జీవితం ఒక ఆట



జీవితం అనేది ఒక గొప్ప ఆట. ఈ ఆటను కొందరు శత్రువులతో, కొందరు స్నేహితులతో, కొందరు గెలుపు ఆశతో, కొందరు ఓటమి భయంతో ఆడతారు. అయితే జీవితం ఓ క్రికెట్ ఆట వంటిదే అని చెప్పుకోవచ్చు. క్రికెట్ ఆటలోని ప్రతి అంశం మన జీవితంతో ఏదోలా అనుసంధానం కలిగి ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం:

1. పిచ్ అంటే జీవన ప్రస్థానం
క్రికెట్ పిచ్ ఎంత సాఫీగా ఉంటే ఆట అంత మెరుగ్గా సాగుతుందో, అలాగే మన జీవిత ప్రస్థానంలో ఎదురయ్యే పరిస్థితులు మన విజయాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు పిచ్ (లైఫ్) అనుకూలంగా ఉంటుంది, మరికొన్నిసార్లు చేదుగా ఉంటుంది. కానీ ఆట ఆగదు.

2. బ్యాట్స్‌మెన్ = మనమే
బ్యాట్స్‌మెన్‌గా మనం ప్రతి బంతిని గమనించాలి. కొన్నిసార్లు ఆఫ్‌స్టంప్‌కి వస్తుంది, కొన్నిసార్లు బౌన్సర్‌గా. ఏ బంతిని ఆడాలో, దేనిని వదలాలో నిర్ణయించుకోవాల్సిందే. ఇదే జీవితంలో అవకాశాలు, ఇబ్బందులు – వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయం మనదే.

3. బౌలర్లు = సమస్యలు

బౌలర్లు జీవితానికి వస్తే – అవే మనకు ఎదురయ్యే సమస్యలు. కొన్నిసార్లు అవి స్లో బంతులు – అర్థం కాకుండా ఉండే సమస్యలు. మరికొన్ని ఫాస్ట్ బంతులు – ఊహించని ఘటనలు. వాటిని ఎదుర్కోవడం, తగిన సమయాన్నే ఎదురుదాడి చేయడం మన తెలివి.

4. ఫీల్డింగ్ టీమ్ = సమాజం
మన చుట్టూ ఉన్నవారు – కొంతమంది మనల్ని ఔట్ చేయాలనుకుంటారు, మరికొంతమంది మంచి మాటలు చెప్పి మోటివేట్ చేస్తారు. ఫీల్డింగ్ టీమ్‌లో ఉన్నట్లుగానే, జీవితంలోనూ మన చుట్టూ ఉన్నవారి తీరును బట్టి ఆట రీతిని మార్చుకోవాలి.

5. కెప్టెన్ = మన లక్ష్యం

బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్‌లు అన్నీ కెప్టెన్ చూసుకుంటాడు. జీవితంలో మన లక్ష్యం కూడా అలానే – అది మన నిర్ణయాలకు దారి చూపుతుంది. కెప్టెన్ బలంగా ఉంటే ఆట బాగుంటుంది; మన లక్ష్యం స్పష్టంగా ఉంటే జీవితం
 గెలుపుదిశగా సాగుతుంది 

6. ఎండ్ = రిటైర్మెంట్ కాదు, జ్ఞాపకం

ఒక ఆట ముగిసినప్పుడు గెలిచామా, ఓడామా అనేది తేలిపోతుంది. కానీ విజయం కోసం చేసిన ప్రయత్నం, ఆట తీరు మాత్రం అభిమానుల హృదయంలో నిలుస్తాయి. 

అలాగే మన జీవితంలో మన ప్రవర్తన, మంచితనం, సహాయం – ఇవే చివరికి గుర్తుండిపోయేది.

సారాంశంగా
జీవితం ఓ టెస్టు మ్యాచ్ లాంటిదైనా, కొన్నిసార్లు T20 లా వేగంగా మారుతూనే ఉంటుంది. కాని ప్రతి బంతికి మన స్పందనే మన విజయాన్ని నిర్ణయిస్తుంది.

మన జీవితాలతో ఇంత దగ్గర సంబంధం ఉన్న క్రికెట్ మ్యాచ్ వేలాదిమందికి చిన్నస్వామి స్టేడియం నిన్న ఆనందం మిగిల్చిన అంతకంటే ఎక్కువ విషాదాన్ని కూడా తీసుకొచ్చింది. 

పదకొండు ప్రాణాలు క్రికెట్ బంతిలా గాల్లో ఎగిరిపోయేయి. గాల్లోకి లేచిన బంతి స్టేడియం కి దూరంగా క్రింద పడుతుంది. మరి ఒక్కసారి గాలిలోకి లేచిన ప్రాణం విగత శరీరాన్ని నేల మీద వదిలేసి వెళ్ళిపోయింది.అంతా ముక్కు పచ్చలారని పసివాళ్లే. ఆట మీద మక్కువ. అభిమాన ఆటగాళ్లను చూడాలని సరదా. సరదా ప్రాణం మీదకు వచ్చింది. చాలా బాధాకరమైన విషయం..
 క్షణానికి ఒకసారి సమాచారం చెప్పే దృశ్య శ్య శ్రవణ మాధ్యమాలు ఉన్నాయి. మరి అమ్మకు చెప్పకుండా నాన్నకు తెలియకుండా వయసు తెచ్చిన సరదాతో విజయోత్సవం చూడడానికి పరుగులు తీసిన యువత ఆనందం గాల్లోకి లేచిపోయింది. చాలా బాధగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట