పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కెమెరా వెలుగులో పెళ్లి

మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు. అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి. ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది. "రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే ...

సతులాల చూడరే

 సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పరమాత్మ జన్మించాడు. అదే మనకి శ్రీ కృష్ణాష్టమి. చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు ఈ కీర్తనలో పసిపాపగా ఉన్న పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతాడు అన్నమయ్య. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని నిద్రలో గడుపుతారు. అయితే ఇక్కడ పుట్టింది సాక్షాత్తు పరమాత్మ.  ఆయన చతుర్భుజాలు శంకు చక్రాలు ఒంటినిండా సకల ఆభరణాలు ,తల మీద కిరీటం ధరించి పుట్టాడుట మహానుభావుడు. వాగ్గేయ కారులంతా కారణజన్ములు. లేదంటే పసిపాపడగా ఉన్న పరమాత్మ ని ఇలా వర్ణించడం సాధ్యం కాదు. ఆదిశేషుడు అవతారమైన బలరాముడు రోహిణి దేవి కడుపున పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు శివుడు నారదుడి లాంటి మునులు దేవతలు దేవకీదేవి బంధించబడిన కారాగారం వద్దకు వచ్చి పరమాత్మా!దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతా...

చినుకులో సాయం

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు. వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు. ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది. “ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు. “సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు. “లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర...

లక్ష్మి దేవి పుట్టుక

అది త్రేతాయుగ కాలం. స్వర్గలోకం సంతోషాల తోటలా మెరిసిపోతూ ఉండేది. కానీ ఒక్కరోజు, ఋషుల శాపంతో దేవతల శక్తి క్షీణించింది. ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది, వరుణుని జలప్రవాహం మందగించింది, వాయువుని వేగం తగ్గిపోయింది. ఇదే సమయం చూసుకుని అసురులు, దైత్యులు, లోకాలను కబళించడం మొదలుపెట్టారు. దేవతలు భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. "ప్రభూ! మా శక్తి తగ్గిపోయింది, దైత్యులు మమ్మల్ని జయిస్తున్నారు. మాకు రక్షణ కల్పించండి" అని ప్రార్థించారు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు – "క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది. దానిని సముద్ర మథనం చేసి తీసుకురండి. కానీ దైత్యుల సహాయం అవసరం ఉంటుంది. మీరు వారితో ఒప్పందం చేసుకోండి. మిగతా యోచన నేను చేస్తాను." క్షీరసాగర మథనం  దేవతలు, దైత్యులు కలసి మందరపర్వతాన్ని మథనదండంగా ఎత్తుకొచ్చారు. కానీ సముద్ర మధ్యలో ఉంచగానే అది మునుగుతూనే ఉంది. అప్పుడు విష్ణువు కూర్మావతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. వాసుకి నాగరాజు మథనతాడుగా ముందుకొచ్చాడు. దైత్యులు వాసుకి తలవైపున, దేవతలు వాలువైపున పట్టుకున్నారు. మథనం మొదలయ్యింది. మొదటి ఫలితం – హలాహల విషం వాస...

శ్రీకృష్ణ నిర్యాణం

కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన సాగించడం మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతారం ఎత్తిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులని సంహరించాడు. ఆ దుష్ట శిక్షణ చూసి అనేకమంది మునీశ్వరులు సంతోషించారు. కంసుడు వంటి రాక్షసులను సంహరించి భూభారం తగ్గించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధుడయ్యాడు.  అదే సమయంలో యాదవ సైన్యం విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులైన యాదవులకు బుద్ధి చెప్పడానికి పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూడ్డానికి విశ్వామిత్రుడు దూర్వాసుడు మొదలగు ఋషులు ద్వారకా నగరానికి వస్తారు. అలా వచ్చిన మునులకు సకల మర్యాదలు చేసి బంగారు ఆసనం పై కూర్చోబెడతాడు. తర్వాత పరమాత్ముని అనేక విధాలుగా స్తుతిస్తూ కొనియాడతారు.అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. మీ పాదపద్మ సందర్శనార్థం వచ్చాం మా కోరిక తీరింది ఇక సెలవు అంటూ ద్వారక సమీపంలోని పిండారకతీర్థం సందర్శించడానికి బయలుదేరుతారు. అక్కడ కొంతమంది యాదవ బాలురు మదమెక్కి శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడికి అ...

