పోస్ట్‌లు

చాట్ బండి

 చాట్ బండి సాయంకాలం నాలుగు గంటలు అయితే చాలు అన్ని వయసు వాళ్ళ ఆకలి తీర్చే నాలుగు చక్రాల బండి నాలుగు వీధులలో కనబడే బండి. నలుగురు మెచ్చే మిర్చి బండి.అదే పిడత కిందపప్పు బండి. యువతను కట్టిపడేసే చాట్ బండి.  ఒకసారి సరదాగా అలా చాట్ బండి చూసి వద్దాం పదండి. ఈ బండి కి నాలుగు చక్రాలు ఉండి చుట్టూ రంగురంగుల అద్దాల  డబ్బా లుతో మెరిసిపోతూ పైన ఒక స్టూలు ,కాగితoముక్కలు  ఒక అరలో అలంకరించుకుని సందుల్లో గొందుల్లో పార్కు దగ్గర  పాఠశాల దగ్గర ఆఫీస్ దగ్గర ఆసుపత్రి దగ్గర అందంగా నిలిచి  ఉంటుంది. మన చాట్ బండి.  ఉదయం నుంచి శ్రమపడి కావాల్సిన ముడి సరుకులు తెల్లగా మల్లెపూలులా ఉండే మరమరాలు కారం ఉప్పు అటుకులు నిమ్మరసం ఉడికించిన బటాని బుల్లి సమోసాలు మిర్చి బజ్జీలు అరటికాయ బజ్జీలు వాసన వీధి అంతా అదరగొడుతుంటే ఏ మూలకైనా చేరిపోయి అందంగా నిలిచి ఉండి మంచి వాసనలతో అందర్నీఆహ్వానిస్తుంది అనేకంటే ఆకర్షిస్తుందని చెప్పడం మేలు బండి మధ్యలో ఉడుకుతున్న బటాని . కింద గ్యాస్ బండ  పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇంత సౌకర్యవంతంగా తయారుచేసిన ఈ బండి రూపశిల్పికి ముందుగా నమస్క...

మధ్యతరగతి మహాభారతం_ఆధునికతలో చిక్కుకున్న జీవితం.

ప్రగతిశీల ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకూ మారుతోంది. ఈ మార్పుల వెనుక మన అవసరాలకన్నా ఎక్కువ ఆశలు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు – తమ స్థాయికి మించి జీవించాలని ప్రయత్నిస్తూ, ఆధునికత అనే మాయా ప్రపంచంలో ఆర్థికంగా చిక్కుకుపోతున్నాయి. ఒకప్పుడు ఉదయం లేస్తూనే వేప పుల్లదంత ధావనం ప్రారంభమైన దినచర్య ఇవాళ రకరకాల బ్రష్షులు మార్కెట్లోకి వచ్చాయి. టూత్ పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి. పంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా టూత్ పేస్ట్ మీరు వాడండి అoటు సిఫార్సులు కూడా ప్రారంభమయ్యాయి.   దొడ్లోని బావి దగ్గర చేదతో నీళ్లు తోడు పోసుకుని శరీరం శుభ్రం చేసుకుని స్థాయి నుంచి బాత్రూములలో అనేక రకాలైన సబ్బులు మరియు ఆ బాత్రూం క్లీన్ చేయడానికి రకరకాల పరికరాలు లోషన్లు మరుగుదొడ్లు క్లీన్ చేయడానికి రకరకాల బ్రష్లు, లోషన్లు ఇవన్నీ కూడా ప్రతినెల మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జీవితాల ఆర్థిక పరిస్థితి మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఇక శరీర అలంకరణ సామాగ్రి, బట్టలు, కాళ్ళకి తలకి అలంకరణ ఇలా ఒకటేమిటి బయటకి ఉద్యోగానికి వెళ్లే మానవుడికి అన్నీ పెట్టుబడులే.  స్మార్...

వారధి

చిత్రం
ఊపిరి ఉన్న వాళ్లని తీరం  చేర్చేది వారధి  ఊపిరి లేని వాళ్లకి ముక్తిని ఇచ్చేది  గలగల పారే గోదావరి నది.  వెరసి గోదావరి వారధి  మనకు పెన్నిధి