గరకు వెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు కాళ్లు ఒక యాక్సిడెంట్‌లో పోయాయి. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన మీద మూడు చక్రాల బండి వాళ్ళకి ఆధారం. పూజారి గారు అడిగిన ప్రశ్నకి "లేదండి" అంటూ సమాధానమిచ్చి, ఏదో నసుగుతూ కనబడ్డారు బిచ్చగాళ్లు. రోజు పదకొండు గంటలకే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ బిచ్చగాళ్లు. ఇవాళ ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారని అప్పుడు తట్టింది పూజారి గారికి. విషయం అర్థమైంది రా! మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో! ఆ అమ్మగారి గురించే కదా… అవునన్నట్లుగ...