జ్ఞాపకాలు

ఊరంటే ఒక బడి, తపాలా కార్యాలయం, పంచాయతీ కార్యాలయం ముఖ్యంగా ఉంటాయి. గోడ మీద ఎర్ర డబ్బా తగిలించి ఉన్న కార్యాలయానికి ప్రతిరోజు ఏదో ఒక పని మీద వెళుతూనే ఉండేవాళ్ళం. క్షేమ సమాచారం పంపడానికి అదొక్కటే ఆధారం. ముఖ్యంగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రజా సేవలో మునిగి తేలిపోయేవాళ్ళు. ఒకరు పోస్ట్ మాస్టారు రెండవది పోస్ట్ మాన్ గారు. "మాస్టారు, హైదరాబాద్ ట్రంకాల్ ఒకటి బుక్ చేయాలండి!" అని అడిగితే "నెంబర్ చెప్పండి..." అని అనేవారు పోస్టుమాస్టారు. ఆ మాటల్లో ఒద్దిక ఉండేది, ఆ స్వరం ఓ అధికారి మాదిరిగా ఉండేది కాదు. ఒక ట్రంకాల్ కాల్ బుక్ చేస్తే...  పోస్టాఫీసు ముందు కుర్చీలు ఉండేవి, ఒక పట్టరాని ఆశతో కూర్చొని ఉండేవాళ్లం. అరగంట...ఒక్క గంట... ఏ టైమ్ అన్నా వచ్చే గ్యారంటీ లేదు. "లైన్ బిజీ", "కనెక్ట్ కాలేదు", "రిపీట్ చేయాలి"... ఇవన్నీ మామూలే. కాల్ కలిస్తే – అదో గోల్డెన్ ఛాన్స్! ఒకవేళ ముంబైలో ఉన్న అక్కతో మాట్లాడాలి అనుకుంటే, "బాగున్నావా? పిల్లలు బాగున్నారా?" అన్న రెండు ప్రశ్నలకే కాల్ అయిపోతుండేది. కాస్త ఎక్కువ మాట్లాడారంటే, "హలో! హలో! వినిపించట్లేదు!" అ...

రహదారి భద్రత

భద్రం కొడుకో రహదారి మీద సాగేటప్పుడు ! భద్రం చెల్లెమ్మ వాహనం నడిపేటప్పుడు ! అది రహదారి  మందిని గమ్యం చేర్చే ప్రభుత్వ దారి  ఆటలు ఆడే  మైదానం కాదు విన్యాసాలు ప్రదర్శించడానికి మన ఇల్లు అసలే కాదు మూడు కాలాలలోనూ ముక్కంటి లా   రహదారి మీద కాపాడే పోలీస్ అన్న ఆజ్ఞలు పాటించు  బాధ్యత గుర్తెరిగి భద్రంగా ఇంటికి తిరిగి రా ! లైసెన్స్ అడిగితే సైలెంట్ అయిపోకు. నోట్ల కట్ట చూపించి తప్పుని ఒప్పు చేయకు.  రహదారి నియమాలు  తెలుసుకుని ముందుకు కదులు అది తెల్ల చారల గుర్రం కాదు  పాదచారులను భద్రంగా రహదారి దాటించే మార్గం.  మితిమీరిన వేగం మన లక్ష్యం కాదు  సురక్షిత గమ్యం మన ఆశయం  మార్గంలో వేగం పరిమితి తెలుసుకో  విలువైన ప్రాణం కాపాడుకో కుడి ఎడమలు మర్చిపోకు ఎడమవైపు ప్రయాణమే  ప్రభుత్వ ఆదేశం  రహదారి సంకేతాలు  మన పాలిట వరాలు.  ఎరుపు రంగు సంకేతం  మన ముందరకాళ్లకు బంధం  అడుగు ముందుకు వేయాలంటే  ఆకుపచ్చ రంగు పడవలసిందే. సూటు బూటు కాదు  రెండు చక్రాల బండి ఎక్కితే  శిరోరక్షణ కవచం ముఖ్యం  జోరుగా హుషారుగా   షి ...

స్నేహం ముసుగులో

ఇదే రామకృష్ణ ఇల్లు అనుకుంటా! ఏమి మార్పు లేదు. అప్పట్లోనే పడిపోతున్నట్టుగా ఉండేది. కొద్దిగా రిపేర్లు చేయించినట్టున్నారు. ఊరంతా మారిపోయింది. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారు. తారు రోడ్లు వేశారు. పూరిపాకలు తక్కువగా కనబడుతున్నాయి. అవును, ఇది రామకృష్ణ ఇల్లే. ఇంటి ముందు దుమ్ము కొట్టుకుపోయిన మగ్గం అలాగే ఉంది. అవతల అరుగు మీద ఎన్నిసార్లు ఆడుకున్నామో! ఎన్నాళ్ళయిందో వాడిని చూసి… అసలు నన్ను గుర్తుపడతాడా లేదా? ఎప్పుడో చిన్నప్పుడు ప్రతి ఏటా అమ్మమ్మని చూడడానికి వచ్చినప్పుడు ఎక్కువగా వీడితోటే ఆడుకునేవాడిని. నా కంటే రెండేళ్లు పెద్ద. అప్పట్లోనే వాళ్ల నాన్నకి సాయం చేసేవాడు. నేను వచ్చానంటే వాళ్ల నాన్న – "ఆడుకో!" అంటూ పంపించేవాడు. పాపం, వాళ్ల నాన్న మగ్గం నడిపితే గాని బ్రతుకు గడిచేది కాదు. ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చి, "రామకృష్ణ!" అని గట్టిగా పిలిచాను. "లేరండి, బయటకి వెళ్లారు!" – ఎవరిదో పిల్లల గొంతు వినిపించింది. "నా పేరు ప్రవీణ్. నీవు, నేను రామకృష్ణ ఫ్రెండ్స్. అమెరికా నుంచి వచ్చాను" అని చెప్పండి అని పిల్లాడితో చెబుతూనే వెనక్కి తిరిగి వెళ్తుండగా, తలుపు తెరచిన చప...

పేరంటం

ఏమిటి ఇవాళ కూడా శనగ ల వేపుడేనా! అని అడిగాడు రాజారావు భోజనం వడ్డిస్తున్న భార్య సుమతిని.  అవునండి! శ్రావణమాసం నోములు కదా! పేరంటానికి వెళ్లొచ్చాను అంది సుమతి.  ఈ వారంలో అప్పుడే రెండోసారి! శనగల వేపుడు ఏమిటో అని విసుక్కున్నాడు రాజారావు వచ్చిన శనగ లు పారేసుకుంటామా ఏమిటి! ఇది దేవుడి ప్రసాదంలాటి దేరా అంది అమ్మ వాకిట్లోంచి.  నీకు గుర్తు లేదేమిటి రా! చిన్నప్పుడు మీ పిన్ని తో పాటు నువ్వు కూడా పేరంటానికి వెళ్లే వాడివి. కోతి పేరంటాలని ఏడిపించేవారు. దాని అర్థం తెలియక అదే మాట పదేపదే సార్లు ఇంటికి వచ్చి అనుకుంటూ ఉండేవాడివి. మేమంతా నవ్వే వాళ్ళము అంది అమ్మ. అప్పుడు మీరు అంతా పచ్చి శనగలు బొక్కేసేవారు అoది అమ్మ. ఇప్పుడు శనగల వేపుడు అంటే అలా మొహం అలా చిట్లించుకుంటావు ఏంటి అంది అమ్మ వాకిట్లోంచి. అవును శ్రావణ మాసం అంతా పేరంటం హడావుడి. నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు వాయినాలు ఇంటి నిండా శనగలే. చిన్నప్పుడు తెలియక వాయినాలలో ఇచ్చిన పచ్చి శనగలు తింటే పెద్దవాళ్లు తిట్టేవారు. నిజానికి వాళ్లు తిట్టినట్టుగానే మర్నాడుకడుపు నొప్పి వచ్చేది. శనగలు ఒకటే కాదు దాంతోపాటు ఇచ్చిన పచ్చి చలిమిడి తీయగా ఉం...

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.  ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే తారని మెరి...

వాచ్ మెన్

మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఆకాశం అంతా దట్టంగా నల్ల మబ్బు పట్టి, ఒకటే ఈదురు గాలులు. "ఏమిటి వర్షం వస్తుందా?" అనుకుంటూ సుమతి కుర్చీలోంచి లేచి, మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకు రావడానికి వెళ్లింది. మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకుని లిఫ్ట్‌లో నాలుగో ఫ్లోర్‌కి వస్తుండగా, చేతిలో సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. "హలో!" అనగానే... "సుమతి! పిల్లలు ఇంటికి వచ్చారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయా? ఫ్రిజ్‌లో పాలు ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు ఉన్నాయా? పిల్లలకు తినడానికి ఏమైనా ఉన్నాయా?" అంటూ కంగారుగా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్నాడు సుమతి భర్త సుధాకర్. "ఏంటండీ? మీరు ఇలాంటివి ఎప్పుడూ అడగరు కదా! నేనే కదా బజార్‌ నుంచి తెచ్చుకుంటాను," అంటూ నిష్టూరంగా మాట్లాడిన భార్య మాటలకు కోపం తెచ్చుకోకుండా... "నువ్వు టీవీ చూడటం లేదా? రేపు మన విశాఖపట్నానికి చాలా ప్రమాదకరమైన తుఫాను వస్తోంది. సిటీ చాలా హడావుడిగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తుఫాను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు అన్ని స్క...

సోషల్ మీడియా బంధాలు

అంశం :సోషల్ మీడియా బంధాలు నేటి బంధాలకు – డిజిటల్ స్క్రీన్‌లే వేదికలు. మాటల్లో మాధుర్యం తగ్గింది, ఇమోజీల లాలిత్యమే మిగిలింది. లైకు పెడితే ప్రేమేనా? కామెంట్ రాలేకపోతే విరోధమా? వాట్సాప్ స్టేటస్‌లలో దాగిన పిలుపులు, కాల్ చేయకుండానే "బిజీ!" అనుకునే మనసులు. ఒకప్పుడు బంధాల బీజంగా మొలిచిన స్నేహాలు – ఇప్పుడు నెట్‌వర్క్‌ పరిచయాల్లో కలిసిపోయాయి. బంధం ఒక ట్యాగ్‌ అయింది, ప్రేమ ఒక హ్యాష్‌. ఫొటోలకు ఫిల్టర్లు, నవ్వులకు స్టిక్కర్లు, కానీ మనసుకు మాత్రం మాస్క్‌ తొలగించలేము. విష్‌లు ఫార్వర్డ్‌ చేస్తాం – దూర మిత్రునికి, కానీ పక్కనుండే వారిని పలకరించకుండా వెళ్తాం. గడియారం ముందుకు పరుగెడుతుంది, బంధాలు మాత్రం వెనక్కి జారిపోతున్నాయి. వాస్తవ ప్రేమకు వెబ్ అడ్రెస్ అడిగే కాలం ఇది, కన్నీళ్లు కూడా ఇప్పుడు సింక్‌ అవ్వాలి! ఓ మిత్రమా! స్క్రీన్‌ను కాసేపు పక్కన పెట్టు, నన్ను చూడు – నేను ఈ డిస్‌ప్లే కంటే లోతైనవాడిని. బంధం నెమ్మదిగా నడవాలి – చేతులు పట్టుకుని, ఫాలోలు కావు, పక్కనుండే నీడ కావాలి. ఓర్పు, ఆసక్తి, ఆత్మీయత – ఇవే నిజమైన కనెక్టివిటీ, సిగ్నల్స్ కంటే మనసులే శాశ్వతమైన నెట్‌వర్క్‌. నువ్వు పక్కనుంటే – నోటిఫికేష...