పోస్ట్‌లు

పెళ్లి దొంగ

పెళ్లి దొంగ " అయ్యా సోమేశ్వరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి. అన్నిచోట్ల వెతికాము. ఆరోజు లెక్క కట్టి అప్పచెప్పాము మీకు .వీటి ఖరీదు మీరు భరించవలసిందే. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో వీటి ఖరీదు తగ్గించుకుంటాము అంటూ కన్యకా పరమేశ్వరి సత్రం గుమస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లు అయింది సోమేశ్వరావుకి.  ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఈ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు. బయట పని వాళ్ళు ఎవరూ రాలేదు.మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మగ పెళ్లి వారు ఆ మాట పైకి అనడానికి వీలు లేదు. మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడుతా రు.   అవును ఆ ఇత్తడి గ్లాసులు దుక్కల్లా ఉన్నాయి. పెళ్ళి వారి విడిదిలోకి కాఫీ కోసమని మంచినీళ్ల కోసం అని పంపించిన గ్లాసులు. బాగా గుర్తున్నాయి. ఏమిటో ఈ సమస్య. ఏమీ ఎవరిని అడగడానికి వీలులేదు. పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు.  మగ పెళ్లి వారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రం అంతా ఎప్పుడు తిరుగు...

అవును ఆయన చనిపోలేదు

అవును ఆయన చనిపోలేదు !. " నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్లొచ్చాం. ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తాం అంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు." ఎంత మంచివాడు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలోరకంగా చెప్తున్న మాటలు పరంధామయ్య భార్యకి తలకెక్కట్లేదు. ఒకపక్క భర్త పోయిన బాధ ఇంకొకపక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం బంధువులు ఏమనుకుంటారు అని మరొక పక్క భయం.  పోనీ పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. మరి పరంధామయ్య నాలుగు వేదాలు చదువుకున్నవాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి? మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది. " ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దీన్ని కచ్చితంగా నువ్వు పాటించాలి. ఇది నా కోరిక. నా వయసు అరవై సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు.  మనిద్దరిలో ఎవరు ముందో తెలియదు. కానీ నేనే ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజీకి దానం ఇచ్చే...

నాటకం

నాటకం. ఉదయం పది గంటలు అయింది. అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రామరాజుకి ఎవరో ఇద్దరు మధ్య వయస్కులు స్కూటర్ మీద వచ్చి" నాటకాలు వేసే రామరాజు గారి ఇల్లు ఇదేనా అని అడిగారు. అవునండి మీరు అంటూ కుర్చీలోంచి లేచి నేనే రామరాజు ని అంటూ అరుగు మీదనున్న తాటాకుల చాప చూపించి కూర్చోమని చెప్పాడు రామరాజు. మేము సఖినేటిపల్లి నుండి వస్తున్నాము. మా ఊరిఅమ్మవారు సంబరాలకి శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించుదామని దానికోసం మిమ్మల్ని కలవడానికి మాట్లాడడానికి వచ్చాము అంటూ చెప్పారు.  ఏంటి బాబు మీరు చెప్పేది నిజమేనా! నేను కలగనటం లేదు కదా! అంటూ రామరాజు అయినా ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తున్నారు అండి. మీరు ఏదో పరాచకాలు ఆడుతున్నారు నాతో అన్నాడు. లేదండి మా ఊర్లో ఉన్న మీ పాత తరం వాళ్ళ కోరిక ప్రకారం ఈ నాటకం వేయించుదామని అనుకుంటున్నాం. నవతరానికి కూడా ఆ పాత ఆణిముత్యాలు లాంటి నాటకాలు అంటే అభిమానం పెరిగేలా చేయాలని సంకల్పించాం.ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈ లోగా మీరు రిహార్సల్స్ డ్రెస్సులు చూసుకోవాలిగా. అందుకనే ముందుగా చెబుతున్నాం.  అడ్వాన్స్ ఇచ్చి వెళదామని వచ్చాం అంటూ చెప్పిన ఆ యువకుల మాటలకి రామరా...