కుర్చీ

మూగదే కాని మంచి మర్యాదతో మెలిగేది.
కుల మతాల కుళ్లు లేనిది
నాలుగు కాళ్ళు ఉన్నా నడలేనిది
నలుగురి నోట్లో నిత్యం నలిగేది
అలసి సొలసి వచ్చిన వాళ్ళకి ఆశ్రయo ఇచ్చేది .
కుర్చీ.
అధికారికి దర్పం ఇచ్చేది కుర్చీ.
నాయకుడికి అధికారం ఇచ్చేది కుర్చీ.
ప్రాణం పోసే వైద్యుడు ఈ కుర్చీలో కూర్చొనే వైద్యం.
అందమైన ప్లానులు గీసే ఇంజినీర్ కి ఇదే ఆధారం.
అతిథులను కుర్చీ చూపించి సాదరంగా ఆహ్వానo.
విద్యార్థికి పాఠాలు చెప్పే మాస్టారు కుర్చీకే అందం.

నోట్లో ముద్ద దిగాలంటే ఎక్కాలి డైనింగ్ టేబుల్ కుర్చీ.
Software ఉద్యోగికి ప్రత్యేకం కంప్యూటర్ కుర్చీ.
సామాన్యుడికి చౌకగా దొరికే కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ.
తర తరాలుగా మనతో ఉన్నవి చెక్క కుర్చీలు.
నగిషీ పనితనం తో మెరిసిపోతున్నాయి తరతరాలు.
కాలు చెయ్యి విరిగితే చెక్కు చెదరకుండ చెయ్యచ్చు.
గత వైభవాన్ని మరల తీసుకురావచ్చు చెక్కముక్కకి.
 ప్లాస్టిక్ ముక్కతో గుప్పెడు పప్పు బెల్లాలు కడుపు నింపచ్చు.
     కుర్చీ కాలికి అడ్డం వస్తే నోటికి వచ్చినట్లు తిడతాo.
      అతిథులకు కుర్చీలు చాలకపోతే కంగారుపడతాo.

      బలంగా ఉన్న బక్కగా ఉన్న కిమ్మనకుండా మోస్తుంది
      ఈ బంగారం.
       బుడ్డి దానితోపాటు భోగి పళ్ళు పోయించుకుని దిష్టి 
       తీయించికుంటుంది ఈ సింహాసనం.

      మా మానవ జాతికి నీతోనే తరతరాల అనుబంధం.
      చెక్క ముక్కయినా మా మనసులో చెదరని నీ నామం.

       కుర్చీలో కూర్చుంటే చాలు మానవునికి కునికిపాట్లు.
        మూగజీవులను సైతం ఆదరించే అనువైన చెక్క కట్లు.
        మానవాళి అంతా నేర్చుకోవాలి నీ నుండి పరోపకారం
       
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ
          9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట