ఆ ముగ్గురు

ఆ ముగ్గురు

క్షణం తీరికలేని మనిషి జీవితానికి
తలుపు తట్టి సహాయం అందించే అపర త్రిమూర్తులు.
మూల్యం చెల్లించిన మరిచిపోలేని సహాయం.

ఎండైనా వానైనా వరదైనా
క్రమం తప్పకుండా ఆ సమయానికి గుమ్మం లో నుంచి పిలుపు
పాల బుగ్గల పసివాడు మొదలు పండు ముదుసలి వరకు ఆ పిలుపు కోసమే ఎదురు చూపు.
ఇంతకీ ఆ పిలుపు పిలిచేది ఎవరు
ఇంకెవరు అపర గోపాలుడు మన పాలవాడు.

లేచింది మొదలు కాఫీ చుక్క కోసం పడిగాపులు.
ఆ చుక్కతోనే మొదలవుతాయి మన పరుగులు.

ఆధునిక మహిళ ప్రతినిత్యం చేస్తోంది బ్రతుకుతో అష్టావధానం.పనిలో సహాయం లేనిదే నడవదు గృహిణి బ్రతుకు.ఆ మనిషిని చూడగానే గృహిణి కళ్ళల్లో కొండంత వెలుగు.

విటమిన్లన్నీ గంపలో గుమ్మం దగ్గరికి తెచ్చి 
అమ్మగారికి భారం తగ్గించేది కూరలమ్మి
తాజా కూరలతో బలం పెంచే ఆరోగ్య ప్రదాయిని.
సమయానికి తెచ్చి సమయం లేని ఆధునిక మహిళకి
కొండంత సహాయం చేసేది ఆకుకూరల అమ్మాయి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట